ప్రతి మొక్కనూ సంరక్షించాలి
Published Thu, Jul 28 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
దహెగాం : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా నాటే ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని కాగజ్‌నగర్ రూరల్ సీఐ రమేశ్‌బాబు అన్నారు. గురువారం మండలంలోని కల్వాడ గ్రామం ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీస్, హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మొక్కలు నాటడానికి ముందు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎసై ్స దీకొండ రమేశ్, ప్రధానోపాధ్యాయుడు అర్జయ్య, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement