సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మిగిలిన 8 జిల్లాలో మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆ దేశించారు. ఇప్పటికే 33 జిల్లాల్లో 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకాగా మిగిలిన 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
సచివాలయంలో శుక్రవారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కా ర్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో విశాలాక్షి, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టిఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌లపై ఉందన్నారు.
నేటితో కంటి వెలుగుకు 100 రోజులు...
కంటి వెలుగు కార్యక్రమం శనివారంతో 100వ రోజుకు చేరనుందని హరీశ్‌రావు తెలిపారు. 99 పని దినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.61 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశామన్నారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు.
ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయిందన్నారు. రెండో విడత కంటి వెలుగును రాష్ట్ర వ్యా ప్తంగా గత జనవరి 18 నుంచి వంద రోజుల కా ర్యక్రమంగా ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. 100 శాతం పరీక్షలు పూర్తి కాని జిల్లాల్లో పరీక్షలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment