సీఎం పుట్టినరోజున ‘కోటి వృక్షార్చన’: ఎంపీ సంతోష్‌  | One Crore Planting Program On Occasion Of CM KCR‌ Birthday | Sakshi
Sakshi News home page

సీఎం పుట్టినరోజున ‘కోటి వృక్షార్చన’: ఎంపీ సంతోష్‌ 

Published Sun, Feb 7 2021 1:52 AM | Last Updated on Sun, Feb 7 2021 1:54 AM

One Crore Planting Program On Occasion Of CM KCR‌ Birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ‘కోటి వృక్షార్చన’పేరిట కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ జె.సంతోష్‌కుమార్‌ వెల్లడించారు. ఒకే రోజు ఒకే గంటలో కోటి మొక్కలు నాటడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ‘కోటి వృక్షార్చన’కు సంబంధించిన పోస్టర్‌ను మంత్రులు కేటీ రామారావు, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ మాలోత్‌ కవితతో కలిసి శనివారం సంతోష్‌ ఆవిష్కరించారు. దేశం, రాష్ట్రం హరితమయం కావాలనే సంకల్పంతో గ్రీన్‌ ఇండి యా చాలెంజ్‌లో పాల్గొంటున్న వారికి వృక్షార్చనకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటి ఫొటోలను మొబైల్‌ యాప్‌లో పంపితే సీఎం నుంచి ‘వనమాలి’అనే బిరుదును ఈ–మెయిల్‌/మొబైల్‌కు పంపిస్తామని వివరించారు.   

చదవండి: (నీతి ఆయోగ్‌ సూచన మేరకే పెట్టుబడుల ఉపసంహరణ)

చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement