కొమటికొండాపూర్ వద్ద గోదావరిని పరిశీలిస్తున్న ఎమ్మేల్యే
-
ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
ఎర్దండి(ఇబ్రహీంపట్నం) : సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగం ఫలితంగానే భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కొమటికొండాపూర్‌లలో గోదావరి ఉధృతిని పరిశీలించారు. అనంతరం వర్షకొండ, ఇబ్రహీంపట్నం వద్ద రోడ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 42 గేట్ల ద్వారా నీటిని వదలడంతో గోదావరి పరీవాహక ప్రాంతాలు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. గోదావరి సమీపంలోని ప్రజలను పాఠశాలలు, పంచాయతీల వద్దకు తరలిస్తున్నామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సురేశ్, వైస్ ఎంపీపీ గూడ పాపన్న, ఎఎమ్‌సి వైస్ చైర్మన్ రాజు, సీఐ సురేందర్, ఎస్సై మాడవి ప్రసాద్, సర్పంచ్‌లు రాజవ్వ, జలేశ్, రాజాగౌడ్, వెంకట్, నర్సయ్య, సింగిల్‌విండో చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు సత్యనారాయణ, దేవదాస్, దశరథ్‌రెడ్డి, రాజన్న, గంగారెడ్డి, సుగుణకర్‌రావు, మురళి ఉన్నారు.
వీఆర్వో, కార్యదర్శిపై ఆగ్రహం
గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వీఆర్వో, కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఆర్వో లచ్చయ్య, కార్యదర్శి ఆసీప్ ఆలీ బేగ్‌ను ఫోన్ చేసి మందలించారు.