రేపు మంత్రి పర్యటన
Published Wed, Jul 20 2016 11:38 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
కాగజ్‌నగర్ : రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం కాగజ్‌నగర్‌లో పర్యటిస్తారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం తెలిపారు. మధ్యాహ్నం కాగజ్‌నగర్ చేరుకొని పలు చోట్ల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారని పేర్కొన్నారు. మంత్రి పర్యటనను జయప్రదం చేయడానికి సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement