
మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాద్యత
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారంలోభాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పీఏసీఎస్ వైస్ చెర్మైన్ పొద్దుటూరి కిష్ఠా రెడ్డి అన్నారు.
జైనథ్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారంలోభాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పీఏసీఎస్ వైస్ చెర్మైన్ పొద్దుటూరి కిష్ఠా రెడ్డి అన్నారు. శనివారం మండలంలంలోని భోరజ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాద్యాయులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులంత తమ పేర్ల మీద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కల యొక్క ఆవశ్యకతను ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజెప్పి, మొక్కలు నాటేలా వారిని ప్రొత్సహించాలన్నారు.
కార్యక్రమంలో నాయకులు మద్దుల ఊషన్న, హరిణివాస్ రెడ్డి, ప్రధానోపాద్యాయుడు దేవిదాస్, గ్రామ పోలీస్ అధికారి ఆశన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా మండలంలో కౌఠ గ్రామంలో ఎంపీటీసీ గంగుల కవిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడు విశ్వనాథ్ రెడ్డి, జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు నారాయణ్ రెడ్డిలు, విద్యార్థులు, స్థానిక నాయకులతో కలిసి పాఠశాలలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట బీఎం భోజా రెడ్డి, నాయకులు సర్సన్ లింగా రెడ్డి, లస్మన్న, నారాయణ రెడ్డి, గ్రామస్తులు మొక్కలు నాటారు.