పూర్ణాహుతి చేస్తున్న పండితులు. చిత్రంలో కేసీఆర్ దంపతులు, స్వరూపానందేంద్ర స్వామి
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారం ముగిసింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది.
యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకారంతో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. మహాపూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ పాదపూజ చేసి పుష్పాభిషేకంతో గురువందనం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment