ఇబ్రహీంపట్నం: అమ్మక్కపేటలో నాటిన మొక్కకు చెందిన ట్రీగార్డు కిందపడేసి ఉండడాన్ని చూసి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ శరత్
జగిత్యాల: తమాషా చేస్తున్నారా...ఒక్క మొక్క చనిపోయినా ఊరుకునేది లేదు..మొక్కలకు రక్షణ కల్పించాలని, సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అందరు సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. మంగళవారం ఐఎంఏ హాల్ నుంచి నర్సింగ్ కళాశాల, డీఆర్డీఏ ఆఫీసు, మహిళ సంక్షేమ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీగార్డులు సక్రమంగా లేకపోవడం, బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ శాఖ నాటిన మొక్కల బాధ్యత వారే చూసుకోవాలన్నారు. ప్రతీ మూడు రోజులకోసారి పరిశీలిస్తానన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆయన వెంట వివిధశాఖల అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment