సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కమాన్‌రోడ్డు అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. కమాన్ రోడ్డు విస్తరణ చేపట్టిన ఆరేళ్ల తర్వాత పూర్తి అడ్డంకులు తొలిగాయి. 2012లో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టగా.. కమాన్‌రోడ్డులోని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని భవనాలు కూల్చకుండా వదిలేయడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది. దశల వారీగా కోర్టు స్టేలు వెకేట్ అయిన ఇళ్లను తొలగిస్తూ వచ్చారు. చివరగా సిక్‌వాడీ చౌరస్తాలో అడ్డంకిగా ఉన్న ఇంటికి సంబంధించి వివాదం తొలగిపోవడంతో ఆరేళ్ల తర్వాత రోడ్డుకు మోక్షం లభించింది. ఇటీవల నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ చొరవ తీసుకొని సదరు ఇంటి యజమానితో మాట్లాడి వివాదం తొలగిపోయేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో డ్రెయినేజీ పూర్తికాలేదు. రోడ్డు పనులు మద్యమధ్యలో నిలిచిపోయాయి.
నిలిచిన అభివృద్ధి పనులు
కమాన్ నుంచి వన్‌టౌన్ వరకు రోడ్డును వందఫీట్లుగా మార్చేందుకు 2012 సంవత్సరంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టారు. దాదాపు ఆరు నెలల పాటు ఆ రోడ్డంతా ఇబ్బందిగా మారింది. కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో అభివృద్ధికి అడ్డంకిగా మారింది. రోడ్డు పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. 14.5 కిలోమీటర్ల రోడ్డులో కేవలం కమాన్ నుంచి వన్‌టౌన్ రోడ్డులో మాత్రమే అభివృద్ధి నిలిచింది. అన్ని రోడ్లు పూర్తయి ఒక్క రోడ్డులో అందులో కరీంనగర్ ముఖద్వారంగా ఉన్న కమాన్‌రోడ్డులో పనులు నిలిచిపోయే సరికి మేయర్, కమిషనర్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆదివారం ఇంటి యజమానిని ఒప్పించి ఆదివారం ఎంక్రోచ్‌మెంట్‌లను తొలగించారు.
అభివృద్ధికి సహకరించాలి
నగరంలో అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి. చిన్నచిన్న ఎంక్రోచ్‌మెంట్‌లు ఉంటే స్వయంగా ఇంటి యజమానులే తీసివేసుకుంటే ఇబ్బందులు ఉండవు. నిర్మాణాలకు కూడా ఎలాంటి డ్యామేజీ కాదు. ఒక్కరిద్దరి కారణంగా అభివృద్ధిపై ప్రభావం ఉండకూడదు. నగరపౌరులుగా నగర అభివృద్ధి తోడ్పాటునందించాలి.
- రవీందర్‌సింగ్, నగర మేయర్
Comments
Please login to add a commentAdd a comment