
నల్లవాగు గురుకులంలో 100 మీటర్ల హరిత పతాకాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థులు
హరితహారంలో భాగంగా నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం వినూత్న ప్రదర్శన నిర్వహించారు.
వంద మీటర్ల పొడవు జెండాతో ప్రదర్శన
కలే్హర్: హరితహారంలో భాగంగా నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ప్రిన్సిపాల్ మెవాబాయి ఆధ్వర్యంలో విద్యార్థులు 100 మీటర్ల పొడవు గల హరిత పతాకాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. హరితహారం కింద మొక్కలు నాటాలని నినాదాలు చేశారు. అనంతరం గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, సిర్గాపూర్ ఎస్‌ఐ మురళీమోహన్, ఈఓపీఆర్‌డీ మల్లికార్జున్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రూపాగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు గుండు మోహన్, ఎంపీటీసీ రాజుకుమార్, సర్పంచ్ అనురాధా, యువజన సంఘం నాయకులు అశోక్, కాంగ్రెస్ నాయకులు రాజుపటేలు, ఉపాధ్యాయులు వెంకట్‌స్వామి, ఐవాన్‌హో, శంకర్ పాల్గొన్నారు.