మహేంద్ర సింగ్ ధోని (PC: IPL/CSK)
‘‘ఐపీఎల్‌లో నేను ఎంఎస్ ధోనితో కలిసి ఎన్నడూ ఆడలేదు. అయితే, టీమిండియాలో ఉన్నపుడు మాత్రం మేము సహచర ఆటగాళ్లం. సెలబ్రేషన్స్ సమయంలో నన్ను ఎత్తుకోగల ఆటగాళ్లలో ధోని ముందు వరుసలో ఉండే వాడు.
ఎంత బరువైనా సరే అతడు అలవోకగా ఎత్తగలడు. ఇక నేను హెడ్‌కోచ్‌గా ఉన్నపుడు ధోని కెప్టెన్‌గా ఉండేవాడు. ఓసారి మేము వన్డే మ్యాచ్ కోసం రాంచికి వెళ్లాము. అక్కడ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాను.
నిజానికి రాంచి అతడి స్వస్థలం. ఆప్షనల్ ప్రాక్టీస్‌కు రాకుండా తను ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ.. అతడు గ్రౌండ్‌కు వచ్చేశాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించి.. ‘ఇక్కడేం చేస్తున్నావు? తదుపరి మ్యాచ్‌కు మనకు ఇంకా రెండ్రోజుల సమయం ఉంది. ఎందుకు వచ్చావు?’ అని అడిగాను.
అందుకు బదులుగా.. ‘లేదు.. లేదు.. నేను తప్పకుండా ఇక్కడ ఉండాల్సిందే’ అని ధోని జవాబు ఇచ్చాడు. సచిన్ కూడా అచ్చం ఇలాగే! నేను ముంబై ఇండియన్స్‌తో ఉన్నపుడు.. సచిన్ కూడా ఆన్షనల్ ప్రాక్టీస్ సెషన్ సమయంలో సచినే ముందు బస్సెక్కడం గమనించా.
25 నుంచి 26 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న సమయంలోనూ అదే అంకితభావం. ఈ విషయంలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే సాటి. వాళ్లకు బ్రేక్ అవసరం లేదనుకుంటారు. ఇంకొన్ని ఏళ్లపాటు ఎంఎస్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆటగాడిగా కొనసాగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆట పట్ల అతడికి ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఎప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలనే ఆలోచిస్తూ ఉంటాడు’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు.
సీఎస్‌కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నడుమ.. కుంబ్లే జియో సినిమా షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ విషయంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, ధోని ఆలోచనలు, అంకితభావం ఒకే విధంగా ఉంటాయని వారితో తనకున్న అనుభవాలు పంచుకున్నాడు.
ధోనికి ఐపీఎల్-2024 చివరి సీజన్ కాబోదని.. మరికొన్నేళ్లపాటు అతడికి లీగ్‌లో కొనసాగే సత్తా ఉందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పట్లో అలసిపోడంటూ 42 ఏళ్ల ధోనిని ఉద్దేశించి ప్రశంసలు కురిపించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం కానుంది. సీఎస్‌కే- ఆర్సీబీ మధ్య చెపాక్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది.
చదవండి: అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్
Comments
Please login to add a commentAdd a comment