
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఆదేశించారు. జిల్లాల వారీగా కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాల కుదింపు అనుమతించబోమని, అన్ని జిల్లాలు ఈ నెలాఖరుకల్లా తమ లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
హరితహారం పురోగతిపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మళ్లీ రెండు వారాల తర్వాత హరితహారంపై చీఫ్ సెక్రటరీ సమీక్ష ఉంటుందని ఈలోగా లక్ష్యం మేరకు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ పీ.కె.ఝా, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment