ఆ జిల్లాను లండన్ చేస్తాం: సీఎం | CM KCR Participate Haritha Haram in Karimnagar | Sakshi
Sakshi News home page

ఆ జిల్లాను లండన్ చేస్తాం: సీఎం

Published Wed, Jul 12 2017 2:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

ఆ జిల్లాను లండన్ చేస్తాం: సీఎం - Sakshi

ఆ జిల్లాను లండన్ చేస్తాం: సీఎం

కరీంనగర్: లండన్ నగరానికి థేమ్ నదిలాగా.. కరీంనగర్ కు  మానేరు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో నగరాన్ని  లండన్‌లా చేస్తామన్నారు. ఇటీవలే రూ. 500 కోట్లతో మానేరు టూరిజం ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగిందని సీఎం చెప్పారు. నగరంలోని రోడ్లు అద్భుతంగా రూపొందుతున్నాయని తెలిపారు. త్వరాలోనే కరీంనగర్ లండన్‌ను తలపిస్తుందని అన్నారు. మూడో విడత హరితహారంలో భాగంగా నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

నగర ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ. 25 కోట్లతో అద్భుత కళాభారతిని నిర్మిస్తామని దానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని సీఎం అన్నారు. మరో రెండేళ్ల తర్వాత కరీంగనర్ కు హెలికాఫ్టర్లో దిగుతుంటే నగరంలో దిగుతున్నామా..అడవిలో దిగుతున్నామా అనే విధంగా పచ్చబడాలన్నారు. ఈ బాధ్యత ప్రతి ఒక్క మహిళ నెత్తికెత్తుకోవాలి. హరితహారంలో  కరీంనగర్ రాష్ట్రానికి ఆదర్శం కావాలన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement