
19న వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో హరితహారం
తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తాండూరు డివిజన్ పరిధిలో ఈ నెల 19న మొక్కలు నాటుతున్నట్లు..
హరితహారం డివిజన్ ప్రత్యేకాధికారి డాక్టర్ అజయ్‌కుమార్‌ఘోష్
తాండూరు రూరల్ : తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తాండూరు డివిజన్ పరిధిలో ఈ నెల 19న మొక్కలు నాటుతున్నట్లు వ్యవసాయశాఖ తాండూరు డివిజన్ హరితహారం ప్రత్యేకాధికారి డాక్టరు అజయ్‌కుమార్‌ఘోష్ అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరు అజయ్‌కుమార్‌ఘోష్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాండూరు డివిజన్‌లోని రైతుల పొలాల వద్ద 3.9 లక్షల టేకు మొక్కలు నాటుతామన్నారు. డివిజన్‌లోని తాండూరు మండలంలో 78 వేలు, యాలాల్లో 78 వేలు, బషీరాబాద్‌లో 78 వేలు, పెద్దేముల్‌లో 75 వేల టేకు మొక్కలు నాటుతామన్నారు. వ్యవసాయశాఖ అధికారులు 18వ తేదీలోపు రైతులకు మొక్కలను అందజేస్తామన్నారు. గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో భూసంరక్షణ శాఖ ఏడీఏ కనకరాజు పాల్గొన్నారు.