yerravalli
-
ముగిసిన రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారం ముగిసింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకారంతో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. మహాపూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ పాదపూజ చేసి పుష్పాభిషేకంతో గురువందనం సమర్పించారు. -
సీఎం కేసీఆర్ నూతన ఇంటి గడప ప్రతిష్ట
జగదేవ్‌పూర్ (గజ్వేల్): సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి కేసీఆర్ దంపతులు గడప ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామన 5.10 గంటలకు గడపను ప్రతిష్టించారు. కార్తీక మాసం సప్తమి సందర్భంగా మంచిరోజు ఉందని శృంగేరి పండితులు చేసిన సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. శృంగేరీ పీఠం మండితులు ఫణి శశాంకశర్మ, గోపికృష్ణశర్మ పర్యవేక్షణలో మరికొంతమంది పండితుల సమక్షంలో గడప ప్రతిష్టతో పాటు గోమాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో గతంలో నిర్మించిన ఇంటిని కూల్చివేసి నైరుతి ప్రాంతంలో కొన్ని నెలల క్రితం నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొన్నట్లు తెలిసింది. -
మూడోరోజు.. రాజశ్యామలతో మొదలై
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన మహారుద్ర సహస్ర చండీయాగం మూడో రోజు నిర్విఘ్నంగా పూర్తయింది. సహస్ర చండీ మహాయాగం బుధవారం ఉద యం 8 గంటలకు ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంప తులు, ఇతర కుటుంబ సభ్యు లు యాగశాలలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించా రు. మొదట రాజశ్యామల మంటపానికి చేరుకుని అమ్మవారికి తొలి పూజ చేశారు. మహంకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి, పూజ లు చేశారు. బ్రహ్మ స్వరూపిణి మం టపంలో పూజలు చేశారు. అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహ పూజలు నిర్వహించారు. వేదపారాయణ, చతుర్వేద పారాయణ మంటపంలో పూజలు చేశారు. సహస్ర మహాచండీ పారాయణ మంటపంలో చండీమాతకు పూజలు నిర్వహించారు. మహారుద్ర మంటపంలో రుత్వికులు రుద్ర హవనం, రుద్ర పారాయణ నిర్వహించారు. మూడోరోజు రుత్వికులు 2.1లక్షల సప్తశతి శ్లోకాలు, 2 లక్షల నవగ్రహ జపాలు, 44 ఏక దశల పారాయణంతోపాటు.. 44 హోమాలు తెల్ల నువ్వులతో హోమాలు చేశారు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గదర్శనంలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజిల పర్యవేక్షణలో యాగ, పారాయణలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలను వేద పం డితులు పురాణం మహేశ్వరశర్మ, మంగళంపల్లి వేణుగోపాల శర్మ, నారాయణశర్మ, ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ, గోపాల శర్మ, చంద్రశేఖర్ శర్మలు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సన్మానం మూడో రోజు యాగానికి హాజరైన ఎం పీలకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు శాలువా లు కప్పి ఘనంగా సన్మానించారు. వేద పండితుల చేతుల మీదుగా మధ్యాహ్నం సమయంలో యాగానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఈ సన్మానం జరిగింది. ప్రజాప్రతినిధులంతా దంపతులతో యాగానికి హాజ రు కావడం విశేషం. వీరంతా చండీమాతను దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రవీందర్ రెడ్డి, సత్యవతిరాథోడ్, జనార్దన్ రెడ్డి, అరవింద్ రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరిశేఖర్‌రావు, భూంరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
పండగ చేసుకొందాం!
నేను కూడా వస్తా.. ధూంధాంగా గృహప్రవేశాలు చేద్దాం వసతులన్నీ సమకూరాకే డబుల్ బెడ్రూంల్లోకి.. అభివృద్ధికి నమూనాగా రెండు గ్రామాలు నిలవాలి ఎర్రవల్లి-నర్సన్నపేట గ్రామస్తులతో సీఎం కేసీఆర్ గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఇండ్ల నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. అయినా సరే ఇండ్లపై ట్యాంకుల నిర్మాణం, నల్లా కనెక్షన్లు.. ఇలా పూర్తిస్థాయి సౌకర్యాలు సమకూరాకే గృహ ప్రవేశాలు చేసుకుందాం. నేను కూడా వస్తా. పెద్ద పండుగ జేసుకుందాం.’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని మీనాక్షి కన్స్ట్రక్షన్స్ బాధ్యుడు బాపినీడుకు సభాముఖంగా సూచించారు. బుధవారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్హాల్లో ఎర్రవల్లి-నర్సన్నపేట ఆదర్శ గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రెండు గ్రామాలను నమూనాగా చూపాలనే సంకల్పానికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు. మిమ్మల్ని చూసి రాష్ట్ర ప్రజలు ఎన్నో విషయాలు నేర్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం సంఘటిత శక్తితో రెండు గ్రామాల ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘సర్కారే మీ వెనుకుంది. పట్టుబడితే సాధించలేనిదంటూ ఉండదు.’ అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూనే దానికి అనుబంధంగా పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా కుటుంబాల్లో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ‘నిన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న మసిరెడ్డికుంట, ఎర్రకుంట, పాండురంగసాగర్ చెరువులన్నీ తిరిగిన.. నీళ్లు చూస్తే కడుపు నిండింది. ఇప్పటి నుంచి మనకు అన్నీ శుభఘడియలే.. మల్లన్నసాగర్ పూర్తై రెండేళ్లలో ఇక్కడికి గోదావరి జలాలొస్తాయి. 365 రోజులు మన చెరువులు, కుంటలల్ల నీళ్లుంటయ్. కరువుండదు. మన బతుకులకు ఢోకా ఉండదు’ అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఆర్థిక క్రమశిక్షణ రావాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ మాదిరిగా ఇంటి ఆర్థిక వ్యవహారాలన్నీ మహిళలకు అప్పగించి వారి బాటలో నడవాలని సూచించారు. మహిళలు పొదుపుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఖర్చును తగ్గించే అవకాశముంది కాబట్టి ఆ కుటుంబం చల్లగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల అభివృద్ధి కమిటీలు ఇక్కడ చేపట్టే పనుల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కట్టుబట్లు దాటితే జరిమాన రెండు గ్రామాల ప్రజలు గ్రామ కట్టుబాట్లు దాటితే జరిమానా వేసుకునే విధంగా గ్రామ వీడీసీ ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘కులం, మతం, చిన్నపెద్ద తేడా లేదు అంత ఒక్కటే. ప్రతి పనిలో కలిసిమెలిసి ముందుకు నడవాలి’ అని సీఎం పేర్కొన్నారు. ‘మన ఐక్యతను మొక్కజొన్న చేను కొట్టేయడంతో మొదలుపెట్టాలని, అంతాకలిసి గ్రూపులుగా ఏర్పడి పంటలు కోసుకోవాలి’ అని సూచించారు. తక్షణమే గ్రామాల్లో అందరూ మాట్లాడుకుని మహిళలు, పురుషులతో కమిటీలు వేసుకోవాలన్నారు. వైస్-చాన్స్‌లర్ ప్రవీణ్‌రావుకు సన్మానం ఎర్రవల్లి-నర్సన్నపేట గ్రామాల్లో సామూహిక వ్యవసాయ విధానానికి తనదైన పాత్ర పోషిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-చాన్స్‌లర్ ప్రవీణ్‌రావును ఘనంగా సత్కరించారు. రెండు గ్రామాల వ్యవసాయాభివృద్ధికి ప్రవీణ్‌రావు కృషి ప్రశంసనీయమని సీఎం కొనియాడారు. అదే విధంగా గ్రామంలో సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేసిన ఇరిగేషన్‌శాఖ కన్సల్టెంట్ మల్లయ్యను సైతం సీఎం సత్కరించారు. ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తూ రెండు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. కల్యాణ మండలం పరిశీలన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3:03 గంటలకు సభాస్థలికి చేరుకుని ప్రక్కనే ఉన్న కల్యాణ మండపాన్ని పరిశీలించారు. 3:06 నిమిషాలకు సీఎం ప్రసంగం ప్రారంభించి.. 3:42 గంటలకు ముగించారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు ఎర్రవల్లి చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను రానివ్వలేదు. ఈ సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్టీఓ ముత్యంరెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ కన్సల్టెంట్ మల్లయ్య, ఎంపీపీ ఎర్ర రేణుక, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, నర్సన్నపేట సర్పంచ్ బాల్‌రెడ్డి, ఎంపీటీసీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ ఎంబరి రాంచంద్రం, ఎర్రవల్లి గ్రామాభివృద్ధి కమిటీ బాధ్యులు కిష్టారెడ్డి, తుమ్మ కృష్ణ పాల్గొన్నారు. -
అభివృద్ధికి మారుపేరు ఎర్రవల్లి
46 మంది ఎర్రవల్లిలో డబుల్బెడ్రూం పనుల పరిశీలన మధ్యప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ సబ్ ఇంజినీర్ల కితాబు జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి అభివృద్ధికి మారుపేరు అని, ప్రతి పని చాలా బ్రహ్మండంగా జరుగుతున్నాయని మధ్యప్రదేశ్ హౌసింగ్ ఇఫ్రా డెవలప్మెంట్ బోర్డు సబ్ ఇంజనీర్ల బృందం కోఆర్డినేటర్ అంజయ్య అన్నారు. శనివారం మధ్యాహ్నం 46 మంది సబ్‌ఇంజనీర్ల బృందం గ్రామంలో పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును గ్రామస్తులను ఆడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఇండ్ల నిర్మాణంపై శిక్షణ ఇచ్చారన్నారు. అందులో భాగంగానే సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఇక్కడి వచ్చామన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు. అలాగే కుంటల అభివృద్ధి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. డబుల్బెడ్రూం ఇండ్లను మధ్యప్రదేశ్‌లో కూడా కట్టించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకపోతామన్నారు. ఇళ్లకు కావాల్సిన ఇసుకను, సిమెంట్, ఇటుక తదితర ఖర్చులపై ఆరా తీశారు. అలాగే రెడ్‌మిక్స్ ప్లాంట్‌ను త్యేకంగా పరిశీలించి పనితీరును ఆడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ బాకీ, సర్పంచ్ భాగ్య, వీడీసీ ఛైర్మన్ కిష్టారెడ్డి, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ గౌరవ అధ్యక్షులు బాల్‌రాజు, ఉపాధ్యక్షుడు తుమ్మ కృష్ణ, సభ్యులు సత్తయ్య, మల్లేశం, నవీన్, బాబు, నందం, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపయ్యా.. వందనమయ్యా...
ఎర్రవల్లి పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ జగదేవ్‌పూర్: రంగురంగుల గణపతి విగ్రహాల కన్నా మట్టి వినాయక విగ్రహాలే మేలని మట్టి వినాయక ప్రతిమల నిర్వహణ సంస్థ నిర్వహకులు శ్రీనివాసాచారి అన్నారు. గురువారం మండలంలోని సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ముందుగా మట్టితో విగ్రహాలను ఎలా తయారు చేయాలి.. మట్టి వినాయకుల వల్ల లాభాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసే విధానంపై అవగాహన కల్పించారు. రసాయనాలు, రంగులతో తయారు చేసే విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేస్తే నీరు కలుషితమవుతుందన్నారు. పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, వీడీసీ గౌరవ అధ్యక్షుడు కృప్ణ, బాల్‌రాజులు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి శ్రీనివాసాచారిని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వాతి, జ్యోతి, కుమార్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్
అభివృద్ధి పనులపై ఆరా జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాన ఫాంహౌస్‌కు వచ్చారు. సీఎం ఫాం హౌస్‌కు వస్తున్నారని సమాచారం ఉండడంతో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మార్గాన, ఫాంహౌస్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వస్తూ రాగానే వర్షం బాగానే పడిందా? అంటూ ఫాంహౌస్ బాధ్యులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. సాగులో ఉన్న బొప్పాయి పంటను పరిశీలించి పలు సూచనలు, సలహాలిచ్చినట్టు తెలిసింది. పాలీహౌస్ పనులను పరిశీలించారు. తన దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఆరా తీసినట్టు సమాచారం. పంటలు ఎలా ఉన్నాయి?, ఇళ్ల పనులు ఎంత వరకు వచ్చాయి? తదితర అభివృద్ధి పనులపై అధికారులతో ఆరా తీసినట్టు తెలిసింది. సోమవారం వరకు ఇక్కడే ఉంటారని సమాచారం. -
ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విషయం తెల్సిందే. అనంతరం గవర్నర్ నరసింహతో సమావేశమాయ్యరు. అనంతరం రాత్రి 8 గంటల సమీపంలో మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తమ వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. సీఎం ఫాంహౌస్‌కు వస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫాంహౌస్, రోడ్డు గుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారని సమాచారం. -
'ఎర్రవల్లి' పనుల్లో వేగం పెంచాలి
సీఎం దత్తతగ్రామమై ఎర్రవల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించిన జేసీ వెంకట్రాంరెడ్డి జగదేవ్‌పూర్: శ్రావణ మాసం దగ్గరకు వస్తోంది..పనుల్లో వేగం పెంచాలి..సమయం తక్కువగా ఉంది..చాలా రోజులయ్యే.. ఊరికి రాక.. పనులెట్లా జరుగుతున్నాయ్.. అంటూ జేసీ వెంకట్రాంరెడ్డి మంగళవారం రాత్రి సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి వీడీసీ సభ్యులతో అన్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమీపంలో సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో జేసీ వెంకట్రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావుతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చేపడుతన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇళ్ల పనులు ఎంత వరకు వచ్చాయంటూ మీనాక్షి కంపెనీ ప్రతినిధులను, వీడీసీ సభ్యులను ఆడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం శ్రావణ మాసం దగ్గరకు వస్తోందని, పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. ఫంక్షన్‌హాల్, గోదాం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు బాల్‌రాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రవల్లి చరిత్రలో నిలుస్తుంది
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి జగదేవ్‌పూర్: సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి దేశ చరిత్రలో నిలుస్తుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో వారు పర్యటించి, డబల్బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎర్రవల్లి ఇళ్లు పేదోళ్ల విల్లాలంటూ కొనియాడారు. గత 67 ఏళ్లలో దేశంలో ఎక్కడా జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతోందన్నారు. డబుల్బెడ్రూం పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్‌కు రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని, రూరల్ ఏరియాలో రెండు లక్షల 65 వేల ఇళ్లు మంజూరుకు ప్రణాళిక తయారైందని , త్వరలోనే టెండర్లు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మల్లన్నసాగర్ బాధితులను ఆదుకుంటాం మల్లన్నసాగర్ బాధితులు అందోళన చెందవద్దని, ప్రభుత్వ తరపున ఆదుకుంటామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి పక్షాలు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. రైతులు ఏ జీఓ ప్రకారం నష్టపరిహారం కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో గడా అధికారి హన్మంతరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, సర్పంచ్‌లు భాగ్య, బాల్‌రెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణ, గౌరవ అధ్యక్షులు బాల్‌రాజు పాల్గొన్నారు. వర్ధరాజస్వామి ఆలయానికి పూర్వవైభవం తెస్తాం వర్ధరాజస్వామి దేవాలయానికి పూర్వ వైభవనం తీసుకవస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం వర్ధరాజ్‌పూర్ గ్రామంలోని వర్ధరాజస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండో కంచిగా పేరొందిన వర్ధరాజస్వామి ఆలయాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ దేవాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఆర్చకులు మంత్రికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మంత్రి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రవల్లి లెజండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని హనుమాన్, వర్ధరాజస్వామి దేవాలయ ఆవరణల్లో మొక్కలు నాటారు. -
నా జాతకంలో ఓటమి లేదు
- ఎర్రవల్లి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ - దేవుడి దయతో ఏదనుకుంటే అది జరిగింది - ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయితది.. ఈ రెండు గ్రామాలు దేశానికే మార్గదర్శకం కాబోతున్నాయ్ - త్వరలో డబుల్ బెడ్ ఇళ్లలోకి పోదాం - పెద్ద దావత్ చేసుకుందాం.. నేను మీతోనే తింటా.. - ఇంటింటికీ పాడి గేదెలు.. ఇంటర్నెట్ సౌకర్యం - ఊరిలో అంతా కలసి ఉండాలె.. కొట్లాటలు, పంచాయితీలు బంద్ చేయాలె - గ్రామంలో 42 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ గజ్వేల్: ‘‘ఇప్పటివరకు దేవుడి దయ వల్ల నేనేది జరగాలనుకున్ననో అదే జరిగింది.. నేను కూడా ఎర్రవల్లి గ్రామస్తుణ్నే.. జాతకం ప్రకారం నాకు ఫెయిల్యూర్ లేదు.. ఎర్రవల్లి, నర్సన్నపేట ఆదర్శ గ్రామాల ప్రాజెక్టు కూడా సక్సెస్ అయితది.. ఈ రెండు గ్రామాలు రేపు దేశానికే మార్గదర్శకం కాబోతున్నయ్... ఇందులో అనుమానం లేదు..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో వందశాతం రాయితీపై 42 మంది లబ్ధిదారులకు సీఎం ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘మరో రెండు నెలల్లో ఈ రెండు గ్రామాల్లో చిన్న యాగం చేద్దాం.. దేవుణ్ని కొలుచుకుందాం. తర్వాత డబుల్ బెడ్రూం ఇళ్ల గృహప్రవేశ పండుగ చేసుకుందాం. అలాగే రిలయన్స్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందించబోతున్నాం..’’ అని చెప్పారు. ‘‘సంఘటితంగా ఉంటే కొండలను కూడా బద్దలు కొట్టగలం. ఐకమత్యంలో చాలా బలముంది. ఈ విషయాన్ని మనకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలే. ఇప్పుడు మనం ఆచరించి చూపిద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని, ప్రస్తుతం కూడÐð ల్లి వాగును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘ ‘ఈసారి వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని చెబుతుండ్రు. సెప్టెంబర్‌లో బాగా పడతాయట. కూడవెల్లి వాగునీటితో కుంటలను నింపుకుని వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుందాం. తాగునీటికి ఇప్పటికే గోదావరి జలాలు అందుతున్నాయి. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు స్వయం ఆధార గ్రామాలుగా అవతరించాలన్నదే లక్ష్యం. రెండు గ్రామాల్లో ఒక్కరు కూడా పని లేకుండా ఉండొద్దు. 60 కుటుంబాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో ఇప్పటికే కొందరికి ట్రాక్టర్లు అందజేశాం. మరో 16–20 మందిని ఉమ్మడి వ్యవసాయంలో ఆపరేటర్లుగా నియమించబోతున్నం. ఇద్దరిని ఎరువుల గోదాం ఇన్చార్జులుగా నియమిస్తాం. ఒకరికి చెప్పుల దుకాణం, మరో ఇద్దరికి హెయిర్ కటింగ్ సెలూన్స్, మరికొందరికి కూరగాయల మార్కెట్, రెడీమేడ్ షాపులు, హోటళ్లు ఏర్పాటు చేసి ఉపాధి చూపుతాం’’ అని చెప్పారు. ఇంటింటికీ ఆవులు లేదా గేదెలు డబుల్ బెడ్రూం ఇళ్ల గృహ ప్రవేశ సమయానికి ఇంటింటికి రెండు పాడి గేదెలు లేదా ఆవులను అందజేస్తామని సీఎం చెప్పారు. ‘‘ఎవరు నచ్చినై వారు కొనుక్కోవచ్చు. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునే పశువులను కొనుక్కుని పాడి ద్వారా మంచి ఆదాయం పొందాలె. సర్కారే అందరికీ గేదెలు, ఆవులను కొనిస్తది. దీంతో పాటు ప్రతి ఇంటికి పది దేశవాళీ కోళ్లను కూడా అందిస్తం. ఈ పథకాన్ని మంచిగా ఉపయోగించుకుని ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలె. రెండు నెలల్లో గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తవుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి పనిచేసినా అందరికీ తెల్వాలె. ఇందుకు కమ్యూనిటీ హాల్ వేదిక కాబోతుంది’’ అని అన్నారు. ‘‘ఈ రెండు గ్రామాల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని నేను అడిగిన వెంటనే రిలయన్స్ సంస్థ ఒప్పుకుంది. సర్వే కూడా ప్రారంభించింది. రెండు నెలల్లో ఈ సౌకర్యం మీకు అందుబాటులోకి వస్తది. ఈడ కూసోని అమెరికాలో ఉన్న వాళ్లతో వీడియో కాల్ మాట్లాడొచ్చు. హైదరాబాద్‌లో ఉండేటోళ్లు ఎర్రవల్లి కాడ ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుండు.. అనే వాతావరణం ఏర్పడతది. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామస్తులు ఈడికి వచ్చిండ్రు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసిండ్రు. రాబోయే రోజుల్లో ఈ ఊరి నుంచి వేరే గ్రామాలకు పోయి మీరే తోవ చూపాలే. ఈ రెండు గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి.. రేపటి భావితరాల తెలంగాణ కోసమే. ప్రతి గ్రామం ఈ రెండు గ్రామాల్లా తయారు చేయడమే నా లక్ష్యం. కాకపోతే ముందు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు ఆ అదృష్టం పొందాయి’’ అని సీఎం వ్యాఖ్యానించారు. గన్ ఫెన్సింగ్ కంటే సోషల్ ఫెన్సింగ్ గొప్పది ‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. నా భద్రత కోసం ఈడికి ఇంతమంది పోలీసులు వచ్చిండ్రు. ఇది గొప్ప కాదు. సోషల్ ఫెన్సింగ్ అనేది గొప్పది. గ్రామంలో ఒకరికొకరు ఎదురుపడగానే నవ్వుతూ మాట్లాడుకోవాలె. సమష్టిగా ఉండాలే. ఇక నుంచి కొట్లాటలు, పంచాయితీలు బంద్ జేయాలే. నా కోసం నా ఊరున్నది అనే భావన కలగాలె. అది చాలా గొప్పది’’ అని సీఎం చెప్పారు. సమష్టిగా ఉండడం వల్ల ఎన్నో విజయాలు వస్తాయన్నారు. ఇష్టమొచ్చినట్లు పంటలు వేయొద్దు.. ‘‘నిన్న మొన్నటిలాగా ఇకపై ఇష్టమొచ్చినట్లు పంటలు వేయొద్దు. ఈ ఊర్లో ఏ పంటలైతే బాగుంటయో.. ఏ నేలలో ఏ విత్తనమేయాలో.. అగ్రానమిస్టు చెబుతారు. ఆయన చెప్పినట్లే ఇక్కడ పంటలు వేద్దాం. ఈ సారి వెయ్యి ఎకరాల్లో సోయాబీన్, మరో 1,800 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేద్దాం’’ అని సీఎం ఎర్రవల్లి గ్రామస్తులతో అన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావుతో సోయాబీన్ పంట వివరాలను రైతులకు చెప్పించారు. సోయాబీన్ ఎకరాకు 8–10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని, ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ. 5,200 ధర పలుకుతుందని ఈ లెక్కన ఎకరాకు రూ.45 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని ప్రవీణ్‌రావు వివరించారు. అలాగే మొక్కజొన్నకు ఎకరాకు రూ.40 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుందన్నారు. గ్రామం పువ్వులా కనబడాలె.. ‘‘ఎర్రవల్లి ఒక పువ్వులా కనబడాలె. ఇప్పుడు నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లకు ఒక్కొక్క వీధిలో ఒక్కో రంగు వేయాలె. సింగపూర్‌లో ఇలాంటి విధానం ఉంటది. అదే తరహాలో ఇక్కడ కనబడాలె..’’ అని సీఎ కేసీఆర్ జేసీ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. ‘‘వెంకట్రామిరెడ్డి ఈ రెండు గ్రామాల గురించి చాలా కష్టపడుతుండు. తిన్న సద్ది రేవు తల్వాలే. వెంకట్రామిరెడ్డి మీ పెద్ద కొడుకు. మనం శ్రావణమాసంలో ఇళ్లకు పోంగనే పెద్ద దావత్ చేసుకుందం. నేనూ మీతోపాటే భోజనం చేస్తా. వెంకట్రామిరెడ్డిని గొప్పగా సన్మానించుకుందాం..’’ అని అన్నారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు పనితీరును కూడా సీఎం ప్రశంసించారు. హైదరాబాద్ వెళ్లే లోపు మూడ్రోజుల్లో మళ్లీ ఎర్రవల్లి వచ్చి అభివృద్ధిని చూస్తానని తెలిపారు. -
వేద రుక్కులు ఒక్క గొంతుతో..
హైదరాబాద్: ఐదురోజులుగా కొనసాగుతున్న అయుత మహాచండీయాగం నేడు జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి కానుంది. ఈ మహాక్రతువు తుది ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదిహేను వందలమంది రుత్విజులు చతుర్వేదసంహితలతో వేదరుక్కులను ఒక్క గొంతుతో ఉదానుదాత్త స్వరయుక్తంగా పఠించనుండటం మహాహోమపూర్ణాహుతిలో విశేషం కానుంది. విశ్వశాంతి, విశ్వకళ్యాణం, తెలంగాణ ప్రజల సౌభాగ్యం మహాసంకల్పంగా పూర్ణాహుతి సుసంపన్నం కానుంది. అయుత చండీయాగానికి సమాపనంగా జరుగుతున్న పూర్ణాహుతికి జగద్గురువు శృంగేరీ శారదాపీఠాధిపతి శ్రీ భారతీతీర్థస్వామీజీ తన ఆశీర్వచనాలతో పాటు కావాల్సిన హోమద్రవ్యాలను, వస్ర్తాలను ఇప్పటికే పంపించారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టు వస్త్రాలను పంపించారు. వీటిని ధరించి నేడు కేసీఆర్ యాగంలో పాల్గొననున్నారు. పూర్ణాహుతిక్రమమిదే.. ఉదయం 7 గంటలనుంచి పూర్ణాహుతి హోమం ప్రారంభమైంది. పదకొండు వందల మంది రుత్విక్కులు మూలమంత్రాన్ని జపిస్తూ పాయసం, నెయ్యి సమర్పిస్తూ హోమం జరుపుతున్నారు. యాగశాలలో మధ్యభాగంలో ఏర్పాటు చేసిన దుర్గాచక్రం, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మిల సన్నిధిలో మధ్యకుండంలో చండీహోమపూర్ణాహుతి జరుగనున్నది. పూర్ణఫలాలు, పువ్వులు, నవధాన్యాలు, సమిథలు, పట్టువస్ర్తాలు, కొబ్బరికాయలు, సుగంధద్రవ్యాలను పూర్ణాహుతి ద్రవ్యాలుగా ఉపయోగించనున్నారు. మధ్యాహ్నానికి హోమ పూర్ణాహుతి జరుగనున్నట్లు ప్రధాన రుత్విజులు తెలిపారు. అయుతచండీయాగంలో పూర్ణాహుతికి ముందుగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన విష్ణుహోమాన్ని, విష్ణుహోమ పూర్ణాహుతిని కూడా పూర్తి చేసినట్టు వివరించారు. యాగ నిర్వహణలో భాగంగా శనివారం నాటికి నాలుగువేల కిలోల నెయ్యి, 12 క్వింటాళ్ల క్షీరాన్నం, 30 టన్నుల సమిథలను హోమద్రవ్యాలుగా వినియోగించారుగించామన్నారు. ఆదివారం ఉదయం భగవత్పాదులు ఆదిశంకరాచార్య సూచించిన నిమమావళి ప్రకారం చతుర్వేదసంహితలతో కూడిన మహారుద్రహోమాలకు పూర్ణాహుతి జరుగుతుందని పేర్కొన్నారు. గురు ప్రార్దన, పుణ్యాహ వచనము, కుండ సంస్కారము, ప్రధాన కుండములో అగ్ని ప్రతిష్టా, అగ్ని విహరణము, స్థాపిత దేవతా హవనము, సపరివార అయుత చండీయాగం, అయుత లక్ష నవాక్షరీ, ఆజ్యాహుతి, మహా పూర్ణాహుతి, వసోర్దారా, కుమారీ, సుహాసినీ, దంపతీపూజ, మహా మంగళ హారతి, ఋత్విక్ సన్మానము, కలశ విసర్జనము, అనబృధ స్నానము, మహాదాశీర్వచనము, ప్రసాద వితరణము వంటి కార్యక్రమాలతో మొత్తం యాగం సంపూర్ణమవుతుంది. నేటి ప్రత్యేక అతిథులు.. అయుత చండీయాగానికి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ రానుడడంతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా విధించారు. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. -
చండీయాగానికి రాష్ట్రపతి
-
చండీయాగానికి రాష్ట్రపతి
మెదక్: అయుత మహా చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.35గంటలకు ఆయన యాగ క్షేత్రం ఎర్రవెల్లికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎర్రవల్లిలో ఉదయం నుంచే ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3గంటలకు అయుత మహా చండీయాగం ముగియనుంది. నేటి రాత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎర్రవల్లిలోనే బసచేయనున్నారు. సోమవారం వేముల వాడ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
తొలిరోజు ముగిసిన చండీ మహాయాగం
ఎర్రవల్లి: మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం తొలిరోజు ముగిసింది. తిరిగి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు రాత్రి 8 గంటల సమయంలో తొలిరోజు పూజలు ముగిశాయి. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు ఈ సందర్భంగా గురుపూజ నిర్వహించారు. నేటి నుంచి ఆదివారం వరకు (ఐదు రోజుల పాటు) ఈ క్రతువు కొనసాగనుంది. అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగిన పూజల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం గురువారం రెండో రోజు జరగనున్న కారక్రమంలో కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పాల్గొంటారు. -
ఆయుత చండీ మహాయాగం ప్రారంభం .
-
ఆయుత చండీ మహాయాగం ప్రారంభం
ఎర్రవల్లి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు ఆదివారం వరకు (ఐదు రోజుల పాటు) సాగనుంది. ఇందుకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కె.చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లుచేశారు. తొలుత కేసీఆర్ దంపతులతో గౌరీ పూజ చేయించిన వేదపండితులు.. అనంతరం వారిని ప్రధాన యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఆ తర్వాత యాగశాలలోనికి తోడ్కొని వెళ్లారు. యాగం ప్రారంభమైన కొద్దిసేపటికే గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కడికి చేరుకున్నారు. సీఎం దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు ఈ సందర్భంగా గురుపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల రాక అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగే పూజల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ పాల్గొంటారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం 24న కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, 25న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగ ర్రావు, 26న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు యాగాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేల మంది భక్తులు తరలివస్తారని అంచనా. వీరందరికీ సరిపడేలా అమ్మవారి పసుపు కుంకుమ, ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణగా వెళ్లి యాగాన్ని వీక్షేంచేలా యాగశాల చుట్టూరా బారికేడ్లతో మార్గాన్ని నిర్మించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ సీఎం స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అయుత చండీ మహాయాగానికి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి తన ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. శృంగేరీ జగద్గురు మహా సంస్థానం పండితుల ఆధ్వర్యంలోనే యాగం నిర్వహించేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈ యాగానికి నరహరి సుబ్రహ్మణ్య భట్టు ప్రధాన ఆచార్యులుగా, తంగిరాల శివకుమార శర్మను వాచకులుగా పంపించారు. మహారుద్ర యాగానికి ఆచార్యులుగా పురాణం మహేశ్వరశర్మ, యాగ పర్యవేక్షకులుగా శివసుబ్రహ్మణ్య అవధాని, గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్‌శర్మ వ్యవహరిస్తున్నారు. యాగంలో 1,100 మంది రుత్వికులు ఏకకంఠంతో పారాయణాలు చదవనున్నారు. మరో 400 మంది రుత్వికులు వారికి సహాయం చేయనున్నారు. -
ఫాంహౌస్‌లో కేసీఆర్
జగదేవ్‌పూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో కాన్వాయ్ ద్వారా ఫాంహౌస్‌కు చేరుకున్న ఆయన.. వస్తూనే చండీయాగం పనులను పరిశీలించారు. పది నిమిషాల పాటు చండీయాగం నిర్వహణ స్థలంలో తిరిగారు. 'యాగం పనులు ఎంత వరకు వచ్చాయ్' అంటూ ఆరా తీశారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అయుత చండీయాగం పనుల వివరాలను సీఎంకు వివరించారు. పనులను వేగంగా చేయాలని నిర్వహకులకు సీఎం సూచించారు. ఆదివారం సాయంత్రం వరకు వ్యవసాయక్షేత్రంలోనే ఉండనున్నట్లు సమాచారం. సీఎం ఫాంహౌస్‌కు వస్తున్నారని సమాచారం ఉండడంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో ఫాంహౌస్ వద్ద పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు శంగేరీ వేద పండితులు శశాంక్‌శర్మ, గోపికష్ణశర్మలు చండీయాగం పనులను పరిశీలించారు.