- జిల్లాలో 90 శాతం గుడుంబా నియంత్రణ
- హరితహారంలో మొదటి స్థానం
- మొక్కల సంరక్షణకు చర్యలు
గుడుంబా నిర్మూలనకు రూ.5 కోట్లు
Published Thu, Sep 29 2016 12:30 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఉద్యమంలా చేపట్టిన గుడుంబా నిర్మూలన కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చింద ని, రానున్న రోజుల్లో ఇదే స్పూర్తిని కొనసాగించాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ఆమె జిల్లాలోని ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్ ద్వారా గుడుంబా నిర్మూలన, హరితహారం కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ గుడుం బా వ్యాపారం మానివేసిన వారికి ఉపాధి చూపించేందుకు ప్రత్యేక నిధిగా రూ.5కోట్లు మంజూరు చేసిందన్నారు. లబ్దిదారులను ఎంపిక చేయాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
4.41 కోట్ల మొక్కలు..
హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 4.41కోట్లు మొక్కలు నాటినట్లు కలెక్టర్ కరుణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషిచేసిన అధికారులను అభినందించారు. మొక్కల జియో ట్యాగింగ్ ప్రకియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో విజయ్‌గోపాల్, డీఎఫ్‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement