Moinabad mandal
-
‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే..
సాక్షి, మొయినాబాద్: ‘అమ్మా..నేను చనిపోతున్నా..’ ఓ వివాహిత తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది. అంతలోనే ఫోన్‌కట్ చేసి చెప్పినంత పనిచేసింది. పెళ్లయిన పదకొండు నెలలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన మొయినాబాద్ మండల చిలుకూరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన శ్రావణి (26)తో చిలుకూరుకు చెందిన అవురం రాజశేఖర్‌రెడ్డి వివాహం గత సంవత్సరం నవంబర్ 27న జరిగింది. పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబం వారు 40 తులాల బంగారం, రూ.40 లక్షలు నగదు, తూప్రాన్‌లో ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. కొన్ని రోజులు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం శ్రావణి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. శ్రావణి ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించిన చుట్టుపక్కల వారు, ఆమె అత్త కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చదవండి: ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి.. శ్రావణి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు తల్లికి ఫోన్ చేసి.. శ్రావణి బుధవారం తల్లి పద్మకు ఫోన్‌చేసి మాట్లాడింది. నేను చనిపోతాను అంటూ ఏడుస్తూ ఫోన్ కట్‌చేసింది. కొద్ది సేపటి తరువాత తల్లి మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. అంతలోనే ఉరివేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని.. దసరా పండుగకు ముందు శ్రావణిని కొట్టాడని బంధువులు ఆరోపించారు. అతడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేశారు. శవాన్ని తరలించవద్దంటూ ఆందోళన పరారీలో ఉన్న భర్త రాజశేఖర్‌రెడ్డిని పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించవద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. శ్రావణి తల్లి, బంధువులు రాకముందే శవాన్ని ఎందుకు కిందికి దింపారని నిలదీశారు. రాత్రి 8 గంటల వరకు కూడా శ్రావణి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. భర్తను పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించేదిలేదని పోలీసులను కూడా అడ్డుకున్నారు. -
రెండేళ్ల బాలుడిని కిరాతకంగా హత్య చేసిన కన్నతండ్రి
సాక్షి,రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఒక కన్నతండ్రి తన రెండేళ్ల కొడుకుని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం కట్టుకున్న భార్యను కూడా కత్తితో పొడిచాడు. కాగా బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టోలీచౌకీ వాసి దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు హైదరాబాద్ నగరంలో టోలీచౌకీకి చెందిన షేక్ సల్మాన్‌గా పోలీసులు గుర్తించారు. వైరుతో గొంతు బిగించి, తలపై రాయితో కొట్టి చంపిన ఆనవాలు కనిపిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం సహకారంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, షేక్ సల్మాన్‌ను తానే హతమార్చానని ఓ వ్యక్తి రాయదుర్గం పోలీసులకు లొంగిపోయాడు. -
జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అకాడమీ స్థాపించిన జ్వాల గుత్తాకి, ఆమె కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. చైనాలో లాగా భారత్‌లోనూ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తామని వివరించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనన్నారు. జ్వాల అకాడమీ నడిపేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. జ్వాల గుత్తా మాట్లాడుతూ.. అకాడమీ కల నెరవేరింది. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన జ్వాల.. తనలాంటి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అకాడమీ స్థాపించడం గర్వకారణమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత ప్రతిభని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు. Ministers @KTRTRS, @VSrinivasGoud and Badminton star @Guttajwala toured the Jwala Gutta Academy of Excellence and interacted with the sports persons training at the Academy. pic.twitter.com/h8Tl7NwXSh — KTR News (@KTR_News) November 2, 2020 -
కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు
సాక్షి, మొయినాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం బాలాజీ దేవాలయానికి వచ్చిన ఆయన ఆలయ గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షణలు చేశారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం కావడంతోపాటు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన చిలుకూరులో 108 ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయనతోపాటు 108 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. మంత్రి రాకతో ఆలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమంలో చిలుకూరు సర్పంచ్ గునుగుర్తి స్వరూర, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జీటీఆర్ మండల అధ్యక్షుడు దేవరంపల్లి మహేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్‌రెడ్డి, చిన్నమంగళారం సర్పంచ్ సుకన్య, నాయకులు హరిశంకర్ గౌడ్, విష్ణుగౌడ్, రవియాదవ్, రాఘవేందర్ యాదవ్, గడ్డం అంజిరెడ్డి, చెన్నయ్య ఉన్నారు. -
మేక ‘హరితహారం’ మొక్కను తినేయడంతో..
సాక్షి, చేవెళ్ల : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కను మేక తినడంతో ఆ మేక యజమానికి జరిమానా పడింది. పంచాయతీ అధికారులు మేక యజమానికి రూ. 500 జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం దేవల్ వెంకటాపూర్ (చిలుకూరు బాలాజీ దేవాలయం ఉన్న ప్రాంతం)లో ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అయితే, అదే గ్రామానికి చెందిన బైకని మల్లమ్మకు చెందిన మేకలు మొక్కలను తినేశాయి. ఈ నెల 21న ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు గుర్తించారు. జరిమానాకు సంబంధించిన రశీదును పంచాయతీ కార్యదర్శి రంజిత్‌కుమార్, సర్పంచ్ గునుగుర్తి స్వరూప మల్లమ్మకు అందజేశారు. -
బ్రాండెడ్ పేరుతో కల్తీ దందా
మొయినాబాద్(చేవెళ్ల): సాధారణ బియ్యం, కందిపప్పులను బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. గోదాంలోని బియ్యం, కందిపప్పుతోపాటు ఇతర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ రోడ్డులో ఉన్న ఓ వ్యవసాయ క్షత్రంలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. మొయినాబాద్ సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బేగంబజార్‌కు చెందిన రాంనివాస్సోలంకీకి మొయినాబాద్ మండలంలో జేబీఐఈటీ కళాశాల సమీపంలో అమ్డాపూర్ రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం ఉంది.అందులో గరిమ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోదాం నిర్మించాడు. ఒడిశా నుంచి తక్కువ ధరకు సాదారణ బియ్యం, కందిపప్పు కొనుగోలు చేసి ఇక్కడి గోదాంకు తీసుకొస్తారు. గోదాంలో వాటిని బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తారు. కోహినూర్ బాస్మతి రైస్, రియల్ డైమండ్, ఇండియా గేట్ వంటి బ్రాండ్ల పేర్లతో తయారు చేసిన కవర్లలో బియ్యాన్ని, అంకుల బ్రాండ్‌తో తయారు చేసిన కవర్లలో కందిపప్పును ప్యాక్ చేసి నగరంలోని బేగం బజార్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.ఎస్ఓటీ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో వచ్చి దాడి చేశారు. గోదాంలో 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు సాధారణ గోధుమ పిండి ఉంది. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బ్రాండెడ్ పేర్లతో ప్యాక్ చేసిన 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, కందిపప్పు విలువ సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. -
కలకలం రేపిన ‘ముజ్రా’
చిలుకూరు సమీపంలోని ఓ ఇంటిపై పోలీసుల దాడి 22 మంది యువకులు, 8 మంది యువతులు అరెస్టు మొయినాబాద్: అటవీ ప్రాంతం, జన సంచారం తక్కువగా ఉండటం, అనేక ఫాంహౌస్‌లు అందుబాటులో ఉండటం నగర శివారులో ముజ్రా, రేవ్ పార్టీల ఏర్పాటుకు అనుకూలంగా మారాయి. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం చిలుకూరులో ఉన్న ఓ వెంచర్లో సోమవారం రాత్రి జరిగిన ముజ్రా పార్టీ స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారి ఆకాష్ వివాహం నగరంలోని ఎల్బీ నగర్లో జరిగింది. ఆ వివాహ వేడుకకు హైదరాబాద్, ముంబై, కలకత్త ప్రాంతాలకు చెందిన కొందరు స్నేహితులు హాజరయ్యారు. వివాహానికి విచ్చేసిన స్నేహితులకు ఆకాష్ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను జతిన్‌కు చెప్పాడు. అయితే జతిన్ పార్టీ విషయాన్ని అతని స్నేహితుడైన గౌరవ్‌కు తెలిపాడు. గౌరవ్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్ అనే వ్యక్తి పరిచయమున్నాడు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ హైదరాబాద్‌లోనే ఉంటూ ఇలాంటి పార్టీలను ఏర్పాటు చేస్తుంటాడు. వివాహానికి వచ్చిన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేయాలని దిలీప్జైన్కు గౌరవ్ చెప్పడంతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేస్తానన్నాడు. మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్ హోమ్ వెంచర్లో ఆశీష్ జైన్ అనే వ్యక్తికి ఓ ఇళ్లు ఉంది. ఆశీష్ జైన్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్‌కు పాత పరిచయం ఉండటంతో వెంచర్‌లోని ఇల్లును దిలీప్‌జైన్ అద్దెకు తీసుకున్నాడు. సోమవారం రాత్రి వెంచర్‌లోని ఇంట్లో ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు. ముంబై, అహ్మదాబాద్, కలకత్త, హైదరాబాద్‌కు చెందిన దిలీప్జైన్తోపాటు జినేష్ రాంనిక్, అంకిత్, జిగ్నేష్, భావేష్ పటేల్, రాసిక్ ప్రజాపతి, దీపేష్, గనత్రా జతిన్, గౌరవ్, శాంతిలాల్, జయేష్, దివ్యేష్, దివాంగ, శైలేష్, హర్షత్, ఆకాష్, అసత్, నగరానికి చెందిన డ్రైవర్లు షేక్ జిలాని, షేక్ ఆసిఫ్, ఎండీ షకిల్ హైమద్, నగరంలోని అల్వాల్‌కు చెందిన వర్కర్లు ఉమర్ రాజిరెడి,్డ మురళీ కృష్ణ, 8 మంది యువతులు పార్టీలో పాల్గొన్నారు. అర్ధరాత్రి సమయంలో డీజే పాటల హోరులో యువతులు నృత్యాలు చేస్తుంటే యువకులు వారిపై డబ్బులు వెదలజ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. (ముజ్రా పార్టీలో యువతులు నృత్యాలు చేస్తూ తమ ఒంటిపై ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని విప్పేస్తూ నృత్యం చేస్తుంటారు. చివరకు నగ్నంగా తయారై నృత్యం చేస్తారు) వెంచర్‌లోని ఓ ఇంట్లో పార్టీ నడుస్తున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి 12 సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. మొత్తం 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతీ యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, కండోమ్స్ పాకెట్లు... ముజ్రా పార్టీ నిర్వహించిన ఇంట్లో మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు లభించాయి. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో యువతీ యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్ఓటీ పోలీసులు పకడ్బందీగా దాడి చేయడంతో వారంతా ఆ ఇల్లు దాటి బయటకు పోలేకపోయారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం వారందర్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న రూ.1.21 లక్షల నగదు, 25 సెల్ఫోన్లు, 5 కార్లను సీజ్ చేశారు. మంగళవారం యువతీ యువకులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, మొయినాబాద్ సీఐ రవిచంద్ర ఉన్నారు. పార్టీల ఏర్పాటులో దిలీప్‌జైన్ పాత్ర కీలకం... నగర శివారులో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు ఏర్పాటు చేయడంలో దిలీప్‌జైన్ సూత్రధారిగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ నగర శివారుల్లోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. గతంలోనూ అతను జవహర్‌నగర్, శామీర్‌పేట్, చేవెళ్ల ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. -
111 జీవోకు ‘డంపింగ్‌యార్డు’ అడ్డుకాదా..?
చేవెళ్ల/మొయినాబాద్‌రూరల్: మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారన్న వార్తలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జంట జలాశయూలు కలుషితం కాకూడదని 111జీవో తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా చెత్త డంపింగ్ యూర్డునే ఎలా ఏర్పాటు చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో పేరుకుపోతున్న చెత్తను శివారు ప్రాంతాలకు తరలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమీపంలోని పలు మండలాల్లో స్థలాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. జంటజలాశయాలకు నదీపరీవాహక ప్రాంతం ద్వారా వెళ్లే వర్షపు నీరు కలుషితం కాకుండా ఉండడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 111 జీవోను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనతో తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడంలేదని, భూములు అమ్ముకుందామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఈ ప్రాంతంలో గత కొన్నేల్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో సైతం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. చేవెళ్లలో జరిగిన బహిరంగసభలో వుుఖ్యవుంత్రి కేసీఆర్ కూడా 111 జీవోను పూర్తిగా రద్దుచేయడమో, లేదా సడలించడమో చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ అవులు కాకవుుందే చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం స్థలాన్ని సేకరించే పనిలో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటుచేస్తే తీవ్రమైన దుర్వాసన, జల, వాయుు కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని జవహర్‌నగర్‌లో ఉన్న చెత్త యార్డును తొలగించాలని ప్రజలు ఏళ్లతరబడి పోరాటం చేస్తున్నారు. మళ్లీ రంగారెడ్డి జిల్లాలోనే డంపింగ్‌యార్డులను ఏర్పాటుచేయడానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇప్పటికే ఎమ్మెల్యే కాలె యాదయ్య హెచ్చరించిన సంగతి తెలిసిందే. కనకమామిడిలో స్థల సేకరణ.. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో గల ప్రభుత్వ భూమిని డంపింగ్‌యార్డు కోసం ఎంపికచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. కనకమామిడి రెవిన్యూలోని 510లో 368 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారుగా 63 ఎకరాల భూమిని గ్రామసులకు అసైన్ చేశారు. మరో 138 ఎకరాల భూమిని కొందరు గ్రావుస్తులు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన ప్రభుత్వ భూమిలో ఇండియన్ పోలో అసోసియేషన్‌కు 25 ఎకరాలు, హుడాకు 10 ఎకరాలు, ట్రాన్స్‌కోకు 11 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ భూమి కేవలం 115 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అంచనా. ఈ స్థలంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటుకు జీహెఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సవూచారం. -
ప్రధాని అయితే మీరేం చేస్తారు..?
మొయినాబాద్: ’రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. మార్కెట్‌కు తెస్తే.. గిట్టుబాటు ధర ఉండదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నాం. తెలంగాణలో కరెంటు కూడా సరిగా ఉండదు. మీరు ప్రధానమంత్రి అయితే రైతుల కోసం ఏం చేస్తారు..’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీరాంనగర్ రైతు బల్వంత్‌రెడ్డి ప్రశ్నలు అడిగారు. చాయ్‌పే చర్చా పేరుతో సీఏజీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీతో రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడే లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని శ్రీరాంనగర్‌లో గురువారం రాత్రి నిర్వహించారు. రైతు బల్వంత్‌రెడ్డి రైతుల సమస్యలు మోడీకి వివరించారు. దీంతో ఆయన సమాధానం చెబుతూ.. గ్రానైట్, ఇతర వ్యాపార వస్తువులు ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు ఎన్ని రోజుల సమయం పట్టినా అవి చెడిపోవని, అదే రైతు పండించిన టమాటాలు మాత్రం ఇతర ప్రాంతాలకు ట్రక్కుల్లో రవాణా చేస్తే నిల్వ ఉండవన్నారు. రైళ్లలో కోల్డు స్టోరేజీలు ఏర్పాటు చేసి వాటిని రవాణా చేసే సదుపాయం ప్రభుత్వం కల్పించాలని కోరారు. దీంతో.. మోడీ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఫుడ్ కార్పొరేషన్‌ను మూడు విభాగాలుగా చేస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కృషి చేస్తామనడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు.