లోక కళ్యానార్థం విదేశీయులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మేరకు చండీయాగం నిర్వహించారు.
పుట్టపర్తి టౌన్ : లోక కళ్యానార్థం విదేశీయులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మేరకు చండీయాగం నిర్వహించారు. బుధవారం నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లి మార్కెట్ వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో వేద మంత్రోచ్చారణ నడుమ చండీయాగం నిర్వహించారు. అమావాస్య ముందురోజు చతుర్దసి రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు.
ఇదే రోజు చండీయాగం చేస్తే అమ్మవారు కరుణించి లోకకళ్యాణం ప్రాప్తిస్తుందన్న విశ్వాçÜంతో వారు యాగం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి మార్గంలో మానవాళి నడవాలని, ఆయన బోధించిన మేరకు లోకాసమస్త సుఖినోభవంతు అన్న సందేశాన్ని నమ్ముతూ లోకకళ్యాణం కోసం చండీయాగం చేపట్టినట్లు తెలిపారు.