హరితహారం... మణిహారం
-
కొనసాగుతున్న హరితోద్యమం
-
మొక్కలు నాటుతున్న అన్ని వర్గాల ప్రజలు
మందమర్రి : మానవ మనుగడకు మూలధారం చెట్లేనని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మందమర్రి స్టేషన్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్ ఓదెలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్షవ మొక్కను ప్రభుత్వ విప్ ఓదెలు, డీఐజీ ప్రభాకర్‌రావు కలిసి మొక్కను నాటారు.
ప్రభుత్వ స్ఫూర్తితో 36 లక్షల మొక్కలు నాటాం
–డీఐజీ ప్రభాకర్‌రావు
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితోని రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మొక్కలను నాటామని వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. అదిలాబాద్ జిల్లా మొత్తంగా 12 లక్షల మొక్కలు నాటమాన్నారు. మందమర్రి సర్కిల్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి డివిజన్ వ్యాప్తంగా 3 లక్షల మొక్కలను నాటారని తెలిపారు. లక్ష మొక్కలు నాటిన మందమర్రి సర్కిల్ జిల్లా పోలీసు శాఖకే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ సకల జనుల సమ్మె ఎంత ఉధతంగా సాగిందో సకల జనుల హరితహారం కూడా అంతే ఉధతంగా కోనసాగుతోందని అన్నారు. కార్యక్రమంలో సీఐ సదయ్య, మందమర్రి ఎసై ్స సతీశ్, కాసిపేట ఎసై ్స శ్యాంసుందర్, అదనపు ఎసై ్సలు పోలీసు సిబ్బందితో పాటు టీఆర్‌ఎస్ నాయకులు ఎస్ ప్రభాకర్, జె రవీందర్, మద్ది శంకర్, కోంగల తిరుపతిరెడ్డి, బత్తుల శ్రీనివాస్, తుమ్మ శ్రీశైలంలు పాల్గొన్నారు.
కోటపల్లిలో...
కోటపల్లి మండలంలోని దేవులవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ సిబ్బంది హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో సుమారు 100 మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాపు, పీఈటీ మల్లేశ్, ఉపాధి హామీ టీఏలు శిరీషా, శంకర్ పాల్గొన్నారు.
రోడ్డు, భవనాల శాఖ ఆధ్వర్యంలో...
చెన్నూర్ రూరల్ : మండలంలోని దుగ్నెపల్లి గ్రామంలో గురువారం రోడ్ల భవనాల శాఖ అధికారులు రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఈ స్వామిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశం, ఏఈ రాజమౌళి, ఏపీవో గంగభవాని, సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు.
మీ సేవ ఆధ్వర్యంలో...
చెన్నూర్: పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎదుట మీ సేవ కేంద్రం వద్ద హరితహారంలో భాగంగా నిర్వాహకులు గుండా రవికిరణ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు సైదుల రమేశ్, సాగర్, మనోజ్‌లు పాల్గొన్నారు.