హరితహారంపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు
- హరితహారాన్ని విజయవంతం చేయాలి
- ఇబ్రహీంపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
- అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి
- రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. అందుకోసం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. గురువారం రాత్రి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి హరితహారంపై సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గం, డివిజ¯ŒS, జిల్లా స్థాయిలో హరితహారం స్థితిగతులపై మంత్రి ఆరా తీశా రు. రెండో విడత హరితహారంలో ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో రెండో విడతలో 2.10 లక్షల మొక్కలను నాటడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇబ్రహీంపూర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామం హరితహారంలో ముందుండాలని సూచించారు. నాటిన మొక్కలను పరిరక్షించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మొక్కల పంపిణీ ప్రక్రియ, నర్సరీలో మొక్కల నిల్వలపై మంత్రి అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరితహారాన్ని యజ్ఞంలా చేపట్టాలని, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు పడే సూచనలు ఉన్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. పరిస్థితులు అనుకూలించే వరకు హరితహారాన్ని కొనసాగించాలన్నారు. సమావేశంలో సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అటవీ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, శేషుకుమార్ పాల్గొన్నారు.