జగదేవ్‌పూర్ (గజ్వేల్): ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన మహారుద్ర సహస్ర చండీయాగం మూడో రోజు నిర్విఘ్నంగా పూర్తయింది. సహస్ర చండీ మహాయాగం బుధవారం ఉద యం 8 గంటలకు ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంప తులు, ఇతర కుటుంబ సభ్యు లు యాగశాలలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించా రు. మొదట రాజశ్యామల మంటపానికి చేరుకుని అమ్మవారికి తొలి పూజ చేశారు. మహంకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి, పూజ లు చేశారు. బ్రహ్మ స్వరూపిణి మం టపంలో పూజలు చేశారు. అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహ పూజలు నిర్వహించారు. వేదపారాయణ, చతుర్వేద పారాయణ మంటపంలో పూజలు చేశారు. సహస్ర మహాచండీ పారాయణ మంటపంలో చండీమాతకు పూజలు నిర్వహించారు. మహారుద్ర మంటపంలో రుత్వికులు రుద్ర హవనం, రుద్ర పారాయణ నిర్వహించారు.
మూడోరోజు రుత్వికులు 2.1లక్షల సప్తశతి శ్లోకాలు, 2 లక్షల నవగ్రహ జపాలు, 44 ఏక దశల పారాయణంతోపాటు.. 44 హోమాలు తెల్ల నువ్వులతో హోమాలు చేశారు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గదర్శనంలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజిల పర్యవేక్షణలో యాగ, పారాయణలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలను వేద పం డితులు పురాణం మహేశ్వరశర్మ, మంగళంపల్లి వేణుగోపాల శర్మ, నారాయణశర్మ, ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ, గోపాల శర్మ, చంద్రశేఖర్ శర్మలు నిర్వహిస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు సన్మానం
మూడో రోజు యాగానికి హాజరైన ఎం పీలకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు శాలువా లు కప్పి ఘనంగా సన్మానించారు. వేద పండితుల చేతుల మీదుగా మధ్యాహ్నం సమయంలో యాగానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఈ సన్మానం జరిగింది. ప్రజాప్రతినిధులంతా దంపతులతో యాగానికి హాజ రు కావడం విశేషం. వీరంతా చండీమాతను దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రవీందర్ రెడ్డి, సత్యవతిరాథోడ్, జనార్దన్ రెడ్డి, అరవింద్ రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరిశేఖర్‌రావు, భూంరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment