సాక్షి, హైదరాబాద్: సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కుమార్తె పూజా కౌర్ వివాహానికి హాజరయ్యారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్‌లో మానేరు డ్యాం వద్ద ఉన్న స్పోర్ట్స్ స్కూల్ మైదానానికి మధ్యాహ్నం 12.50 సమయంలో చేరుకున్నారు.
రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి బైపాస్ రోడ్డులోని వి–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
గంటన్నరపాటు అక్కడే గడిపిన సీఎం.. భోజనానంతరం క్రిస్టియన్ కాలనీలోని మంత్రి గంగుల నివాసానికి చేరుకున్నారు. తేనీటి విందు తర్వాత సీఎంకు గంగుల వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. కలెక్టర్ హుజూరాబాద్‌లో అమలవుతున్న దళిత బంధు ప్రాజెక్టు తీరు తెన్నులపై రూపొందించిన బుక్‌లెట్‌ను సీఎంకు అందజేశారు. ప్రత్యేక బస్సులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం 3.45 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. వివాహ వేడుకకు వెళ్లిన కేసీఆర్..రవీందర్‌సింగ్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. అతడిని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా సర్దార్ రవీందర్ సింగ్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. pic.twitter.com/HoxC0UWxXS
— TRS Party (@trspartyonline) December 8, 2022
చదవండి: (బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ)
Comments
Please login to add a commentAdd a comment