Ravinder singh
-
మాయమవుతున్న రూ.కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం
సాక్షి, హైదరాబాద్/మెదక్: ‘మెదక్‌లోని పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌కు ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యంలో 362 టన్నుల మేర తేడా వచ్చింది. అంటే రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం లెక్క దొరకడం లేదు. వీటితో పాటు 700 బేల్స్ గన్నీ బ్యాగులు లేవు. 320 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) చెడిపోయాయి. మొత్తంగా ఈ మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.6 కోట్లు. ఆకస్మిక తనిఖీలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి..’పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం రాష్ట్ర స్థాయి అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో స్వయంగా పోస్ట్ చేసిన వివరాలు ఇవి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎంఎల్ఎస్ పాయింట్లలో వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించి శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. నిఘా కరువు..రికార్డుల్లేవు రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరతాయి. ఇక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్) కింద ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళతాయి. అక్కడి నుంచే జిల్లాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతాయి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరైన నిఘా, రికార్డుల వ్యవస్థ ఉండటం లేదు. రాష్ట్రంలో 171 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల అధికారులు లేరు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సెపె్టంబర్ 8న సంస్థ చైర్మన్ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసినప్పుడు రెండేళ్లుగా అక్కడ స్టాక్ పాయింట్ ఇన్చార్జి లేడని, కేవలం డీఈవో ద్వారానే కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ, సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తేలింది. అక్కడున్న 1,520 బ్యాగుల సన్నబియ్యం తినడానికి పనికిరాకుండా పోవడాన్ని కూడా గుర్తించారు. గోదాముల నుంచే మొదలు.. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం వచ్చే సమయంలోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లతో మిల్లర్లు కుమ్మౖMð్క బియ్యం లోడ్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇప్పటికే పలు సంఘటనల్లో బయటపడింది. గత ఏప్రిల్ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ఎఫ్‌సీఐ గోదాం నుంచి సుల్తానాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు 5 లారీల్లో బియ్యం పంపించారు. కానీ 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. మిగతా 2 లారీలు కాట్నపల్లి వద్ద ఉన్న ఓ రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లేఖ ద్వారా తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యాలయానికి సంబంధం లేకుండా పెద్దపల్లిలో సీఎంఆర్‌కు అదనంగా 30 వేల టన్నుల బియ్యం తీసుకున్నట్లు తేలిందని కూడా వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం పంపించే క్రమంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయం అవుతున్నాయి. మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో 10 వేల క్వింటాళ్లకు పైగా పీడీఎస్, సన్న బియ్యం లెక్క తేలకుండా పోయినట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్టాక్ పాయింట్ల ఇన్చార్జిలపై కేసులు కూడా నమోదయ్యాయి. పట్టించుకోని అధికారులు తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. 171 ఎంఎల్ఎస్ పాయింట్లలో కనీసం 150 చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిల్లోని అధికార యంత్రాంగం అండతో బియ్యం య థేచ్ఛగా గాయబ్ అవుతున్నాయని సంస్థకు చెందినవారే అంగీకరించడం గమనార్హం. -
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి
-
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్
సాక్షి, కరీంనగర్: ఉద్యమ నాయకుడు సర్దార్ రవీందర్‌సింగ్‌ను అదృష్టం వరించింది. స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్‌సింగ్ మాస్‌లీడర్‌గా, న్యాయవాదిగా, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా, ఐదుసార్లు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో అదృష్టమంటే రవీందర్సింగ్దే అంటూ చెప్పుకోవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కరీంనగర్లో రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటిలోనే రాష్ట్రస్థాయి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ నిర్ణయాలన్ని ఒకేరోజు కావడం అనూహ్యంగా జరిగాయి. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జీవో విడుదల చేశారు. కరీంనగర్లో రవీందర్‌సింగ్ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటిలోనే ఉత్తర్వులు వెలువడడంతో రవీందర్‌సింగ్ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్టూడెంట్ లీడర్‌గా.. మాస్ లీడర్‌గా.. రవీందర్‌సింగ్ విద్యార్థి దశలోనే 1984లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. కరీంనగర్ మున్సిపాల్టీలో 1995లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడంతోపాటు బీజేపీ నగర అధ్యక్షుడిగా 2006 వరకు పనిచేశారు. 2006లో సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కేసీఆర్ పిలుపును అందుకొని బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్ నగరంలో ఉధృతంగా నడిపించడంతో కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పనిచేయడంతో కేసీఆర్ అనేక సందర్భంలో రవీందర్ సింగ్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఖాయమంటూ ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ అవకాశం అందినట్లే అంది అందకుండా పోయింది. రాష్ట్రస్థాయి పథకాలు అమలు.. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, మేయర్‌గా పనిచేసిన కాలంలో సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో ఒక్క రూపాయి మేయర్‌గా ప్రసిద్ధి పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మేయర్‌గా ఉంటూనే కరీంనగర్ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ టీచర్, క్రీడా, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ మాస్ లీడర్‌గా, మేయర్‌గా మన్ననలు పొందారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కుమార్తె పూజా కౌర్ వివాహానికి హాజరయ్యారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్లో మానేరు డ్యాం వద్ద ఉన్న స్పోర్ట్స్ స్కూల్ మైదానానికి మధ్యాహ్నం 12.50 సమయంలో చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి బైపాస్ రోడ్డులోని వి–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గంటన్నరపాటు అక్కడే గడిపిన సీఎం.. భోజనానంతరం క్రిస్టియన్ కాలనీలోని మంత్రి గంగుల నివాసానికి చేరుకున్నారు. తేనీటి విందు తర్వాత సీఎంకు గంగుల వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. కలెక్టర్ హుజూరాబాద్‌లో అమలవుతున్న దళిత బంధు ప్రాజెక్టు తీరు తెన్నులపై రూపొందించిన బుక్‌లెట్‌ను సీఎంకు అందజేశారు. ప్రత్యేక బస్సులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం 3.45 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. వివాహ వేడుకకు వెళ్లిన కేసీఆర్..రవీందర్‌సింగ్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. అతడిని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా సర్దార్ రవీందర్ సింగ్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. pic.twitter.com/HoxC0UWxXS — TRS Party (@trspartyonline) December 8, 2022 చదవండి: (బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ) -
కరీంనగర్ ‘కారు’లో ఏం జరుగుతోంది?
అధికార పార్టీ అంటే గ్రూపులు తప్పవు. పదవుల పరుగు పందెంలో ఎవరికి వారు తామే ముందుండాలని అనుకుంటారు. కరీంనగర్ సిటీలో మంత్రికి, నగర మాజీ మేయర్ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైంది. మధ్యలో మాజీ మేయర్ అల్లుడి వ్యవహారంతో రెండు గ్రూపుల మధ్య వైరం మరింత ముదిరింది. ఇంతకీ కరీంనగర్ కారుకు రిపేర్ జరుగుతుందా? కరీంనగర్ సిటీ టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొద్దిరోజులుగా తనరూటే సెపరేటు అంటూ సింగిల్‌గా వెళ్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్‌పై నగర టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా మూకుమ్మడి యుద్ధానికి దిగారు. రవీందర్ కుటుంబ సభ్యులు మంత్రి గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రవీందర్ సింగ్ అల్లుడు ఓ వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపును టీఆర్ఎస్ కార్పొ రేటర్లు బహిర్గతం చేశారు. సింగ్ కుటుంబాన్ని పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని అధిష్టానాన్ని కోరారు. దీనిపై మంత్రి కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ దంపతులు సైతం స్పందించారు. ఉద్యమకాలం నుంచి తాము పార్టీ కోసం పనిచేస్తున్నామని, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అల్లుడు, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్ ఓ వ్యాపారితో మాట్లాడిన ఫోన్ సంబాషణను టీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుపడుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌పై చేసిన వ్యాఖ్యల్ని డిప్యూటీ మేయర్ స్వరూపరాణి, పలువురు కార్పొరేటర్లు ఖండించారు. తమ డివిజన్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, మంచినీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో కౌన్సిల్లో నిరసన తెలియచేస్తూనే, రాత్రికి రాత్రి జేసీబీతో రోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు తవ్వి సమస్యను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మేయర్, ఆయన కుటుంబసభ్యులు పథకం ప్రకారం సమస్యలు సృష్టిస్తూ...వాటికి మంత్రి కారణమంటూ చెప్పడం వెనుక ఉన్న కుట్రలను ప్రజలు గ్రహించాలని కోరారు. పార్టీకి నష్టం చేకూర్చేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న రవీందర్ సింగ్, కార్పొరేటర్ కమల్ జిత కౌర్, ఆమె భర్త సోహన్ సింగ్‌ను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు కరీంనగర్ 40వ డివిజన్ మార్కెట్ ఏరియాలోని ఓ కల్వర్టు ధ్వంసం చేశారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్వర్టు డ్రైనేజీని జెసిబితో ధ్వంసం చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ శాఖకు 2.5 లక్షల రూపాయల నష్టం జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. ఆది నుంచీ తాము టీఆర్ఎస్లో ఉన్నామని తాము తప్పు చేసినట్టు నిరూపించాలని కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, ఆమె భర్త సొహాన్ సింగ్ సవాల్ విసిరారు. ఇప్పుడీ టాపిక్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ వెంట ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనపైన, ఆయన కుటుంబంపైనా చర్యలు ఉంటాయా? ఉండవా? అనే చర్చ జోరుగా సాగుతోంది. -
కరీంనగర్ టీఆర్ఎస్లో కోల్డ్ వార్.. ఆడియో లీక్ కలకలం!
సాక్షి, కరీంనగర్: జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయాలు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. సదరు లేఖలో మాజీ మేయర్ కుటుంబం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, మంత్రిపై రవీందర్ సింగ్ అల్లుడు మాట్లాడిన ఆడియో లీక్ కలకలం సృష్టించింది. ఇక, ఆడియోలో టీఆర్ఎస్ మంత్రి, కలెక్టర్ గురించి మాట్లాడినట్టు పార్టీ కార్యకర్తలు గుర్తించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మేయర్ రవీందర్ సింగ్ అల్లుడే సమస్యలు సృష్టించి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించరాదని సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ సీఎం బీహార్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా వెళ్లడం విశేషం. ఇది కూడా చదవండి: ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం -
కరీంనగర్: అజ్ఞాతంలోకి రెబెల్స్.. మాజీ మేయర్ ఫోన్ స్విచ్ఛాఫ్
సాక్షి, కరీంనగర్: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో ఎక్కడికి వెళ్లారన్నది అంతుపట్టని విషయంగా మారింది. వారితో సంప్రదింపులు జరిపేందుకు ఎమ్మెల్యేలు, మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులుగా భానుప్రసాద్, ఎల్.రమణ బరిలో ఉన్నా.. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఆశించ భంగపడ్డ నేత కావడంతో తన భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లభించేంత వరకు తాను బయటికి వచ్చేది లేదని సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది. చదవండి: ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం ఇదే సమయంలో ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న ఇండిపెండెంట్ అభ్యర్థులతో రవీందర్‌సింగ్ తెరవెనుక మంతనాలు సాగిస్తున్న విషయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం పలువురు అసంతృప్త, బరిలో నిలిచిన నేతలు, వారి మద్దతుదారులతో రవీందర్‌సింగ్ రహస్యంగా సమావేశమయ్యారు. వేములవాడలో కొందరు నేతలతో రహస్యంగా నిర్వహించిన సమావేశం తాలూకు ఫొటోలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక సిరిసిల్లలో మాదాసి వేణు నామినేషన్ ఆమోదం పొందింది. ఈయన కూడా ఎంపీటీసీల ఆత్మగౌరవం నినాదంతోనే ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారు. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ ఎన్నికై మూడేళ్లవుతున్నా.. పైసా విదల్చని పదవులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇతని అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన పలువురు నేతలు కూడా ఎవరికీ అందుబాటులో లేరు. వేణును బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు జగిత్యాల జిల్లా ఎంపీటీసీల గౌరవ అధ్యక్షుడు నగేశ్ యాదవ్ వీడియో వైరల్‌గా మారింది. అధికారాలు లేని తమ ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని లేదా తమకు ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి అభ్యర్థి కోసం యత్నాలు..! ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్న ఇండిపెండెంట్లు, రెబెల్స్ అంతా ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెబెల్స్ మంతనాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో విడిపోయి పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని రవీందర్‌సింగ్ వేములవాడలో పలువురు అసంతృప్త నేతలను కలిసి విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి ఉదయానికి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. శిబిరాన్ని సందర్శించిన మంత్రి హైదరాబాద్ వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విడిది శామీర్‌పేటలోని ఓ రీసార్ట్‌ను మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారని తెలిసింది. ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారని.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా వారితోనే ఉన్నారని సమాచారం. మరోవైపు శిబిరాల్లో ఉన్న నేతలు తమకే ఓటు వేస్తారా? లేక ఎదురు తిరుగుతారా? అన్న భయం గులాబీ సీనియర్ నేతలను వెంటాడుతోంది. ఎంపీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వీరు పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇతరులకు ఓటేయకుండా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు గులాబీ నేతలు. బరిలో 24 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్క్రూటినీ (నామినేషన్ల పరిశీలన) ముగియగా.. ముగ్గురి నామినేషన్లు తిరస్కరించినట్లు బుధవారం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించారని, వాటిలో నుంచి శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్లు తిరస్కణకు గురైనట్లు చెప్పారు. బరిలో 24 మంది ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉందని వివరించారు. ఓటు మాదే.. సీటు మాదే.. ఎంపీటీసీల ఆత్మగౌరవం నిలిపేందుకు తాను ఎమ్మెల్సీ బరిలో నిలిచానని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎంపీటీసీలకు న్యాయంగా రావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఖజానాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన తాము.. వారికి ఏ పనీ చేయలేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు, పూర్వపు అధికార వైభవం తీసుకొచ్చేందుకు తాను పోటీ చేసి తీరుతానని తెలిపారు. తమ ఓట్లతో పారిశ్రామిక వేత్తలకు సీట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. సీనరేజీ గ్రాంట్లు, వెహికిల్స్ అలవెన్స్, ఈజీఎస్ ఫండ్స్, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే నిధులను తమకు రాకుండా మళ్లించడం ఎంత మేరకు న్యాయమని, తమ గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ ఆత్మగౌరవం నిలవాలంటే తామే బరిలో ఉంటామని, ఓటు మాదే–సీటు మాదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. -
విషాదం: ఒకేరోజు అటు రవీందర్ పాల్... ఇటు కౌశిక్
న్యూఢిల్లీ: భారత హాకీలో విషాదం. కరోనా కారణంగా శనివారం ఒకే రోజు ఇద్దరు మాజీ స్టార్ క్రీడాకారులు తుది శ్వాస విడిచారు. కోవిడ్–19కు చికిత్స పొందుతూ కోలుకోలేకపోయిన రవీందర్ పాల్ సింగ్ (61) లక్నోలో... ఎంకే కౌశిక్ (66) ఢిల్లీలో కన్ను మూశారు. కౌశిక్‌కు భార్య, ఒక కుమారుడు ఉండగా... రవీందర్ పాల్ అవివాహితుడు. 1980 మాస్కో ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణపతకం గెలిచింది. రవీందర్ పాల్, కౌశిక్‌లు ఈ జట్టులో సభ్యులు కావడం విశేషం. ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి పట్ల హాకీ ఇండియా (హెచ్ఐ) సంతాపం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ స్వర్ణ పతకం సాధించిన ఆటగాళ్లుగా వారిద్దరూ భారత హాకీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారని హెచ్ఐ అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోంబామ్ శ్రద్ధాంజలి ఘటించారు. కౌశిక్: ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా కౌశిక్ భారత హాకీపై తనదైన ముద్ర వేశాడు. ఆయన శిక్షణలో భారత పురుషుల జట్టు 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకోగా... భారత మహిళల జట్టు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. కౌశిక్ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా అర్జున, ఆపై ‘ద్రోణాచార్య’ పురస్కారాలతో సత్కరించింది. రవీందర్ పాల్: 1979 జూనియర్ ప్రపంచకప్‌లో సభ్యుడి నుంచి సీనియర్ టీమ్‌కు వెళ్లిన రవీందర్ పాల్ 1984 వరకు సెంటర్ హాఫ్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న అతను 1982 ఆసియా కప్‌లో, రెండు చాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. -
కరోనా: భారత హాకీ దిగ్గజం ఇక లేరు
సాక్షి, లక్నో: కరోనా మహమ్మారి మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60) కరోనా కారణంగా శనివారం కన్నుమూశారు. ఏప్రిల్ 24న కరోనా సోకడంతో లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే వైరస్ నుంచి కోలుకొని సాధారణ వార్డుకు చేర్చిన అనంతరం శుక్రవారం అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. రవీందర్ పాల్ మరణంపై హాకీ ఇండియా ట్విటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసింది. క్రీడా మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. ఒక గోల్డెన్ క్రీడాకారుడిని కోల్పోయిదంటే ట్వీట్ చేశారు. క్రీడా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ నివాళులర్పించారు. కాగా 1980లో మాస్కో ఒలింపిక్ విజేత జట్టులో రవీందర్ పాల్ సింగ ఉన్నారు. అలాగే కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్ జూబ్లీ కప్ (హాంకాంగ్), 1982 ప్రపంచకప్ (ముంబై, 1982 ఆసియా కప్ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1984 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు. లక్నోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?! Saddened to learn about the loss of former India International who was part of the Gold Medal winning Indian squad at the 1980 Moscow Olympics, Mr. Ravinder Pal Singh. Hockey India sends its condolences to his family and loved ones. 🙏#IndiaKaGame pic.twitter.com/vHjIQlrDqW — Hockey India (@TheHockeyIndia) May 8, 2021 Deeply saddened by the passing of Ravinder Pal Singh sir, member of the 1980 Gold-winning Olympics team. It was a unit which taught generations of us the value of dream, dedication and hard work. May his soul rest in peace. #COVIDSecondWave #Indianhockey 📷 Lucknow Tribune pic.twitter.com/r4RqBMv3Ns — SV Sunil | ಎಸ್.ವಿ. ಸುನಿಲ್ (@SVSunil24) May 8, 2021 -
రూపాయికే ఆరోగ్య పథకం
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సం స్థలో మరో నాలుగు కొత్త పథకాలు రూపుదిద్దుకున్నాయి. రూపాయికే అంతిమయాత్ర కార్యక్రమం అమ లు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కరీంనగర్ బల్దియా.. అదే స్ఫూర్తితో మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. మూడు రోజుల్లో పాలకవర్గం గడువు ముగుస్తున్నప్పటికీ మేయర్ రవీందర్ సింగ్ నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కొత్త పథకాల గురించి వివరించారు. పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ చెకప్ చేసే విధంగా పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్పొరేషన్ ఆవరణలోనే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సహకారంతో ఒక డాక్టర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమిస్తామన్నారు. వైద్య పరీక్షల కోసం వేల రూపాయల ఖర్చును భరించలేని పేదల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికీ చెప్పులు లేకుండా నడిచేవారు ఉన్నారని వారందరికీ చెప్పులు అందించే విధంగా బూట్‌హౌస్ పథకం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇళ్లలో మూలన పడి ఉన్న పాత చెప్పులు, బూట్ల జతలు తీసుకొచ్చి రిపేర్లు చేసి అందిస్తామన్నారు. ఇందుకోసం కళాభారతిలో షెడ్డును నిర్మిస్తామని తెలిపారు. నగరంలోని కమ్యూనిటీ హాళ్లలో నాలుగు రీడింగ్‌రూంలు ఏర్పా టు చేసి ఒకటి మహిళలకు కేటాయిస్తామని పేర్కొ న్నారు. మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో సేవా దృక్ఫథంలో నడుస్తున్న నైట్ షెల్టర్‌లోనే అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. రెండు పూటల భోజనం, బెడ్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆరేళ్లకు మోక్షం..
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కమాన్‌రోడ్డు అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. కమాన్ రోడ్డు విస్తరణ చేపట్టిన ఆరేళ్ల తర్వాత పూర్తి అడ్డంకులు తొలిగాయి. 2012లో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టగా.. కమాన్‌రోడ్డులోని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని భవనాలు కూల్చకుండా వదిలేయడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది. దశల వారీగా కోర్టు స్టేలు వెకేట్ అయిన ఇళ్లను తొలగిస్తూ వచ్చారు. చివరగా సిక్వాడీ చౌరస్తాలో అడ్డంకిగా ఉన్న ఇంటికి సంబంధించి వివాదం తొలగిపోవడంతో ఆరేళ్ల తర్వాత రోడ్డుకు మోక్షం లభించింది. ఇటీవల నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ చొరవ తీసుకొని సదరు ఇంటి యజమానితో మాట్లాడి వివాదం తొలగిపోయేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో డ్రెయినేజీ పూర్తికాలేదు. రోడ్డు పనులు మద్యమధ్యలో నిలిచిపోయాయి. నిలిచిన అభివృద్ధి పనులు కమాన్ నుంచి వన్‌టౌన్ వరకు రోడ్డును వందఫీట్లుగా మార్చేందుకు 2012 సంవత్సరంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టారు. దాదాపు ఆరు నెలల పాటు ఆ రోడ్డంతా ఇబ్బందిగా మారింది. కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో అభివృద్ధికి అడ్డంకిగా మారింది. రోడ్డు పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. 14.5 కిలోమీటర్ల రోడ్డులో కేవలం కమాన్ నుంచి వన్‌టౌన్ రోడ్డులో మాత్రమే అభివృద్ధి నిలిచింది. అన్ని రోడ్లు పూర్తయి ఒక్క రోడ్డులో అందులో కరీంనగర్ ముఖద్వారంగా ఉన్న కమాన్‌రోడ్డులో పనులు నిలిచిపోయే సరికి మేయర్, కమిషనర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆదివారం ఇంటి యజమానిని ఒప్పించి ఆదివారం ఎంక్రోచ్‌మెంట్‌లను తొలగించారు. అభివృద్ధికి సహకరించాలి నగరంలో అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి. చిన్నచిన్న ఎంక్రోచ్మెంట్లు ఉంటే స్వయంగా ఇంటి యజమానులే తీసివేసుకుంటే ఇబ్బందులు ఉండవు. నిర్మాణాలకు కూడా ఎలాంటి డ్యామేజీ కాదు. ఒక్కరిద్దరి కారణంగా అభివృద్ధిపై ప్రభావం ఉండకూడదు. నగరపౌరులుగా నగర అభివృద్ధి తోడ్పాటునందించాలి. - రవీందర్‌సింగ్, నగర మేయర్ -
మరో భారత రెజ్లర్ అనర్హత
న్యూఢిల్లీ: ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్ నుంచి మరో భారత రెజ్లర్ అనర్హతకు గురయ్యాడు. రియో ఒలింపిక్స్‌కు చివరి అర్హత పోటీలైన రెండో ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో గుర్ప్రీత్ సింగ్ గ్రీకో రోమన్ 75కేజీ విభాగంలో పాల్గొనాల్సి ఉంది. అయితే తను ఉండాల్సిన దానికన్నా 500 గ్రాముల బరువు అధికంగా తూగాడు. దీంతో తనను బరిలోంచి తప్పించారు. గత నెల ఇదే కారణంగా వినేశ్ ఫోగట్ తప్పుకోవాల్సి వచ్చింది. రెజ్లర్ల నిరాశాప్రదర్శన ఇస్తాంబుల్: ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు చెందిన నలుగురు రెజ్లర్లు తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. 85కేజీ విభాగంలో రవీందర్, 130 కేజీలో నవీన్ , రవీందర్ సింగ్ (59కేజీ), సురేశ్ యాదవ్ (66కేజీ) ఏమాత్రం ప్రభావం చూపలేదు. -
న‘గరం..గరంగా..’
టవర్‌సర్కిల్ : కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. పారిశుధ్య, టౌన్‌ప్లానింగ్, వీధి దీపాల అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఎజెండాలో పొందుపరిచిన 45 అంశాలతోపాటు టేబుల్ ఎజెండాలో నాలుగు అంశాలకు ఆమోదముద్ర వేశారు. నగరపాలక సర్వసభ్య సమావేశం మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన శనివారం కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే 7వ డివిజన్ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ శానిటేషన్‌కు ఎలాంటి పొడిగింపులు లేకుండా టెండర్లు నిర్వహించాలని కోరారు. ఎజెండాలో మొదటి అంశంపై కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఎడ్ల సరిత మాట్లాడుతూ.. నగరంలో వ్యవసాయ భూములను కమర్షియల్‌గా మార్చాలని పలు దరఖాస్తులు చే సినా.. ఒకే స్థలాన్ని ఎజెండాలో చేర్చడంపై ప్రశ్నించగా, రానున్న కౌన్సిల్లో మిగతావి పెడతామని మేయర్ తెలిపారు. నగరంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గందె మాధవి అధికారులపై ఆగ్రహించారు. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు తెలపాలని కోరారు. ఏసీపీ ఫోన్లో సమాధానం ఇవ్వడం లేదని పరిచయం చేయూలని 42వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కోర్టు నుంచి వావిలాలపల్లి రోడ్డ్‌లో ఉన్న రెండు ఫంక్షన్‌హాల్స్‌కు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో శుభకార్యాల సమయంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని 47వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు తెలిపారు. హౌసింగ్‌బోర్డు ఎంట్రన్స్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం తీయాలని 21వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల ప్రకాశ్ కోరారు. 20వ డివిజన్లో 19 మందికి పింఛన్లు రెండుసార్లు వచ్చాయని, వాటిని అర్హులకు ఇవ్వాలని కార్పొరేటర్ నేతికుంట కళావతి కోరారు. ఒక్క రూపాయి నల్లాకు ఆమోదం... నగరంలో ప్రవేశపెట్టిన ఒక్క రూపాయి నల్లా కనెక్షన్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పైపులు కొనుగోలుకు కేటారుుంచిన రూ.25 లక్షల నిధులకు ఆమోదం ముద్ర వేశారు. శానిటేషన్ వర్కర్ల పెంపు నగరపాలక సంస్థలో శానిటేషన్ వర్కర్లు, రిక్షాలు సరిపోవడం లేదని, వర్కర్ల సంఖ్యను పెంచి, మరో రెండు నెలలు పొడిగించి అయినా సరే టెండర్లు నిర్వహించాలని కార్పొరేటర్లు కోరారు. టెండర్లు ఆపడం మన పరిధిలో లేదని, అవసరమైతే వెంటనే 200 మంది వర్కర్ల కోసం మరో టెండర్ నిర్వహిస్తామని, రిక్షాలు కొనుగోలు చేస్తామని మేయర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి 17 ట్రాక్టర్లు వస్తాయని వివరించారు. అధికారుల వాకౌట్.. మేయర్ సముదాయింపు... అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే సదరు యజమానులు వచ్చి కలవగానే(ముడుపులు ఇవ్వగానే) టౌన్‌ప్లానింగ్ అధికారులు వదిలేస్తున్నారని 29వ డివిజన్ కార్పొరేటర్ ఉమాపతి ఆరోపించారు. అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే పనులెలా చేస్తారని, వెంటనే క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, ఆరిఫ్, నలువాల రవీందర్, పెద్దపల్లి రవీందర్ వాగ్వాదానికి దిగారు. తమ పట్ల కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించడంతో అధికారులు వాకౌట్ చేసేందకు ప్రయత్నించగా మేయర్ కలుగజేసుకుని ఆపారు. పరాయిలుగా చూడకండి : కమిషనర్ అధికారులు, పాలకవర్గం అందరం ఒక కుటుంబం. మమ్మల్ని పరాయిలుగా చూడకండి. నొప్పించకుండా ఉంటే సేవకులుగా పనిచేస్తామని కమిషనర్ రమణాచారి తెలిపారు. కార్పొరేషన్లో సిబ్బంది కొరత ఉండడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. 69 అత్యవసర పోస్టులు అవసరమున్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్‌లో సిబ్బంది అంతా డిప్యూటేషన్లపైనే ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సమావేశంలో అన్ని విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్!
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా 24వ డివిజన్ కార్పొరేటర్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రవీందర్‌సింగ్ పేరు ఎన్నికలు జరగకముందు నుంచే ప్రచారంలో ఉన్నా.. పార్టీ నిర్ణయం కోసం ఇన్నాళ్లూ ఎదురుచూడాల్సి వచ్చింది. కరీంనగర్ మేయర్ విషయమై గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ శ్రేణులతో చర్చించి అందరి అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే డెప్యూటీ మేయర్ గా 18వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్లపు రమేశ్, పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆరో డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ఆరిఫ్, విప్‌గా ఐదో డివి జన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణలు కూడా కలిసివచ్చేలా సిక్కు, బీసీ, ముస్లిం, ఎస్సీ వర్గాలకు స్థానం కల్పించారు. నేడో రేపో అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టెన్షన్‌కు తెర ఈనెల 12న కార్పొరేషన్ ఎన్నికల ఫలి తాలు వెలువడినప్పటి నుంచి మేయర్, డెప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. టీఆర్ఎస్ 24 మంది కార్పొరేటర్లను గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు కేవలం ఇద్దరు కార్పొరేటర్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రయత్నాలు కొనసాగించింది. స్వతంత్ర కార్పొరేటర్ల నుంచి ఇద్దరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం.. ఎమ్మెల్యేగా గంగుల, ఎంపీగా వినోద్ టీఆర్ఎస్ నుంచి గెలుపొందడంతో మేయర్ పదవి కైవ సం చేసుకునేందుకు టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ వచ్చినట్లయ్యింది. మేయర్ ఎన్నికకు సమయం ఎక్కువగా ఉండడం.. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ తలమునకలై ఉండడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైంది. ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం ఇప్పటివరకు ఏ పాలకవర్గం చేయనిరీతిలో ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. నగరపాలక సంస్థ పాలక వర్గం ఏర్పడిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో కాకుండా, ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మేయర్ ఎన్నిక తేదీ.. అప్పటి పరిస్థితులను బట్టి వేదికను ఖరారు చేయనున్నట్లు సమాచారం.