మొక్కలు నాటిన సీఎం కుటుంబ సభ్యులు | CM family Planted trees | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటిన సీఎం కుటుంబ సభ్యులు

Published Thu, Jul 14 2016 1:05 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

మొక్కలు నాటిన సీఎం కుటుంబ సభ్యులు - Sakshi

మొక్కలు నాటిన సీఎం కుటుంబ సభ్యులు

సాక్షి, హైదరాబాద్ : హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం క్యాంపు కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలసి మొక్కలు నాటారు. తమ రాశి, నక్షత్రాలకు అనుగుణంగా కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కుమారుడు మంత్రి కె.తారకరామారావు, కేటీఆర్ సతీమణి శైలిమ, కేసీఆర్ మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య మొక్కలు నాటారు. ఒక్కొక్కరు రెండు చొప్పున మొత్తం 12 మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ కర్కాటక రాశి ప్రకారం మోదుగు, ఆశ్లేష నక్షత్రం ప్రకారం పొన్న మొక్కలు నాటారు. మంత్రి కేటీఆర్ మకర రాశి ప్రకారం జిట్రేగి, శ్రావణ నక్షత్రం ప్రకారం జిల్లేడు మొక్కలు నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement