chandiyagam
-
లక్ష చండీ మహాయజ్ఞం దేశానికి గర్వకారణం
సింహాచలం: భారత వైదిక చరిత్రలోనే కనీవినీ ఎరుగని లక్ష చండీ మహాయజ్ఞం కురుక్షేత్ర వేదికగా నిర్వహిస్తుండటం దేశానికి గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం పర్యవేక్షణలో హరియాణ రాష్ట్రం కురుక్షేత్రలోని గుంతీ ఆశ్రమంలో జరుగుతున్న లక్ష చండీ మహా యజ్ఞానికి శనివారం అనురాగ్ ఠాకూర్ సతీసమేతంగా హాజరయ్యారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ శంకరాచార్య సంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీశారదాపీఠం లక్ష చండీ మహాయజ్ఞాన్ని పర్యవేక్షిస్తుండటం, ఆ యజ్ఞంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదన్నారు. కాగా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యజ్ఞభూమిలో శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన విశేషంగా నిర్వహించారు. 2,200 మంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో రుద్రం పఠించడంతో కురుక్షేత్ర ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది. అలాగే యజ్ఞం నిర్వహణలో భాగంగా 6,976 చండీ పారాయణ హోమాలు పండితులు నిర్వహించారు. గుంతీమాత, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
మూడోరోజు.. రాజశ్యామలతో మొదలై
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన మహారుద్ర సహస్ర చండీయాగం మూడో రోజు నిర్విఘ్నంగా పూర్తయింది. సహస్ర చండీ మహాయాగం బుధవారం ఉద యం 8 గంటలకు ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంప తులు, ఇతర కుటుంబ సభ్యు లు యాగశాలలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించా రు. మొదట రాజశ్యామల మంటపానికి చేరుకుని అమ్మవారికి తొలి పూజ చేశారు. మహంకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి, పూజ లు చేశారు. బ్రహ్మ స్వరూపిణి మం టపంలో పూజలు చేశారు. అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహ పూజలు నిర్వహించారు. వేదపారాయణ, చతుర్వేద పారాయణ మంటపంలో పూజలు చేశారు. సహస్ర మహాచండీ పారాయణ మంటపంలో చండీమాతకు పూజలు నిర్వహించారు. మహారుద్ర మంటపంలో రుత్వికులు రుద్ర హవనం, రుద్ర పారాయణ నిర్వహించారు. మూడోరోజు రుత్వికులు 2.1లక్షల సప్తశతి శ్లోకాలు, 2 లక్షల నవగ్రహ జపాలు, 44 ఏక దశల పారాయణంతోపాటు.. 44 హోమాలు తెల్ల నువ్వులతో హోమాలు చేశారు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గదర్శనంలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజిల పర్యవేక్షణలో యాగ, పారాయణలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలను వేద పం డితులు పురాణం మహేశ్వరశర్మ, మంగళంపల్లి వేణుగోపాల శర్మ, నారాయణశర్మ, ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ, గోపాల శర్మ, చంద్రశేఖర్ శర్మలు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సన్మానం మూడో రోజు యాగానికి హాజరైన ఎం పీలకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు శాలువా లు కప్పి ఘనంగా సన్మానించారు. వేద పండితుల చేతుల మీదుగా మధ్యాహ్నం సమయంలో యాగానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఈ సన్మానం జరిగింది. ప్రజాప్రతినిధులంతా దంపతులతో యాగానికి హాజ రు కావడం విశేషం. వీరంతా చండీమాతను దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రవీందర్ రెడ్డి, సత్యవతిరాథోడ్, జనార్దన్ రెడ్డి, అరవింద్ రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరిశేఖర్‌రావు, భూంరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ మహారుద సహస్ర చండీయాగం
-
చండీయాగం ఫలితమే భారీ వర్షాలు
ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఎర్దండి(ఇబ్రహీంపట్నం) : సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగం ఫలితంగానే భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కొమటికొండాపూర్‌లలో గోదావరి ఉధృతిని పరిశీలించారు. అనంతరం వర్షకొండ, ఇబ్రహీంపట్నం వద్ద రోడ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 42 గేట్ల ద్వారా నీటిని వదలడంతో గోదావరి పరీవాహక ప్రాంతాలు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. గోదావరి సమీపంలోని ప్రజలను పాఠశాలలు, పంచాయతీల వద్దకు తరలిస్తున్నామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సురేశ్, వైస్ ఎంపీపీ గూడ పాపన్న, ఎఎమ్‌సి వైస్ చైర్మన్ రాజు, సీఐ సురేందర్, ఎస్సై మాడవి ప్రసాద్, సర్పంచ్‌లు రాజవ్వ, జలేశ్, రాజాగౌడ్, వెంకట్, నర్సయ్య, సింగిల్‌విండో చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు సత్యనారాయణ, దేవదాస్, దశరథ్‌రెడ్డి, రాజన్న, గంగారెడ్డి, సుగుణకర్‌రావు, మురళి ఉన్నారు. వీఆర్వో, కార్యదర్శిపై ఆగ్రహం గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వీఆర్వో, కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఆర్వో లచ్చయ్య, కార్యదర్శి ఆసీప్ ఆలీ బేగ్‌ను ఫోన్ చేసి మందలించారు. -
‘జనగామ’ కోసం నేడు చండీయాగం
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నేడు జ్వాలా సుదర్శన నారసింహ సహిత చండీయాగం నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రెయిన్‌మార్కెట్ ఆవరణలోని కవర్ షెడ్ ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు చండీయాగం ప్రారంభం అవుతుందని తెలి పారు. మొదట గణపతి పూజ, స్వస్తి పుణ్యా హ వచనం, రుత్వికరణము, ఆ తర్వాత విజయగణపతి, చండీ హోమాలు, రుద్రహోమం, మన్యసూక్త హోమం, సుదర్శన నారసింహ, పంచసూక్త హోమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతితో ముగింపు పలుకుతారన్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నాయకులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, డాక్టర్లు లకీనారాయణ నాయక్, రాజమౌళి, ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీనివాస్, మాశెట్టి వెంకన్న, జక్కుల వేణుమాధవ్, మంగళ్లపల్లి రాజు, రెడ్డి రత్నాకర్, ఆలేటి సిద్ధిరాములు పాల్గొన్నారు. -
విశ్వశాంతి కోసం చండీయాగం
పుట్టపర్తి టౌన్ : విశ్వశాంతిని కాంక్షిస్తూ ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ఈసందర్భంగా హోమగుండం వద్ద వేదమంత్రాలు పఠిస్తూ యజ్ఞ కతువులను, విశేషపూజలను ఘనంగా నిర్వహించారు. గణపతిపూజ, కుంకుమార్చన,లలితా సహస్రనామం, కలశ పూజ నిర్వహించి పూర్ణాహుతితో చండీయాగాన్ని ముగించారు. బ్రాహ్మణ సేవాసంఘం జిల్లా కార్యదర్శి యోగానందశర్మ, నియోజకవర్గ అధ్యక్షుడు కరణం చంద్రశేఖర్‌రావు, ఉపాధ్యక్షుడు ఓడీసీ సుబ్బరావు, కార్యదర్శి సుబ్బక్రిష్ణ, నాగరాజరావు, సుబ్రహ్మణ్యం శర్మ తదితరులు పాల్గొన్నారు. -
విదేశీయుల చండీయాగం
పుట్టపర్తి టౌన్ : లోక కళ్యానార్థం విదేశీయులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మేరకు చండీయాగం నిర్వహించారు. బుధవారం నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లి మార్కెట్ వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో వేద మంత్రోచ్చారణ నడుమ చండీయాగం నిర్వహించారు. అమావాస్య ముందురోజు చతుర్దసి రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. ఇదే రోజు చండీయాగం చేస్తే అమ్మవారు కరుణించి లోకకళ్యాణం ప్రాప్తిస్తుందన్న విశ్వాçÜంతో వారు యాగం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి మార్గంలో మానవాళి నడవాలని, ఆయన బోధించిన మేరకు లోకాసమస్త సుఖినోభవంతు అన్న సందేశాన్ని నమ్ముతూ లోకకళ్యాణం కోసం చండీయాగం చేపట్టినట్లు తెలిపారు. -
'ఇద్దరు సీఎంలపై సీబీఐ విచారణ జరిపించాలి'
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని ఏఐసీసీనేత, మాజీ ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఏకమై ప్రజాదుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఇద్దరు సీఎంలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేపట్టిన ఆయుత చండీయాగానికి నిధులెక్కడివి? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆయుత చండీయాగానికి సంబంధించిన నిధుల వివరాలు చెప్పాలన్నారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలలతో కలిసి క్విడ్ ప్రొకో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలే ఆయుత చండీయాగానికి నిధులిస్తున్నారని ఆరోపించారు. బీసీ క్రిమిలేయర్ అమలు సరికాదని, వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని మధుయాష్కి కోరారు. -
రేపు విజయవాడకు కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం విజయవాడలో కలవనున్నారు. ఉదయం 11:30 గంటలకు బేగంపేట నుంచి విజయవాడ బయలుదేరుతారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. అయుత చండీ యాగానికి చంద్రబాబును, మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ నెల 16న శృంగేరి మఠానికి కేసీఆర్ వెళ్లనున్నారు. శృంగేరి మఠాధిపతిని చండీ యాగానికి ఆహ్వనించనున్నారు. -
ఫాంహౌస్‌లోనే చండీయాగం
జగదేవ్‌పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేపట్టనున్న మహ చండీయాగం నిర్వహణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో వచ్చే నెల 23 నుంచి 27 వరకు చండీయాగం నిర్వహించనున్నారు. యాగం కోసం పలు ప్రాంతాలు పర్యవేక్షించిన చివరకు కేసీఆర్ ఫాంహౌస్నే ఫైనల్ చేశారు. యాగస్థలి కోసం వ్యవసాయ క్షేత్రంలోని భూమిని చదును చేస్తున్నారు. ఇందులో కొంత భాగం అల్లం పంట ఉండటంతో, వాటిని తీసే పనులను వేగవంతం చేశారు. ఇక డాగ్ స్క్వాడ్లతో ప్రత్యేక బలగాలు ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నాయి. చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కేసీఆర్ ఆహ్వానించారు. 3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహిస్తున్నారు. సుమారు 10 వేల మంది ఈ మహా చండీయాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 26 లేదా 27 తేదీలలో కేసీఆర్ స్వయంగా చండీయాగం పనులు పరిశీలించనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆయూత మహా చండీయాగం నిర్వహిస్తామని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన చండీయాగం చేశారు. 2006లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సహస్ర చండీయాగం చేశారు.