రామలింగేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి | Judge in rameshlingeshwara temple | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి

Published Mon, Sep 26 2016 7:35 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రామలింగేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి - Sakshi

రామలింగేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి

కీసర : కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి వార్లను సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి విజయేంద్ర కుటుంబసమేతంగా సందర్శించారు. ఉదయం కీసర ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు న్యాయమూర్తికి ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో చైర్మన్‌ తటాకం ఉమాపతి శర్మ, వేద పండితపులు నాగేంద్రశర్మ, రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చీర్యాల లక్ష్మీనసింహస్వామి ఆలయానికి చేరుకున్న జిల్లా జడ్జికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు జడ్జి దంపతులకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్‌ మల్లారపులక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిలు స్వామివారి ప్రసాదంతో పాటు, చిత్రపటానికి బహూకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement