111 జీవోకు ‘డంపింగ్‌యార్డు’ అడ్డుకాదా..?
చేవెళ్ల/మొయినాబాద్‌రూరల్: మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారన్న వార్తలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జంట జలాశయూలు కలుషితం కాకూడదని 111జీవో తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా చెత్త డంపింగ్ యూర్డునే ఎలా ఏర్పాటు చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో పేరుకుపోతున్న చెత్తను శివారు ప్రాంతాలకు తరలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమీపంలోని పలు మండలాల్లో స్థలాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. జంటజలాశయాలకు నదీపరీవాహక ప్రాంతం ద్వారా వెళ్లే వర్షపు నీరు కలుషితం కాకుండా ఉండడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 111 జీవోను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనతో తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడంలేదని, భూములు అమ్ముకుందామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఈ ప్రాంతంలో గత కొన్నేల్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికలలో సైతం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. చేవెళ్లలో జరిగిన బహిరంగసభలో వుుఖ్యవుంత్రి కేసీఆర్ కూడా 111 జీవోను పూర్తిగా రద్దుచేయడమో, లేదా సడలించడమో చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ అవులు కాకవుుందే చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం స్థలాన్ని సేకరించే పనిలో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటుచేస్తే తీవ్రమైన దుర్వాసన, జల, వాయుు కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు భయపడుతున్నారు.
ఇప్పటికే జిల్లాలోని జవహర్‌నగర్‌లో ఉన్న చెత్త యార్డును తొలగించాలని ప్రజలు ఏళ్లతరబడి పోరాటం చేస్తున్నారు. మళ్లీ రంగారెడ్డి జిల్లాలోనే డంపింగ్‌యార్డులను ఏర్పాటుచేయడానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇప్పటికే ఎమ్మెల్యే కాలె యాదయ్య హెచ్చరించిన సంగతి తెలిసిందే.
కనకమామిడిలో స్థల సేకరణ..
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో గల ప్రభుత్వ భూమిని డంపింగ్‌యార్డు కోసం ఎంపికచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. కనకమామిడి రెవిన్యూలోని 510లో 368 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారుగా 63 ఎకరాల భూమిని గ్రామసులకు అసైన్ చేశారు.
మరో 138 ఎకరాల భూమిని కొందరు గ్రావుస్తులు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన ప్రభుత్వ భూమిలో ఇండియన్ పోలో అసోసియేషన్‌కు 25 ఎకరాలు, హుడాకు 10 ఎకరాలు, ట్రాన్స్‌కోకు 11 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ భూమి కేవలం 115 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అంచనా. ఈ స్థలంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటుకు జీహెఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సవూచారం.