'నగరంలో కోటి మొక‍్కలు నాటుతాం'
Published Sat, Jul 15 2017 11:50 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
హైదరాబాద్ : సనత్‌నగర్‌లోని నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మొక్కలు నాటారు. హరిత తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి.. వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో కోటి మొక్కలు నాటబోతున్నామని తెలిపారు.
Advertisement
Advertisement