కేటీఆర్‌ చాలెంజ్‌ను స్వీకరించిన సచిన్‌ | Sachin Tendulkar Accepts KTRs Haritha Haram Challenge | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ చాలెంజ్‌ను స్వీకరించిన సచిన్‌

Published Sat, Jul 28 2018 6:04 PM | Last Updated on Sat, Jul 28 2018 6:13 PM

Sachin Tendulkar Accepts KTRs Haritha Haram Challenge - Sakshi

ఆసక్తికర చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు సైతం..

ఇటీవల దేశ వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్‌ అవుట్‌ వీడియోలను పోస్ట్‌ చేశారు. అయితే  తాజాగా తెలంగాణ నేతలు మాత్రం పర్యావరణానికి సంబంధించిన మరో ఆసక్తికర చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) విసిరిన చాలెంజ్‌ను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్వీకరించారు. 

కేటీఆర్‌ విసిరిన హరితహారం చాలెంజ్‌ స్వీకరించిన సచిన్‌ కొన్ని మొక్కలు నాటారు. అనంతరం నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. తనను ఇలాంటి చాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు సచిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చనిచెట్లతో ఉండేలా చేయడం మన చేతుల్లోను ఉందని సచిన్‌ ట్వీట్‌ చేశారు. సచిన్‌ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ.. థ్యాంక్యూ మాస్టర్‌.. మీరు కూడా మరో ఐదుగురిని హరితహారం చాలెంజ్‌కు నామినేట్‌ చేయండి అని సచిన్‌కు సూచించారు.

హరితహారంలో లక్ష్మణ్‌ సైతం..
వెరీవెరీ స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా కేటీఆర్‌ విసిరిన హరితహారం చాలెంజ్‌ను స్వీకరించారు. గార్డెనింగ్‌ అంటే నాకు చాలా ఇష్టమని పేర్కొంటూ మొక్కలు నాటుతున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. కేటీఆర్‌ చాలా గొప్ప చాలెంజ్‌ను మొదలుపెట్టారు. నేను కూడా వీరేంద్ర సెహ్వాగ్‌, మిథాలీరాజ్‌, పీవీ సింధులను హరితహారం చాలెంజ్‌కు ఆహ్వానించారు. మూడు మొక్కలు నాటాలని తన ట్వీట్‌లో లక్ష్మణ్‌ చాలెంజ్‌ చేశారు. లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

కవిత చాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement