hash tag
-
Prabhas: అరుదైన రికార్డ్
హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్లో అభిమానులను అలరిస్తున్నారాయన. రేర్ కాంబినేషన్స్, రికార్డ్ స్థాయి బాక్సాఫీస్ నంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్... ఇలా అన్ని అంశాల్లో ఎన్నో రికార్డులు, ఘనత సాధించిన ప్రభాస్ తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా లిస్టులో నిలిచిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించారు ప్రభాస్. ట్విట్టర్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. తమ అభిమాన హీరో సాధించిన ఈ క్రెడిట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 9న విడుదల కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. మంచు విష్ణు టైటిల్ రోల్లో రూ΄÷ందుతున్న ‘కన్నప్ప’లో కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలషూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. -
ప్రధాని మోదీ సోషల్ మీడియా సన్యాసం!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సోమవారం వెల్లడించారు. ‘ఈ ఆదివారం నుంచి ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నా’ అని సోమవారం ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. సంబంధిత వర్గాలను సంప్రదించగా, భవిష్యత్ ప్రణాళిక త్వరలో వెల్లడించే అవకాశముందని తెలిపాయి. మోదీ తాజా నిర్ణయం సంచలనాత్మకంగా మారింది. గంటలో 26వేల సార్లు రీట్వీట్ అయింది. క్షణక్షణానికో కామెంట్ వచ్చింది. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివిధ ఎమోజీలతో స్పందించడం ప్రారంభించారు. నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ అదే సోషల్ మీడియా కేంద్రంగా ’నో సర్’ అని వేలాదిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ‘నో సర్’ ట్రెండవుతున్న హ్యాష్ట్యాగ్గా మారింది. ‘ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులున్నారు. కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండి. కానీ పూర్తిగా వదిలేయవద్దు’ అని ఓ నెటిజన్ అభ్యర్థించారు. ‘నేను మోదీజీ అభిమానిని. ఆయన వదిలేస్తే.. సోషల్ మీడియాను నేనూ వదలేస్తా’ అని మరో యూజర్ హెచ్చరించారు. మరోవైపు, మోదీ ట్వీట్‌పై మీమ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బ్లాక్‌బస్టర్ సినిమా ‘3 ఇడియట్స్’ సినిమా సీన్ నేపథ్యంలో ‘జానే నహీ దేంగే తుఝే’ అనే పాటను ప్లే చేస్తూ ఒక మీమ్‌ను రూపొందించారు. విద్వేషం వదలండి: మరోవైపు, విపక్షాల నుంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ‘ద్వేషాన్ని విడనాడు.. సోషల్ మీడియాను కాదు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. ‘మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కాదు.. వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసే, బెదిరించే, హెచ్చరించే మీ ఆర్మీకి ఈ సలహా ఇవ్వండి– ఇట్లు భారత పౌరులు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జెవాలా వ్యంగ్య ట్వీట్ చేశారు. టాప్ ’సోషల్’ స్టార్: ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్బుక్లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. -
కొత్త మహిళాస్త్రం స్మాష్‌బోర్డ్
కేవలం హ్యాష్‌ట్యాగ్ మూమెంట్లకే పరిమితం కాకుండా.. డిజిటల్ వీధుల్లో చేదు అనుభవాల బారిన పడుతున్న వారికి మద్దతు లభించేలా చేయడం, వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడమే ఈ సోషల్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం. గట్టిగా మాట్లాడినా.. అభిప్రాయాలను కచ్చితంగా చెప్పినా.. ఫొటోలు అప్లోడ్ చేసినా.. ఆఖరికి తమకు జరిగిన అన్యాయంపై నిర్భయంగా నోరు విప్పినా.. ఏదో నేరం చేసిన వాళ్లలాగా మహిళలను చిత్రీకరించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత స్త్రీవాదులు మొదలు సామాన్య మహిళల వరకు ప్రతీ ఒక్కరూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. రాయడానికి కూడా వీల్లేని అసభ్య, పరుష పదజాలంతో చిన్మయిని దూషించిన ఎందరెందరో మహానుభావుల సంస్కారం ఆ కామెంట్లలో ప్రస్ఫుటిస్తుంది. తిరగబడితే బురద గౌరవప్రదమైన హోదాలో ఉండి, పెద్దమనిషిగా చలామణీ అవుతున్న వైరముత్తు లాంటి ఎంతోమంది వ్యక్తులపై వచ్చిన ఆరోపణల గురించి కనీసం ఆలోచించకపోగా.. వారు ఏం చేసినా సరైందే అన్న రీతిలో ఉండే ట్వీట్లు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడతాయి. ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న చిన్మయిలు ఎందరో. ఇలాంటి వారికోసం నుపుర్ తివారీ అనే జర్నలిస్టు తన బృందంతో కలిసి ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించేందుకు, బాధితుల సమస్యల తీర్చేందుకు వీలుగా ‘స్మాష్‌బోరు’్డ పేరిట యాప్‌ను తీసుకువచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీవాదులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్‌ను ఢిల్లీలోని మిరాండా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. కేవలం హ్యాష్‌ట్యాగ్ మూమెంట్లకే పరిమితం కాకుండా.. డిజిటల్ వీధుల్లో చేదు అనుభవాల బారిన పడుతున్న వారికి మద్దతు లభించేలా చేయడం, వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడమే ఈ సోషల్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం. అదే విధంగా బాధితుల గోడు వెళ్లబోసుకునేందుకు.. వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు.. ఈ యాప్ తోడ్పాటునందిస్తుంది. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడే మహిళలు, పురుషులు, థర్డ్‌జెండర్ (ట్రాన్స్ మెన్ లేదా ట్రాన్స్ ఉమన్) ఇలా ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యులు కావొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. అందుకే స్మాష్‌బోర్డు స్మాష్‌బోర్డు యాప్ గురించి నుపుర్ తివారీ మరింత వివరంగా చెబుతారు. ‘‘బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా నోరు విప్పేలా చేయాలనే ఆలోచనే స్మాష్‌బోర్డు రూపకల్పనకు కారణం. న్యాయవాదులు, జర్నలిస్టులు, సైకాలజిస్టులు వంటి వివిధ రంగాల నిపుణులు దీనితో ఎంతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి బాధితులు తమ సమస్యలు, మానసిక స్థితి గురించి వీరికి చెప్పుకోవచ్చు. కేవలం బాధితుల కోసమే కాకుండా పురుషాధిక్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంతోమందిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతోనే ఈ యాప్ ప్రారంభించాం. దీని వల్ల మన ఆలోచనల్ని మనలా ఆలోచించగల వ్యక్తులతో పంచుకునే వీలు కలుగుతుంది’’ అని నుపుర్ తెలిపారు. త్వరలోనే ఈ యాప్‌ను ప్రాంతీయ భాషల్లో తీసుకువచ్చే అవకాశం ఉంది. అద్భుతమైన ఆలోచన ‘ది వెజీనా మోనోలాగ్స్ ఫేం’ ఈవ్ ఎన్స్లర్ (స్త్రీలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్యకర్త) ఈ యాప్ గురించి మాట్లాడుతూ.. ‘ఇదొక ఆద్భుతమైన ఆలోచన’ అని కొనియాడారు. మహిళలు నిర్భయంగా తమ గాథలను, అనుభవాలను చెప్పుకొనేందుకు గొప్ప వేదిక స్మాష్‌బోర్డు అని పేర్కొన్నారు. ఈ సోషల్ నెట్‌వర్క్‌లో అందరూ స్త్రీవాదులే ఉన్న కారణంగా బాధితులు తమ సమస్యలను మరింత ధైర్యంగా ఇతరులతో పంచుకోగలుగుతారన్నారు. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ -
'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'
సాక్షి, కీసరగుట్ట(మేడ్చల్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' చాలెంజ్‌లో భాగంగా కీసరగుట్టలోని రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 2,042 ఎకరాల అటవీ ప్రాంతంలో తన వంతుగా ఎకో టూరిజం పార్కు, అటవీ పునరుజ్జీవన అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతూ సంతోష్ కుమార్ పలువురు ప్రముఖులను 'గిఫ్ట్ ఏ స్మైల్'కు హ్యాష్ ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన వారిలో మాజీ ఎంపీ కవిత, సినీ హీరోలు విజయ్‌దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్‌లు ఉన్నారు. -
హ్యాష్‌ట్యాగ్‌లు..గెలుపు మంత్రాలు !
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఒకప్పుడు ఎన్నికలంటే నినాదాలే. అవెంత కొత్తగా ఉంటే జనాన్ని అంతగా ఆకర్షించేవి. రోటీ కపడా ఔర్ మకాన్ అన్నా, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్నా జనంలోకి ఎంత బలంగా వెళ్తే పార్టీకి ఎన్నికల్లో అంతలా ఓట్లు కురిసేవి. ఇప్పుడు కాలం మారింది. ఇవాళ రేపు అందరూ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. అందులో ట్రెడ్డింగ్‌లో ఉన్న అంశాలంటే అందరికీ ఎక్కడ లేని ఆసక్తి. అవే హ్యాష్‌ట్యాగ్‌లు. ఆ హ్యాష్‌ట్యాగ్ ఎంత క్యాచీగా ఉంటే నెటిజన్లను అంతగా ఆకర్షిస్తుంది. ఎన్నికల నినాదాలకు మించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు కొందరు కన్సల్టెంట్లను కూడా నియమిస్తున్నారు. మండే ఎండలతో పోటీ పడేలా బయట ఎండల వేడి. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ల హీట్. ప్రతీ పార్టీ రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు, పరారీలో ఆర్థిక నేరగాళ్ల నేపథ్యంలో రాహుల్‌గాంధీ చౌకీదార్ చోర్ హై (కాపాలదారుడే దొంగ) అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో తన పేరుకి ముందు చౌకీదార్ అని తగిలించుకోవడంతో అది వైరల్‌గా మారింది. అంతే కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు, సోషల్ మీడియాలో మోదీ వీరభక్తులు తమ పేరు మందు చౌకీదార్ అని తగిలించుకోవడం మొదలు పెట్టారు. మైన్బీ చౌకీదార్ హ్యాష్‌ట్యాగ్ (నేను కూడా కాపలాదారుడినే) సోషల్ మీడియాలో ఇప్పుడు క్రేజ్‌గా మారింది. ఇలాంటి క్యాచీ హ్యాష్‌ట్యాగ్‌లే ఎన్నికల్లో ప్రభావితం కూడా చూపిస్తాయన్న అభిప్రాయం చాలా మందిలో నెలకొంది. తెలంగాణలో బీజేపీ సోషల్ వార్ రూమ్‌లో పనిచేస్తున్న లావణ్య శెట్టి ఎన్నికలంటే ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికుడిలా పోరాడాలని అన్నారు. ‘సైనికుడంటే సరిహద్దుల్లో తుపాకులతో కాపలా కాయాల్సిన పని లేదు. మన దేశ దశ దిశను నిర్ణయించే ఎన్నికల్లో పనిచేయడం అంటే ఓ రకంగా యుద్ధం చేస్తున్నట్టే. ఇలాంటి సమయంలో పార్టీ విజ యం కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడే‘ అని వ్యాఖ్యానించారు. సోషల్ సైన్యం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల విస్తీర్ణానికి అనుగుణంగా 20–30 మందితో ఐటీ సెల్ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ గ్రూప్స్, యూ ట్యూబ్, టెలిగ్రామ్‌లలో చురుగ్గా ప్రచారం. గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుసంధానం పెరగడానికి హిందీతో పాటు ఇతర 15 ప్రాంతీయ భాషల్లో ఎన్నికల ప్రచారం బీజేపీ సొంతంగా సృష్టించిన నమో యాప్‌తో దేశం నలుమూలలా ఉన్న వివిధ వర్గాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతీ పన్నా ప్రముఖ్ వ్యూహ రచనలో మునిగితేలిన ఆర్ఎస్ఎస్.. బూతు స్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ 15– 20 మంది వృత్తి నిపుణులు, పార్టీ కార్యకర్తలతో రాష్ట్రాల స్థాయిలో ఐటీ సెల్స్.. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రత్యేక సెల్స్ ఏర్పాటు ఘర్ ఘర్ కాంగ్రెస్ యాప్, శక్తి యాప్ ద్వారా ఎన్నికల ప్రచార నిర్వహణ.. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ గ్రూప్స్‌లో చురుగ్గా కార్యకర్తలు.. నెటిజన్లను ఆకర్షించే హ్యాష్ ట్యాగ్స్, గ్రాఫిక్స్, మీమ్స్ రూపొందించడానికి ప్రత్యేక సాంకేతిక బృందాలు కేంద్రం లోటుపాట్లను ఎత్తి చూపించడానికి ప్రత్యేక బృందాలు.. ఎన్నికలూ ఉద్యోగాలిస్తాయ్ .. ఉద్యోగాల్లేవని యువత రోడ్డెక్కి నిరసనలు చేస్తూ ఎన్నికల్లో తమ పవర్ చూపించడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు అవే ఎన్నికలు చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సోషల్ మీడియాపై అవగాహన ఉండి, రాజకీయాలు లోతుగా అర్థం చేసుకోగలిగి, వీడియో ఎడిటింగ్‌లో నైపుణ్యం, కాస్తో కూస్తో సృజనాత్మకత ఉంటే చాలు ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్, షేర్‌చాట్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సంస్థలు రా రమ్మంటూ ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈ ఉద్యోగాలు ఏంటంటే కంటెంట్ మేనేజర్స్ కంటెంట్ ఎడిటర్స్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ ఫ్యాక్ట్ చెకర్స్ వీళ్ల పనేంటంటే నిరంతరం ఆ యాప్‌లను పర్యవేక్షిస్తూ, అం దులో వస్తున్న అంశాల్ని గమనిస్తూ ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినా, తప్పుడు వార్తల్ని ప్రచారం చేసినా, ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా అవమానించేలా పోస్టులు, మీమ్స్ పెట్టినా వెంటనే సదరు యాజ మాన్యాల దృష్టికి తీసుకువెళ్లాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేలా ఫేస్బుక్ వ్యవహరించి ఆ దేశ కాంగ్రెస్ ముందు విచారణకు కూడా జుకర్‌బర్గ్ హాజరు కావడంతో ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియా దిగ్గజాలు ముందు జాగ్రత్త వహించాయి. ఈ ఎన్నికల సీజన్లో వివిధ సంస్థలు 13 వేల ఉద్యోగాలు కల్పించాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ 15 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఫేస్బుక్ 6,500 మంది సమీక్షకుల్ని నియమించినట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఫేస్బుక్లో పోస్టులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వెంటనే ఈ బృందాలు వాస్తవాలను పరి శీలించి సదరు అకౌంట్లను రద్దు చేస్తాయి. ఇక ఫ్యాక్ట్ చెకర్స్ ఉద్యోగాలకే ప్రస్తుతం డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏది రియలో, ఏది వైరలో తెలుసుకోవడం కష్టంగా మారింది. భారత దేశంలోని 15 భాషల్లో వచ్చే కంటెంట్‌ని జల్లెడ పట్టడం మామూలు విషయం కాదు. అందుకే వారికే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. భారత్ ఎన్నికల్లోనైనా తమ పరువు నిలుపుకోవడానికి ఫేస్బుక్ థర్డ్ పార్టీ ద్వారా 2 వేల మంది ఫ్యాక్ట్ చెకర్స్ని నియమించింది. గత ఏడాదితో పోలి స్తే ఈ ఏడాది కంటెంట్ మేనేజర్, కంటెంట్ ఎడిటర్ ఉద్యోగాలు 72% పెరిగాయని జాబ్ సెర్చ్ ఇంజన్ ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశికుమార్ వెల్లడించారు. కంటెంట్ మేనేజర్స్‌కి జీతాలు కూడా బాగానే ఇస్తున్నారు. ఏడాది అనుభవం ఉంటే చాలు ఈ ఎన్నికల సీజన్లో నెలకి 30 వేల వరకు సంపాదించవచ్చు. అదే అయిదేళ్ల అనుభవం ఉంటే 50 వేల రూపాయల వరకు ఇస్తున్నట్టు సోషల్ మీడియా సంస్థల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థుల్ని పంపించే ఇన్ఫోసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ రావు చెప్పారు. ఇక అప్పుడే డిగ్రీ చేసిన వారికి కూడా కంప్యూటర్ పరిజ్ఞానంలో దిట్టలైతే చాలు వాళ్లకి ట్రైయినింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఆయన వివరించారు. మొత్తం ఓటర్లు : 90 కోట్లు ఇంటర్నెట్ వాడే ఓటర్లు : 50కోట్లు 18–19 ఏళ్ల వయసు వారు : 1.5కోట్లు ఫేస్బుక్ వాడేవారు : 29.4 కోట్లు వాట్సాప్ వాడేవారు : 25 కోట్లు ట్విటర్ వాడేవారు : 3 కోట్లు ఇన్స్టాగ్రామ్ వాడేవారు : 6–8 కోట్లు -
ఓటుపై ‘ఇంటెన్సివ్’ వేటు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో శుక్రవారం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షలాది మంది ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. వేలాదిమంది ప్రజలు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ‘నా ఓటు ఏమైంది’ (#whereismyvote) అని ప్రశ్నిస్తూ ప్రచారోద్యమం నిర్వహించారు. జాబితాలో పేర్లు గల్లంతైన వేలాదిమంది ఈ హ్యాష్ ట్యాగ్‌ను వినియోగించి తమ నిరసన తెలియజేయడంతో ట్విట్టర్లో టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా శుక్రవారం ఈ ప్రచారోద్యమం నిలిచింది. 2014 సాధారణ ఎన్నికలు, 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నామని, తాజా శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు గల్లంతైందని చాలామంది జంట నగరాల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) పేరుతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2017లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమమే ఇందుకు కారణం. బూత్‌స్థాయి అధికారుల (బీఎల్వో)కు ట్యాబ్లెట్ పీసీలు చేతికిచ్చి ఈ 36 నియోజకవర్గాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించారు. ఈ స్థానాల్లో మొత్తం 1,09,44,968 ఓట్లు ఉండగా సర్వే అనంతరం ఏకంగా 24,20,244(22.11శాతం) ఓట్లను తొలగించారు. మరో 29,93,777(27.35 శాతం) ఓటర్లు తమ ఓట్లను కొత్త చిరునామాలకు బదిలీ చేసుకున్నారు. సర్వే తర్వాత 55,30,947 (50.53శాతం) ఓట్లు మాత్రమే ఉన్న చిరునామా ల్లోనే మిగిలాయి. ఈ సర్వేలోనే కొత్తగా 5,82,138 (6.4శాతం) ఓట్లను చేర్చారు. ఈ సర్వే ముగిసిన తర్వాత చివరికి 91,06,862 ఓట్లు జాబితాలో మిగిలాయి . ఈ వివరాలను నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) అనూప్‌సింగ్ 2017 డిసెంబర్ 5న విలేకరుల సమావేశంలో ప్రకటించారు. విచారణ జరపని ఎన్నికల సంఘం ప్రధానంగా నగర, పట్టణ ప్రాంతాలు కలిగిన ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, పటాన్చెరు, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాక త్పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లలో ఈ సర్వే జరిగింది. ఈ 36 నియోజకవర్గాల తుది ఓటరు జాబితాను గత జనవరి 20న ప్రకటించారు. ఐఆర్‌ఈఆర్ పేరుతో నిర్వహించిన ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దొంగ ఓట్ల పేరుతో సరైన విచారణ లేకుండానే అడ్డగోలుగా ఓట్లను తొలగించినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించకుండానే ఓట్లను తొలగించినట్లు విమర్శలున్నాయి. అయినా, తొలగించిన ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం విచారణ నిర్వహించకపోవడంతో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్షలమంది ఓట్లు గల్లంతు అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలోని లోపాలపట్ల చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా ఎన్నికల సంఘం ముందు నుంచి మొండిగా వ్యవహరించిందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్విట్టర్లో ‘మీటూ అర్బన్ నక్సల్’ ట్రెండింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల కార్యకర్తలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీరిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పలువురు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో ట్విట్టర్లో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. తొలుత బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ..‘అర్బన్ నక్సల్స్‌కు మద్దతు ఇస్తున్నవారి జాబితా రూపొందించేందుకు చురుకైన యువతీయువకులు కొందరు నాకు కావాలి. సాయం చేయాలనుకున్నవారు నాకు సందేశం పంపండి’ అని ట్వీట్ చేశారు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు సహా చాలామంది అగ్నిహోత్రిపై మండిపడ్డారు. హక్కుల కార్యకర్తలకు తమ మద్దతును తెలియజేసేందుకు వేలాది మంది ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాగ్‌ట్యాగ్‌ను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 55,000 మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ చేశారు. 128 సంస్థలకు మావోలతో సంబంధాలు! మావోలతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలతో 2012లో యూపీఏ ప్రభుత్వం జాబితా రూపొందించిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కొందరు ఆ సంస్థల సభ్యులు ఉన్నారన్నారు. మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో పౌరహక్కుల కార్యకర్తలను అరెస్ట్‌చేయడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు యూపీఏ నాటి జాబితాను తెర మీదికి తెచ్చారు. ‘మావోయిస్టులతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలను 2012లోనే యూపీఏ ప్రభుత్వం గుర్తించింది. వాటి కోసం పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనాడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. జాబితాలో ఉన్న సంస్థల కోసం పనిచేస్తున్న వారిలో వరవరరావు, సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్సాల్వెజ్, మహేశ్ రౌత్‌లు కూడా ఉన్నారు’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. -
సాయానికి ‘సోషల్’ దారి
వరద ధాటికి చెల్లాచెదురైన కేరళ వరద బాధితులకు సోషల్ మీడియా ఆపద్బాంధవిగా మారి సహాయ బృందాలకు దారి చూపిస్తోంది. వరద నీటిలో చిక్కుకొని సాయంకోరే వారిలో కొందరు సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. కేరళ ఫ్లడ్స్ , కేరళ ఫ్లడ్స్ హ్యాష్ ట్యాగ్‌తో ఎక్కడెక్కడిదో సమాచారం క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. బాధితులు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.3 కోట్ల మంది వరద బాధితులు ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల ద్వారా సాయాన్ని అర్థించారు. విద్యుత్ లేక అంధకారంలో మగ్గిపోతున్న వారు, ఫోన్లైన్లు కలవక ఇబ్బంది పడుతున్నవారంతా గూగుల్ మ్యాప్ ద్వారా తమ లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో తాము ఉన్న పరిస్థితిని వీడియోలు తీసి పోస్ట్చేస్తున్నారు. తీర ప్రాంతంలోని అలాపుజాలో ఉండే అజో వర్గీస్ అనే వ్యక్తి ‘నేను, మా ఇరుగు పొరుగువాళ్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. కమ్యూనికేషన్ తెగిపోయింది. మా మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యే పరిస్థితి వచ్చింది. దయచేసి సాయం చేయండి‘ అంటూ ఫేస్బుక్లో పెట్టిన పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. లక్షల్లో షేర్స్ వచ్చాయి. షేర్ చేస్తే మార్గం తెలుస్తుంది.. గూగుల్ మ్యాప్ ద్వారా కూడా లొకేషన్‌ను షేర్ చేస్తూ ఉండటంతో సహాయ బృందాలకు అక్కడికి వెళ్లడం సులభమవుతోంది. కేరళలోనే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ బంధువుల జాడ తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాల్ని ఆశ్రయిస్తున్నారు. ‘మేము రెండో అంతస్తులో ఉన్నాం. ఇప్పటికే మొదటి అంతస్తు వరదనీటిలో మునిగిపోయింది. క్షణ క్షణానికి నీటి మట్టం పెరిగిపోతోంది. వృద్ధులు, పిల్లలు ఉన్నారు. మమ్మల్ని కాపాడండి’ అంటూ రాణిపేటకు చెందిన కొందరు పెట్టిన పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. వరద బాధితుల సాయం కోసం ప్రభుత్వం కొన్ని వాట్సాప్ నంబర్లని ప్రత్యేకంగా కేటాయించింది. ఆ నంబర్లకి లొకేషన్ షేర్ చేస్తే చాలు వెంటనే సహాయ బృందాలను పంపిస్తోంది. ట్విట్టర్‌లోని కొంతమంది టెక్నీషియన్లు కలిసి గూగుల్ మ్యాప్‌ను అనుసంధానం చేస్తూ ఒక ప్లాట్‌ఫామ్‌ని రూపొందించారు. దీని సాయంతో సహాయక శిబిరాలు, సహాయ బృందాలు, వాలంటీర్లు, ఆహారం, మందులు, రవాణా వంటి వాటికి సంబంధించిన సమాచారం అంతా క్షణాల్లో తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియా ద్వారా అందుకున్న సమాచారంతో లక్షా 50 వేల మందిని కాపాడినట్టు సమాచారం. -
నైట్ ఎఫెక్ట్... నల్లధనానికి నివాళి!
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మన నిర్ణయం సోషల్ మీడియాలో కీలక చర్చాంశంగా మారిపోయింది. అమెరికా ఎన్నికల కంటే దీనిపైనే ఎక్కువగా భారతీయులు చర్చలు మొదలు పెట్టారు. నల్లధనానికి నివాళి( రిప్ బ్లాక్ మనీ’ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. నల్లధనంకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. కొంత మంది మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. సామాన్యుల ఇక్కట్ల గురించి ఆలోచించకుండా రాత్రిరాత్రికి నోట్లు రద్దు చేయడం సమంజసం కాదని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అమెరికా ఎన్నికల అంశం రెండో ప్రాధానాంశంగా మారిపోయింది. సోషల్ మీడియాలో పెద్ద నోట్ల రద్దు గురించే ఎక్కువ చర్చ నడిచింది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన కామెంట్లు, ఫొటోలు, వీడియోలు విపరీతంగా పోస్టయ్యాయి.