నైట్ ఎఫెక్ట్... నల్లధనానికి నివాళి!
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మన నిర్ణయం సోషల్ మీడియాలో కీలక చర్చాంశంగా మారిపోయింది. అమెరికా ఎన్నికల కంటే దీనిపైనే ఎక్కువగా భారతీయులు చర్చలు మొదలు పెట్టారు. నల్లధనానికి నివాళి( రిప్ బ్లాక్ మనీ’ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. నల్లధనంకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు.
కొంత మంది మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. సామాన్యుల ఇక్కట్ల గురించి ఆలోచించకుండా రాత్రిరాత్రికి నోట్లు రద్దు చేయడం సమంజసం కాదని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అమెరికా ఎన్నికల అంశం రెండో ప్రాధానాంశంగా మారిపోయింది. సోషల్ మీడియాలో పెద్ద నోట్ల రద్దు గురించే ఎక్కువ చర్చ నడిచింది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన కామెంట్లు, ఫొటోలు, వీడియోలు విపరీతంగా పోస్టయ్యాయి.