jagtial town
-
తమాషా చేస్తున్నారా? - కలెక్టర్ ఆగ్రహం
జగిత్యాల: తమాషా చేస్తున్నారా...ఒక్క మొక్క చనిపోయినా ఊరుకునేది లేదు..మొక్కలకు రక్షణ కల్పించాలని, సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అందరు సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. మంగళవారం ఐఎంఏ హాల్ నుంచి నర్సింగ్ కళాశాల, డీఆర్డీఏ ఆఫీసు, మహిళ సంక్షేమ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీగార్డులు సక్రమంగా లేకపోవడం, బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ శాఖ నాటిన మొక్కల బాధ్యత వారే చూసుకోవాలన్నారు. ప్రతీ మూడు రోజులకోసారి పరిశీలిస్తానన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆయన వెంట వివిధశాఖల అధికారులున్నారు. -
ఖాళీ జాగా.. వేసేయ్ పాగా
సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాదారులు పాగా వేసేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాల్లో అక్రమంగా టేలాలు వేస్తూ అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పట్టింపులేమితో జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీస్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పునర్విభజనలో భాగంగా జిగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడడం.. గ్రేడ్–1 మున్సిపాలిటీగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఖాళీస్థలాల గురించి పట్టించుకోకపోవడంతో బల్దియా భారీగా ఆదాయం నష్టపోతోంది. జగిత్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న ఉద్యానవనం, అగ్నిమాపకశాఖ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఖాళీస్థలాల్లో ఎన్నో టేలాలు వెలిశాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడింది ఆటగా నడుస్తుంది. వాస్తవంగా అక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. గతంలో అంగడిబజార్ ప్రాంతంలో ఉన్న బల్దియాస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి.. టెండర్లు వేస్తే ఒక్కో షాపునకు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు పలికింది. వీటి ద్వారా నెలకు రూ.30 వేలు వరకు అద్దె వస్తుంది. ప్రస్తుతం కూడా పట్టణంలోని ఖాళీస్థలాల్లో ఆక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంగడిబజార్‌లో నిర్మించిన షాపింగ్‌కాంప్లెక్స్‌లో పై అంతస్తు నిర్మిస్తే మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే ఎంపీడీవో కార్యాలయం, టౌన్‌హాల్ సమీపంలోనూ ఆక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే బల్దియాకు అత్యధికంగా ఆదాయం లభించనుంది. ప్రస్తుతం జగిత్యాల మున్సిపల్ ఆస్తిపన్ను రూ.5 కోట్లు ఉంది. వీటిని నిర్మిస్తే మరింత ఆదాయం సమకూరనుంది. అన్ని ఆక్రమణలే..! జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్,పాతబస్టాండ్, తహసీల్‌చౌరస్తా ప్రధాన మార్గాల్లోని రోడ్లలో నిత్యం ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చిన్న వ్యాపారం పేరిట రేకులషెడ్డు ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీకి ఎంక్రోజ్‌మెంట్ కింద కొద్దిమేర కిస్తులు చెల్లిస్తున్నారు. పాలకవర్గం అధికారులు స్పందించి వీటన్నింటిని తొలగించి పెద్ద ఎత్తున కాంప్లెక్స్‌లు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అంతా బినామీలే.. మున్సిపాలిటీ స్థలాలను కొందరు ఆక్రమించుకొని వాటిలో షెడ్లు వేసి అద్దెకిస్తున్నారు. దాదాపు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పొందుతున్నారు. గతంలో స్థలాల్లో ఉన్న వారు రేకులషెడ్లు వేసి వాటిని అద్దెకు ఇచ్చారు. వాణిజ్య వ్యాపారాలు అత్యధికంగా జరిగే స్థలాలు కావడంతో గత్యంతరం లేక వారు చెప్పిన అద్దెను చెల్లిస్తున్నారు. ఇలా బల్దియా ఆదాయానికి గండి కొడుతూ వారు ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారు. మున్సిపాలిటీ స్థలానికి వీరే యజమానులు వ్యవహరిస్తుండడం గమనార్హం. పాలకవర్గం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి విలువైన ఖాళీస్థలాల్లో అక్రమంగా వెలసిన షెడ్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని కోరాతున్నారు. నోటీసులు జారీ చేశాం జిల్లా కేంద్రంలోని పలు రోడ్లపై వెలసిన ఆక్రమణ షెడ్ల వారికి నోటీసులు సైతం జారీ చేశాం. మున్సిపల్ దృష్టికి వచ్చింది. త్వరలోనే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. షాపింగ్కాంప్లెక్స్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించేలా చర్యలు తీసుకుంటాం. – సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
జగిత్యాల: పేరుకే పంచాయతీలు..!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నిధులు లేక పంచాయతీలు నీరసించిపోతున్నాయి. తండాల నుంచి పంచాయతీలుగా మారినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పంచాయతీలుగా గుర్తించి ఆర్నెళ్లయినా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటే అతిశయోక్తికాదు. పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రత్యేక అధికారులకు పాలనపగ్గాలు అందించడం.. అదనపు బాధ్యతలతో వారు సరిగా విధులు నిర్వర్తించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 500 జనాభా దాటిన తండాలను చాయతీలుగా చేస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న పంచాయతీలు గిరిజన తండాలకు, గిరిజనేతర శివారు గ్రామాలకు దూరంగా ఉండి, తక్కువ జనాభా కలిగి ఉన్నా అట్టి తండాలను, శివారు గ్రామాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ప్రకటించి, రాష్ట్ర అవతరణ రోజైన జూన్ రెండు నుంచి తండాల్లో ప్రత్యేక పంచాయతీల పాలన ఆరంభించింది. పంచాయతీలు 21 జిల్లాలో మొత్తం 380 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జూన్ 2న జిల్లాలో గిరిజన, గిరజనేతర జనాభా ప్రాతిపదికన కొత్తగా 60 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారు. గతంలోనే రాయికల్ మండలం జగన్నాథపూర్ గిరిజన గ్రామపంచాయతీగా ఉండగా.. కొత్తగా 20 తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించగా..ఇక్కడ 100 శాతం గిరిజనులే ఉన్నారు. మండలాల వారీగా గిరిజన గ్రామపంచాయతీలు సారంగాపూర్ మండలంలో భీంరెడ్డిగూడెం, ధర్మనాయక్తండా, మ్యాడారం తండా, లచ్చనాయక్‌తండా, నాయికపుగూడెం బీర్పూర్ మండలంలో చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, కందెనకుంట, రాయికల్ మండలం అలియనాయక్తండా, జగన్నాథపూర్, కైరిగూడెం, మంత్యనాయక్తండా, లొక్యనాయక్తండా, వాల్మీకితండా, మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ తండా, వాల్గొండతం డా, మెట్పల్లి మండలంలో ఏఎస్ఆర్ తండా, కేసీఆర్ తండా, పటిమిడి తండా, ఇబ్రహీంపట్నంలో తిమ్మాపూర్ తండా, కథలాపూర్‌లో రాజారంతండాలు కొడిమ్యాల మండలంలో గంగారాంతండా గిరిజన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా అభివృద్ధి లేదు గ్రామపంచాయతీలు ఏర్పాటు జరిగినా తండా పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మినహాయించి ప్రభుత్వం నుంచి ఇతర అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలే దు. దీంతో పంచాయతీల ఏర్పాటు ద్వారా పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమిలేదని గిరిజనులు పేర్కొంటున్నారు. జూన్ 2న పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో పంచాయతీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాలు, కొన్ని గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని పంచా యతీ కార్యాలయాలను ప్రారంభించారు. పంచా యతీలు ఏర్పాటు జరిగినా, ఇప్పటి వరకు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో సరిౖయెన ఫర్నిచర్ కూడా అందుబాటులో లేదు. కొత్తగా నిధులు లేవు గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఇన్చార్జి కార్యదర్శి పేరును జమ చేశారు. ఈ నిధులను తండాలోని వీధిదీపాల ఏర్పా టు, బావుల్లో క్లోరినేషన్ నిర్వహించడంతోపాటు, మురికి కాల్వలను శుభ్రం చేయడానికి వినియోగించారు. ఇతరనిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. అధికారుల హాజరు చుట్టచూపే ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారే తప్ప, గిరి జనులతో ఎలాంటి ప్రత్యేక సమావేశాలు జరప డం లేదని సమాచారం. చుట్టపుచూపుగా గ్రామాలకు వస్తున్నారని, తండాల్లోని సమస్యలపై చర్చలు నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు. -
కూరగాయల మార్కెట్ రైతు బజార్‌కు తరలేనా..!
నూతన కలెక్టర్ చొరవ చూపాలి ఏకైక కూరగాయల మార్కెట్ ఆధునీకరించినా సమస్యలే జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రంగా అవతరించింది. పట్టణంలో ఏకైక ప్రధాన కూరగాయల మార్కెట్ ఉంది. మార్కెట్ ఒకటే ఉండటంతో అటు వ్యాపారులు, ఇటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మార్కెట్‌ను ఆధునీకరించారు. అయినప్పటికీ స్థలం చిన్నదిగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని పట్టణంలోని విద్యానగర్‌లో సుమారు రూ.50 లక్షలతో మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అది నిరుపయోగంగానే మారింది. ఇటీవల సబ్‌కలెక్టర్ కూరగాయల మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలించేలా రైతులతో మాట్లాడారు. మార్కెట్ ఆధీనంలో ఉన్న రైతుబజార్‌ను బల్దియాకు అప్పగించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు లేఖ సమర్పించారు. విశాలమైన రైతుబజార్‌ను నిరుపయోగంగా ఉండకుండా మార్కెట్‌ను ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రతిపాదనలకే పరిమితం గతంలో సైతం రైతుబజార్‌కు ప్రధాన కూరగాయల మార్కెట్‌ను తరలిద్దామని అధికారులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ రైతులు ఒప్పుకోకపోవడంతో రైతుబజార్ శిథిలావస్థకు చేరింది. జనసాంద్రత ఉన్న చోట మార్కెట్ అయితే లక్షకు పైగా ఉన్న పట్టణంలో ఒకే కూరగాయల మార్కెట్ కాకుండా జనం ఉన్న చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జగిత్యాలలో మంచినీళ్లబావి, అంగడిబజార్‌లో, ధరూర్ క్యాంపులోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూరగాయల మార్కెట్ ఒకటే కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలిస్తే ఎంతో వీలుగా ఉంటుంది. నూతన కలెక్టర్ చొరవ చూపేనా? జగిత్యాల జిల్లాగా అవతరించగా నూతన జిల్లా కలెక్టర్ శరత్ చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రైతుబజార్‌కు తరలిస్తే ఎంతో ఉపయోకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.