హైదరాబాద్: ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. 28ఏళ్ల సుదీర్గ నిరీక్షణ తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది ఈ లెజెండ్ కెప్టెన్సీలోనే. ఇక ప్రపంచకప్‌తో పాటు మూడు ఐసీసీ టోర్నీలను ధోని నాయకత్వంలోనే టీమిండియా గెలుచుకుంది. అయితే మైదానంలో తనకు కావాల్సిన ప్రదర్శనను ఆటగాళ్లను నుంచి రాబట్టుకోవడంలో ధోని దిట్ట. అయితే మ్యాచ్‌లనే కాకుండా ప్రాక్టీస్‌లోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తునే వారి ప్రతిభను గుర్తించి వెలికితీస్తుంటాడు. అంతేకాకుండా వారి లోపాలను గుర్తిస్తూ తగు సూచనలిస్తాడు. అది ఎంత పెద్ద సీనియరైనా సారథిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ధోని ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అయితే ప్రస్తుతం టీమిండియా మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్ షేర్ చేసిన వీడియో తెగహల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
సచిన్, లక్ష్మణ్‌లు ప్రాక్టీస్ చేస్తుంటే ధోని వారిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. 2008లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడు ఇన్నింగ్స్‌ల్లో లక్ష్మణ్ పూర్తిగా విఫలమవుతాడు. అయితే ఆ ఇన్నింగ్స్‌లో బౌన్సర్లకు ఇబ్బందులు పడిన లక్ష్మణ్.. సచిన్‌తో ప్రత్యేకంగా బౌన్సర్లను వేపించుకుని ప్రాక్టీస్ చేస్తాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో లక్ష్మణ్, సచిన్‌లు చేస్తున్న ప్రాక్టీస్‌ను ధోని పరిశీలించడం ఆ వీడియోలో రికార్డయింది. అయితే ఆప్టన్ తాజాగా దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్లతో హడావుడి చేస్తున్నారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
సచిన్, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే
Comments
Please login to add a commentAdd a comment