
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు హరితహారం కార్యక్రమం మెరిసింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు, అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి శుక్రవారం బ్రెజిల్‌లోని క్యూరీటుబా లో జరిగిన 25వ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఐయూఎఫ్‌ఆర్‌వో) సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్ వివరించారు. సిద్దిపేట జిల్లా లోని ‘గజ్వేల్–ములుగు అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల ప్రకృతి దృశ్యాలను ఈ సమావేశంలో ప్రదర్శించారు. గత నెల 29న ప్రారంభమైన ఐయూఎఫ్‌ఆర్‌వో సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో 110 దేశాల్లో విధాన రూపకర్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, సంస్థలతో కూడిన ప్రపంచ నెట్‌వర్క్, భాగస్వామ్యపక్షాలు పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment