మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎంవీ రెడ్డి తదితరులు
సాక్షి, కీసర: కీసరగుట్ట అటవీప్రాంతాన్ని దత్తత తీసుకొని ఎంపీ సంతోష్‌కుమార్ హరితహారంలో భాగంగా ఇటీవల పెద్దఎత్తున మొక్కలు నాటిని విషయం తెలిసిందే. మంగళవారం కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆ ప్రాంతాన్నిపరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్టు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి 15 రోజులు కావొస్తున్నా వాటికి సపోర్టు కర్రలు ఎందుకు నాటలేదని, చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ ఎందుకు నాటలేదని అటవీశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
మొక్కలను నాటినప్పటి నుంచి ఫీల్డ్‌ఆఫీసర్ ఇటు పక్కకు రాలేదని, నాటిన మొక్కలను సంరక్షించనందుకు కీసర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం గుట్టలో గల ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కీసరగుట్ట అబివృద్ధికి ప్రణాళికను తయారు చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కీసరగుట్టలోని ఎంట్రెన్స్‌లో గల సిమెంట్ నంది విగ్రహాన్ని మార్చి, దానిస్థానంలో రాతితో చెక్కించి నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కీసరగుట్ట జాతర సందర్భంగా పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడకుండా స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్ నాగరాజుకు సూచించారు. జెడ్పీ వైస్‌చైర్మన్ బెస్త వెంకటేష్, డీఆర్‌డీఏ పీఓ కౌటిల్యారెడ్డి, సీపీఓ సౌమ్య, ఎంపీపీ ఇందిర వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, సర్పంచ్ మాధురి, ఉపసర్పంచ్ కందాడి బాలమణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment