Keesara gutta
-
Mahashivaratri: తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
-
కీసరగుట్టలో మహా శివరాత్రి వేడుకలు
-
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సంబరాలు
-
'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'
సాక్షి, కీసరగుట్ట(మేడ్చల్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' చాలెంజ్‌లో భాగంగా కీసరగుట్టలోని రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 2,042 ఎకరాల అటవీ ప్రాంతంలో తన వంతుగా ఎకో టూరిజం పార్కు, అటవీ పునరుజ్జీవన అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతూ సంతోష్ కుమార్ పలువురు ప్రముఖులను 'గిఫ్ట్ ఏ స్మైల్'కు హ్యాష్ ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన వారిలో మాజీ ఎంపీ కవిత, సినీ హీరోలు విజయ్‌దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్‌లు ఉన్నారు. -
రామలింగేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి
కీసర : కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి వార్లను సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి విజయేంద్ర కుటుంబసమేతంగా సందర్శించారు. ఉదయం కీసర ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు న్యాయమూర్తికి ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, వేద పండితపులు నాగేంద్రశర్మ, రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చీర్యాల లక్ష్మీనసింహస్వామి ఆలయానికి చేరుకున్న జిల్లా జడ్జికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు జడ్జి దంపతులకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్ మల్లారపులక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిలు స్వామివారి ప్రసాదంతో పాటు, చిత్రపటానికి బహూకరించారు.