మేక ‘హరితహారం’ మొక్కను తినేయడంతో.. | Official Imposes Rs 500 Fine For Spoil Haritha Haram Plants In Chevella | Sakshi
Sakshi News home page

మేక ‘హరితహారం’ మొక్కను తినేయడంతో..

Published Sat, Aug 24 2019 12:32 PM | Last Updated on Sat, Aug 24 2019 12:32 PM

Official Imposes Rs 500 Fine For Spoil Haritha Haram Plants In Chevella - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చేవెళ్ల : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కను మేక తినడంతో ఆ మేక యజమానికి జరిమానా పడింది. పంచాయతీ అధికారులు మేక యజమానికి రూ. 500 జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం దేవల్‌ వెంకటాపూర్‌ (చిలుకూరు బాలాజీ దేవాలయం ఉన్న ప్రాంతం)లో ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అయితే, అదే గ్రామానికి చెందిన బైకని మల్లమ్మకు చెందిన మేకలు మొక్కలను తినేశాయి. ఈ నెల 21న ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు గుర్తించారు. జరిమానాకు సంబంధించిన రశీదును పంచాయతీ కార్యదర్శి రంజిత్‌కుమార్‌, సర్పంచ్‌ గునుగుర్తి స్వరూప మల్లమ్మకు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement