- వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్ రోనాల్డ్‌రోస్
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు లెక్క చెప్పాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి అధికారి యంత్రాంగంపై ఉందని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్పరేన్స్ హాల్ నుంచి మండల అభివృధ్ది అధికారులు, ఉఫాధి హామీ పథకం క్షేత్ర స్థాయి అధికారులతో హరితహారం కార్యక్రమంపై కాన్పరేన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉఫాధి హామీ పథకంలో భాగంగా సరపరా చేసిన మొక్కలకు, త్రవ్విన గుంతలకు,నాటిన మొక్కలకు అధికారులు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.నాటిన మొక్కలను, తవ్వించిన గుంతలకు కూలీలకు చెల్లింపులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని ఎంపీడీఓలకు సూచించారు. ఉపాధిహామీ పథకం కింద మస్టర్లలో నమోదు చేసిన విధముగా చెల్లింపులు జరపాలని ఈ విషయంలో మండల అభివృద్ధి అధికారులు అన్ని గ్రామాలు పర్యటించి ఎప్పటికపుడు సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కొన్ని గ్రామాలలో కూలీలకు ఇప్పటి వరకు చెల్లింపులు జరగకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పని చేయని ఉపాధిహామి పథకం టెక్నికల్ అíసిస్టెంట్స్‌ను, ఫీల్డ్ అసిసెంట్స్‌ను తోలిగించి వేరొకరిని నియమించడానికి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. వ్యవసాయ శాఖకు సరఫరా చేసిన మొక్కలు, రైతులకు సరఫరా చేసిన మొక్కల వివరాలపై వెంటనే నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్పరెన్స్‌లో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, డిఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మండల అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్