విశ్వశాంతి కోసం చండీయాగం | chandi yagam for piece | Sakshi
Sakshi News home page

విశ్వశాంతి కోసం చండీయాగం

Published Sun, Sep 11 2016 11:24 PM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM

విశ్వశాంతి కోసం చండీయాగం - Sakshi

విశ్వశాంతి కోసం చండీయాగం

పుట్టపర్తి టౌన్‌ : విశ్వశాంతిని కాంక్షిస్తూ ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ఈసందర్భంగా హోమగుండం వద్ద వేదమంత్రాలు పఠిస్తూ యజ్ఞ కతువులను, విశేషపూజలను ఘనంగా నిర్వహించారు. గణపతిపూజ, కుంకుమార్చన,లలితా సహస్రనామం, కలశ పూజ నిర్వహించి పూర్ణాహుతితో చండీయాగాన్ని ముగించారు.

బ్రాహ్మణ సేవాసంఘం జిల్లా కార్యదర్శి యోగానందశర్మ, నియోజకవర్గ అధ్యక్షుడు కరణం చంద్రశేఖర్‌రావు, ఉపాధ్యక్షుడు ఓడీసీ సుబ్బరావు, కార్యదర్శి సుబ్బక్రిష్ణ, నాగరాజరావు, సుబ్రహ్మణ్యం శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement