హరితహారం...తెలంగాణకు మణిహారం
హరితహారం తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. నియోజకవర్గంలో ఒకే రోజు 6 లక్షల పండ్ల మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని నెక్కొండ రోడ్, పోశమ్మగుడి కాలనీల్లో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా విద్యార్థులు, శాంతిపట్టణ సమాఖ్య మహిళలు నృత్యాలు చే స్తూ స్పీకర్‌కు స్వాగతం పలికారు.
-
స్పీకర్ మధుసూధనాచారి
-
ఉత్సాహంగా మొక్కల పంపిణీ
-
నియోజకవర్గంలో స్వచ్ఛందంగా మొక్కలు నాటుకున్న ప్రజలు
నర్సంపేట : హరితహారం తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. నియోజకవర్గంలో ఒకే రోజు 6 లక్షల పండ్ల మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని నెక్కొండ రోడ్, పోశమ్మగుడి కాలనీల్లో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా విద్యార్థులు, శాంతిపట్టణ సమాఖ్య మహిళలు నృత్యాలు చే స్తూ స్పీకర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టడం జరిగిందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లాలకు నర్సంపేట ఆదర్శంగా నిలవాలన్నారు. అన్ని రకాల మొక్కలను ఇతర రాష్టాల నుంచి తెప్పిస్తూ ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉచితంగా వస్తున్నాయని మొక్కలు నాటి ఊరుకోకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం పోశమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఎఫ్‌ఆర్వో సుధీర్, రాయిడి రవీందర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్‌గౌడ్, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ మల్లికార్జునస్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పెండెం రాజేశ్వరి, కౌన్సిలర్ నాయిని నర్సయ్య, బండి భారతి రమేష్, నాగిశెట్టి పద్మప్రసాద్, గుంటి కిషన్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కరుణ, రజిత, ప్రకాశ్, సుదర్శన్, మురళి, తదితరులు పాల్గొన్నారు.