yagam
-
అశ్వతీర్థం: సత్యవతి ఎలా పుట్టింది? ఎవర్ని పెళ్లాడింది?
భరత వంశంలో జన్మించిన కుశికుడు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలిగినవాడు. అతడి కొడుకు గాధి. కన్యాకుబ్జం రాజధానిగా పరిపాలన సాగించిన గాధి మహా రాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. ఆ దిగులుతో సంతానం కోసం తపస్సు చేయాలని అడవులకు వెళ్ళి, సోమయాగం చేశాడు. ఆ యాగఫలంగా సత్యవతి అనే కూతురు కలిగింది. ఆ రోజులలో భృగువంశ సంజాతుడైన చ్యవనుడికి ఋచీకుడనే కొడుకు ఉండేవాడు. ఋచీకుడు విఖ్యాతుడైన తపస్వి. గాధి కుమార్తెయైన సత్యవతిని వివాహమాడాలనే కోరికతో ఒక రోజు వెళ్ళి గాధిని అడిగాడు. ఋచీకుడిని ధన హీనుడిగా తలచిన గాధి, కన్యాశుల్కం ఇస్తేనే గాని తన కూతురిని వివాహమాడడానికి ఇవ్వనన్నాడు. శుల్కంగా ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు ఋచీకుడు. ఒక చెవిశ్యామ వర్ణంతోను, మిగతా శరీరమంతా శ్వేతవర్ణంతో చంద్రుడిలా మెరిసే వెయ్యి వేగవంతమైన గుర్రాలనుశుల్కంగా కోరాడు గాధి. అలా కోరడంలో, అది మానవ సాధ్యమయ్యే పని కాదు గనుక, ఋచీకుడు నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్ళి పోతాడని గాధి తలచాడు. కాని ఋచీకుడి తపశ్శక్తికి అది అసాధ్యం కాదని గాధి ఊహించలేదు.చదవండి: హీరోయిన్ల బాటలో 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం అష్ట దిక్పాలకులలో ఒకడైన వరుణ దేవుడిని మనస్సులో తలుచుకున్నాడు ఋచీకుడు. ఋచీకుడికి ఏది కావాలంటే అది, ఎక్కడ కావాలంటే అక్కడ లభ్యమయ్యే వరమిచ్చాడు వరుణుడు. కన్యాకుబ్జం దగ్గర గంగానది ఒడ్డున కూర్చుని తనకు కావలసింది కోరుకున్నాడు ఋచీకుడు. అలా కోరిన వెంటనే గంగానది నీళ్ళ నుండి గాధి కోరుకున్న రూపంలో కాంతులీనుతూ వేయి గుర్రాలు ఉత్పన్నమయ్యాయి. ఆ వేయి గుర్రాలను శుల్కంగా గాధికి ఇచ్చి, సత్యవతిని పరిణయమాడాడు ఋచీకుడు. పూర్వం మహాతపస్సంపన్నులైన ఋషులకు సాధ్యం కానిదేదీ ఉండేది కాదని ఈ ఐతిహ్యం చెబుతుంది. ఈ కథ కారణంగానే నేటికీ కన్యాకుబ్జం నగరం దగ్గరి గంగానది అశ్వతీర్థంగా పిలవబడుతూ ఉందని వ్యాసుడి మహా భారతం, అనుశాసనిక పర్వం, నాలుగవ అధ్యాయంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నారాయణ హోమం
-
ముగిసిన రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారం ముగిసింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకారంతో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. మహాపూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ పాదపూజ చేసి పుష్పాభిషేకంతో గురువందనం సమర్పించారు. -
శివకామ సుందరీదేవిగా అమ్మవారు
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలో సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగింది. యాగంలో భాగంగా గురువారం రాజశ్యామల యంత్రపూజ కార్యక్రమాన్ని రుత్వికులు ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌రావు, ఎమ్మెల్సీ కవిత యాగ క్రతువును పర్యవేక్షించారు. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ యాగంలో మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేశారు. అలాగే 11సార్లు శాలిని దుర్గ కవచ పారాయణం నిర్వహించారు. సర్వలోక సంరక్షణార్థం ఇంద్రసుక్త హోమం, నవగ్రహ సుక్త హోమం నిర్వహించారు. షాడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం నిర్వహించారు. -
సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో బుధవారం రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉదయం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్వంలో యాగానికి అంకురార్పణ చేయగా.. సీఎం కేసీఆర్ దంపతులు యాగ సంకల్పం చెప్పి పండితులకు దీక్షా వ్రస్తాలను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్రస్వామి మాట్లాడుతూ.. రుద్ర, చండీ, నవదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని రాజశ్యామల యాగం విశిష్టమైనదని తెలిపారు. రాజులతోపాటు సామాన్యులను అనుగ్రహించే మహాశక్తివంతమైన రాజశ్యామల యాగం కఠినమైన బీజాక్షరాలతో కూడినదని.. సీఎం కేసీఆర్ కుటుంబానికే కాకుండా యావత్ రాష్ట్రానికి ఇది ఆశీర్వాదం వంటిదని వివరించారు. శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసి.. తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటూ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ యాగానికి రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా నామకరణం చేసినట్టు రుత్విక్కులు తెలిపారు. ఫామ్‌హౌస్‌లో శాస్త్రోక్తం గా ప్రారంభమైన యాగం రెండు రోజుల పాటు జరగనుంది. తొలి రోజున ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతిపూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రసనతో అంకురార్పణ చేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ దంపతులు సాష్టాంగ నమస్కారం చేసి.. గురు ఆజ్ఞ తీసుకొని యాగాన్ని ప్రారంభించారు. రుత్విక్కులు కేసీఆర్ దంపతులతో యాగ సంకల్పం చెప్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నవదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రా ర్థిస్తూ అస్త్రరాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. అఖండ స్థాపన అనంతరం యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. -
ఘనంగా ప్రారంభమైన విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు
-
విజయవాడలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి యజ్ఞం
-
4వ రోజు అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి మహా యజ్ఞం
-
రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలనే ఈ యాగం: మంత్రి కొట్టు
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మీ యాగం
-
శ్రీ స్వర్ణాకర్షణ భైరవ సహిత లక్ష్మీకుభేర మహాయాగం
-
బీఆర్ఎస్ కార్యాలయంలో యాగాలు-పూజలు
సాక్షి, ఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశ రాజధాని ఢిల్లీలో తొలి అడుగు పెట్టేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో యాగాలు మంగళ, బుధవారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగే రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొంటారు. మంత్రి వేముల, ఎంపీ సంతోష్ కుమార్.. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి మూడురోజులుగా.. యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరీ పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల సంస్కారం,యాగశాల ప్రవేశం, చండి పరాయణములు, మూల మంత్ర జపములు తదితన కార్యక్రమాలు జరుగనున్నాయి. -
రిషి సునాక్ గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరువవుతోంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరు ప్రధానికి అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. రిషి సునాక్ ప్రధాని పదవిని అధిష్టించాలని యూకేలోని ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. రిషి సునాక్ వెనకబడ్డారని సర్వేలు వెల్లడించడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రిషి సునాక్ సమర్థుడు కాబట్టే బ్రిటన్‌కు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నామని ప్రవాస భారతీయులు అంటున్నారు. ‘భారతీయ మూలాలు కలిగివున్నారు కాబట్టే మేము ఆయన కోసం ప్రార్థించడం లేదు. జీవన వ్యయ సంక్షోభం నుంచి మమ్మల్ని బయటపడేసే సమర్థత ఆయనకు ఉందని నమ్ముతున్నాం కాబట్టే రిషి విజయం సాధించాలని కోరుకుంటున్నామ’ని బ్రిటిష్ ఇండియన్ సీకే నాయుడు తెలిపారు. ప్రధాని పదవికి ప్రస్తుతం రిషి సునాక్ ఉత్తమ అభ్యర్థి అని ప్రవాస భారతీయురాలు షీలమ్మ పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలతో పాటు ప్రతి విషయంలోనూ రిషి ఎంతో హుందాగా వ్యవహరించారని, ఆయన గెలవాలని తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనేది సెప్టెంబర్ 5న తేలుతుంది. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూకే మొత్తం జనాభాలో 2.5 శాతంగా ఉన్న ప్రవాసులు జీడీపీలో దాదాపు 6 శాతం వాటా కలిగివున్నారు. గ్రాంట్ థోర్న్టన్ వార్షిక ట్రాకర్ 2022 ప్రకారం గత సంవత్సరంతో పోల్చితే భారతీయ కంపెనీల సంఖ్య 805 నుంచి 900కి పెరిగింది. వీటి ద్వారా వచ్చే రాబడి 50.8 బిలియన్ల ఫౌండ్ల నుంచి 54.4 బిలియన్ ఫౌండ్లకు చేరుకుంది. ఇండియన్ డయాస్పోరా విజయాల్లో రిషి సునాక్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే తమకు మరింత మేలు జరుగుతుందని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్: రిషి సునాక్‌కు అనూహ్య మద్దతు.. అవాక్కయిన యాంకర్) -
Statue Of Equality: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో సమతా మూర్తి సమారోహం వేడుకలకు 7500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎనిమిది విభాగాలుగా పోలీసులకు బాధ్యతలు కేటాయించారు. రెండు సెక్టార్లుగా ట్రాఫిక్ క్లియరెన్స్‌కు 1200 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సమతామూర్తి ప్రాంగణంలో.. సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో నలుగురు ఏసీపీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో పన్నెండు మంది సీఐలు, 58 ఎస్సైలు, 218 మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు 134, ఇతర 20 మంది ఉంటారు. యాగశాల వద్ద.. యాగశాల వద్ద 1682 మంది పోలీసులతో బందోబస్తుకు కేటాయించారు. ఇందులో డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు, 155 మంది ఎస్సైలు, 1214 మంది కానిస్టేబుళ్లు, 240 అదనపు పోలీసులను కేటాయించారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) ప్రవచన మండపం వద్ద.. ప్రవచన మండపం వద్ద 157 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో ఓ డీసీపీ అధికారితో పాటు ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 28 మంది ఎస్సైలు, 88 కానిస్టేబుళ్లు, 36 మంది ప్రత్యేక పోలీసులు ఉంటారు. భోజన శాల వద్ద.. భోజన శాల వద్ద ఓ డీసీపీ స్థాయి అధికారితోపాటు నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 8మంది ఇన్స్పెక్టర్లు, 24 మంది ఎస్సైలు, 124 మంది కానిస్టేబుళ్లు, 120 ప్రత్యేక పోలీసులను కేటాయించారు. రూట్ల వారిగా.. ఆశ్రయానికి వచ్చిపోయే రహదారులను 17 రూట్లుగా విభజించారు. ఆయా రూట్లలో 1200 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ట్రాఫిక్ పర్యవేక్షణ ఇలా.. వీవీఐపీలు, వీఐపీలు, కీలక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్రమోదీ తదితరులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సెక్టార్ల వారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సహస్రాబ్ది ఉత్సవాలకు మాధవ సేవకులు రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో సేవలందించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో సేవకులు తరలివచ్చారు. శ్రీరామనగరంలో బుధవారం నుంచి ఈ నెల 14 వరకు జరుగనున్న ఉత్సవాల్లో సేవలు అందించేందుకు సుమారు 8 వేల మంది సేవకులు తరలివచ్చారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో సేవకులకు బాధ్యతలు అప్పగించారు. యాగశాల, భోజనశాల, రవాణా, పూజా, వైద్య, తదితర 18 రకాల సేవా విభాగాల్లో వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. రుత్వికుల సందడి.. ఇక్కడ యాగ శాలలో నిర్వహించే హోమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు ఇక్కడికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత హోమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (చదవండి: అసమానత వైరస్.. సమతే వ్యాక్సిన్) -
కరోనా నియంత్రణకు భూమన యాగం
-
సర్వ మానవాళి కోసమే ‘విష జ్వర పీడ హర యాగం’
సాక్షి, విశాఖపట్నం: సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. కరోనా నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం శనివారంతో విజయవంతంగా ముగిసింది. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ప్రపంచానికి గురుస్థానంలో భారతదేశం ఉందని.. మానవులంతా ఆరోగ్యంతో ఉండాలని ఈ యాగం చేశామని తెలిపారు. వేదాల్లో అనేక అంశాలను పరిశీలించి యాగం తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ధన్వంతరి జపం, అపమృత్యు దోష నివారణతో కూడిన మంత్రాలతో యజ్ఞం చేసామని వివరించారు. (కరోనా పాజిటివ్: ఆ జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్) ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ల ఆదేశాలను ప్రజలందరూ పాటించాలని స్వరూపానందేంద్ర సరస్వతి విజ్ఞప్తి చేశారు. శారదాపీఠం భక్తులంతా అన్నార్థులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులను దేశ సైనికులుగా భావించి గౌరవించాలని పేర్కొన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ, దేవాదాయ శాఖ అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. -
తిరుమలలో ధన్వంతరి యాగం
-
లోక సంక్షేమం కోసం టీటీడీ యాగం
-
మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు. తూత్తుకూడి జిల్లా వల్లనాడులో నారాయణన్ అనే వ్యక్తి గోశాలను నిర్వహిస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ ఈ గోశాలలో ఇటీవల రహస్యంగా ప్రత్యేక యాగం నిర్వహించారు. గోశాలలోని 21 గేదెలకు 15 మంది వేదపండితులు నాలుగుగంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఒక గేదె కాలికి బంగారు గొలుసు అలంకరించి ప్రత్యేక యాగం నిర్వహించారు. గోప్యంగా జరిగిన ఈ యాగానికి మోదీ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి మాత్రమే ఫొటోలు తీయగా, మిగిలిన ఎవ్వరూ సెల్‌ఫోన్ తీసుకురాకుండా కట్టుదిట్టం చేశారని సమాచారం. -
వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ యాగం
-
చండీ యాగం ఎందుకు చేస్తారు?
యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం! ఎవరీ చండి? చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది. మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు. పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు. కొందరు సంపన్నులు ఇండ్లలో కూడా చండీయాగం చేయిస్తుంటారు. -
మహోత్కృష్ట యాగం... అతిరాత్రం
ప్రకృతిపై వికృతి ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటుంది (ఉదా– సార్స్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఎ బోలా, మ్యాడ్ కౌ వంటివి.) మానవశరీరంపై ప్రతి నిమిషం దాదాపు 50,000 సూక్ష్మక్రిములు (బాక్టీరియా) దాడిచేస్తూనే ఉంటాయి. మన రోగనిరోధక శక్తి వాటిని నిరోధిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకు తగ్గినపుడు రోగగ్రస్థులమవుతాం. దేహం – దేశం రెండూ ఒక్కటే. భూమిపై ఏ జీవీ ప్రయత్నించని విధంగా మానవుడు వివిధ ఆయుధాలతో, అణుశక్తి విస్ఫోటనశక్తితో ప్రపంచంలో జీవకణశక్తిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటువంటి వినాశకారక ఆలోచనలు మార్చేందుకు చంద్ర సంబంధమైన సోమలతతో అత్యంత కఠోర నియమావళితో చేసే మా–నవ ప్రయత్నమే సోమయాగం. ఏ యజ్ఞమైనా ప్రకృతిని కాపాడడానికే. కలియుగంలో చేయదగిన సప్త సోమయాగాలలో అప్తోర్యామం ఏడవది. అగ్నిహోత్రంతో సశాస్త్రీయ సనాతన భారతీయ వేద విజ్ఞాన విధానం ద్వారా ప్రకృతిలో జీవశక్తిని పెంచడానికి సోమలతనుండి తీసే సోమరసాన్ని ప్రకృతికి (దేవతలకు) సమర్పించటమే సోమయాగం. చంద్రుడు మనఃకారకుడు. చంద్రకాంతి ప్రకృతిని, జీవుల మనస్సును ప్రభావితం చేస్తుంది. చంద్రకళలతో సమానంగా పెరుగుతూ, సమానంగా తరిగే ఏకైక ఓషధీ రాజం సోమలత. అమితంగా చంద్రశక్తిని గ్రహించే ఏకైక లత సోమలత. సోమయజ్ఞాలలో సోమవల్లీరసం ప్రధానం. ప్రకృతిలో జీవశక్తిని పెంచడానికి సోమలతనుండి తీసే సోమరసాన్ని అగ్ని ద్వారా దేవతలకు సమర్పించు మంత్రవిభాగాలు ప్రధానంగా 33 స్తుతి – శస్త్రాలు. స్తుతి సామవేద మంత్రాలు, శస్త్రాలు ఋగ్వేద మంత్రాలు. సప్త సోమయాగాల పేర్లు ఈస్తుతి – శస్త్రాల సంఖ్యను అనుసరించి నిర్ణయించబడుతుంది. వేదానాం సామవేదోస్మి అని జగద్గురువులైన శ్రీ కృష్ణులు చెప్పారు. సామం లేకపోతే యాగం లేదు. సోమయాగంలో సామవేదమే ప్రధానం. ఈ విషయం అర్థం కావాలంటే యాగం చూడడం, అది ఏమిటి అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సోమయాగాలు ఏడు – 1) అగ్నిష్టోమం 2) అత్యగ్నిష్టోమం 3) ఉక్థ్యం 4) షోడశీ 5) వాజపేయం – 6) అతిరాత్రం 7) అప్తోర్యామం. ఫలం ఏమిటి? సోమ యాగం వల్ల ప్రకృతికి ఏది అవసరమో అవి తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. ఆవునేతితో హోమంచేస్తే ప్రాణ వాయువు (ఆక్సిజన్) పెరుగుతుంది. సోమరసంతో హోమం చేస్తే ప్రకృతిలోని సమస్త మూలకణములు శుద్ధి అయి, జీవశక్తి పెరుగుతుంది. సోమయాగం జరిగినచోటే గాక హోమధూమం వెళ్ళినచోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భజలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి. జీవజాతులలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హానికర సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఉండవు. ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయి. పాలలో పోషకవిలువలు పెరుగుతాయి. సస్యవృద్ధి (పంటలు) కలుగుతుంది. ఆ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు తగ్గి సహజమైన కాన్పులు కలుగుతాయి. మాతా శిశు మరణాలు, ప్రమాదాలు తగ్గుతాయి. మానవుడికి చెడు ఆలోచనలు రావు. అప్తోర్యామం సోమయాగం వల్ల మానవుల కనీస అవసరాలు తీరుతాయని శ్రుతి (వేదం) చెప్తున్నది. ఇది శాస్త్రీయ పరిశోధనద్వారా నిరూపితమైంది.యాగం అనంతరం పిల్లలు లేని దంపతుల కోసం పుత్రకామేష్టి, జీవితంలోని అన్ని విపత్తులూ తొలగిపోయి, సకల శుభాలూ జరగడం కోసం చేసుకునే శ్రీ ప్రత్యంగిరా హోమం జరుగుతాయని, ఆసక్తి గల వారు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చునని యాగ పరిరక్షకులు కేసాప్రగడ ఫణి రాజశేఖర శర్మ తెలియజేస్తున్నారు. నిర్వహణ ఎవరు? జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ తీర్ధమహాస్వామి, వెదురుపాక గాడ్, శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివార్ల దివ్య ఆశీస్సులతో త్రిలింగ తెలుగు ప్రాంతాలైన భద్రాచలంలో 2012లో అతిరాత్రం, 2013లో మురమళ్లలో అతిరుద్రం, 2015లో గార్గేయపురం (కర్నూలు)లో అప్తోర్యామం, 2017లో యాదగిరిగుట్టలో అయుత శ్రీమహావిష్ణు మహాయాగాలు‘ ఇత్యాది ఏకవింశతి (21) మహాయాగకర్తలు బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ – రాధాకృష్ణకుమారి దంపతుల కర్తృత్వాన, హైదరాబాద్ కె.హెచ్.ఎస్. సేవా ట్రస్ట్, ఇతర అనుబంధ సంస్థల నిర్వహణలో అశేష భక్త జనావళి పాల్గొననున్నారు. ఎప్పుడు? ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పంచారామాలలో ఒకటైన కుమారారామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో గల పాండవుల గుట్టలో ఈ ఏప్రిల్ 14 నుంచి 25 వ తేదీ వరకు మహాగ్నిచయన పూర్వక మహోత్కృష్ట సోమయాగం అతిరాత్రం జరగనుంది. బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహర నాథ శర్మ నేతృత్వ పర్యవేక్షణలో త్రేతాగ్ని హోత్రి బ్రహ్మశ్రీ కిరణ్ అవధాని దంపతులు యజమానులు కాగా, భార్గవ రామ అవధాని బ్రహ్మగానూ, సాకేత రామ అవధాని హోతగానూ, శ్రీధర శర్మ ఉద్గాతగానూ ఈ యాగం అత్యంత శాస్త్రోక్తంగా, మహా వైభవంగా జరగనుంది. -
కోలీవుడ్ అంటేనే ఇష్టం
తమిళసినిమా: తనకు తమిళ చిత్రపరిశ్రమ అంటేనే చాలా ఇష్టం అని ప్రముఖ నటి జయప్రద పేర్కొన్నారు. నినైత్తాలే ఇనిక్కుమ్ చిత్రంలో ఇటు కమలహాసన్, అటు రజనీకాంత్‌తో కలిసి నటించి మెప్పించిన నటి జయప్రదను కోలీవుడ్ ఎప్పటికీ మరచిపోదు. అయితే ఒక్క తమిళంలోనే కాకుండా, దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి అగ్రనటిగా రాణించిన జయప్రద ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి నటనకు దూరం అయ్యారు. ఆ తరువాత అడపాదడపా తెలుగు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కనిపించినా, కోలీవుడ్‌కు మాత్రం చాలా కాలం తరువాత యాగం అనే చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. ఐదేళ్ల తరువాత మళ్లీ కోలీవుడ్‌కు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద మాట్లాడుతూ ఐదేళ్ల తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ అవడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి కథా చిత్రం అయితే బాగుంటుందనిపించిదన్నారు. అలాంటి సమయంలో యాగం చిత్ర దర్శకుడు నరసింహ తనను కలిసి ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరారన్నారు. తను రెండేళ్లకు పైగా ఎంతో హోమ్ వర్క్ చేసి ఈ కథను తయారు చేశారని తెలిపారు. తాను పలు భాషల్లో నటించినా తమిళ చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. తమిళంలో యాగం పేరుతోనూ, తెలుగులో శరభ పేరుతోనూ రూపొందుతోందని చెప్పారు. ఇది మానవ శక్తి, దైవశక్తి, దుష్టశక్తి మధ్య జరిగే కథా చిత్రం అని వెల్లడించారు. ఇందులో కొడుకును కాపాడుకోవడానికి తపన పడే తల్లిగా తాను నటించానని, ఇది అభియనయానికి చాలా అవకాశం ఉన్న పాత్ర అని తెలిపారు. ఇక మంచి చిత్రంలో తానూ ఇక భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని నటి జయప్రద పేర్కొన్నారు. ఏఎస్కే ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎన్.నరసిమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు శంకర్ వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జయప్రద, నెపోలియన్, నాజర్, పోన్వన్నన్, ఎంఎస్.భాస్కర్, తనికెళ్లభరణి ముఖ్య పాత్రలను పోషించారు. కోటి సంగీతాన్ని అందించారు. చిత్రాన్ని అక్టోబర్ ప్రథమార్థంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. -
శ్రీకాకుళంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
ఆలయంలో అర్ధరాత్రి యాగం
► ఆగమశాస్త్ర విరుద్ధంగా నిర్వహణ ►అమ్మ క్షేమం కోసం యాగం చేసినట్టు సమాచారం ►దేశానికే అరిష్టం : దీక్షితులు టీనగర్: ఆగమశాస్త్ర నిబంధనలు ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా చెన్నై, పార్థసారధి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి యాగం నిర్వహించడంతో సంచలనం ఏర్పడింది. ఇది దేశానికే అరిష్టమని దీక్షితులు వ్యాఖ్యానించడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ట్రిప్లికేన్‌లోని పార్థసారధి ఆలయం 108 వైష్ణవ క్షేత్రాల్లో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం హిందూ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే గాకుండా ఇతర రాష్ట్రాలకు చెంది న భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో ఉదయం 6 గంటలకు సన్నిథిని తెరిచి రాత్రి 10.30 గంటలకు మూసివేస్తారు. ఈ సమయంలోనే ఆలయంలో ఐదు కాలపూజలు జరుపుతుంటారు. ఇదే సమయంలో మిగతా యాగపూజలు, అది కూడా మంచి సమయం చూసి జరపాలన్నది ఆగమ శాస్త్ర విధిగా ఉంది. అరుుతే ఆలయం మూసివేసిన తర్వాత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయ సన్నిథిని తెరిచారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్ష్మి, అడిషనల్ కమిషనర్ కవిత, ఓ జ్యోతిష్యుడు, కొందరు వేద పండితులు ఆలయ సన్నిథి చిన్న ద్వారం తెరచి యాగశాల పూజలు నిర్వహించారు. ఆలయంలో పనిచేసే దీక్షితులు వ్యతిరేకత తెలుపుతారనే కారణంగా బయటి నుంచి తీసుకువచ్చిన వేదపండితుల ద్వారా యాగశాల పూజ జరిగింది. ముఖ్యమంత్రి క్షేమాన్ని కోరుతూ ఈ యాగం నిర్వహించినట్లు తెలిసింది. ఇందుకోసం అనేక మంది వీఐపీలు కార్లలో ఈ ఆలయానికి చేరుకున్నారు. అర్థరాత్రి మూడు గంటల వరకు యాగపూజ కొనసాగింది. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూజలు నిర్వహించడం ఉన్నత పదవుల్లో వున్న వారికి ప్రమాదం కలిగించడమే గాకుండా దేశానికే అరిష్టం కలుగుతుందని దీక్షితులు వ్యాఖ్యానించారు. ఆగమ నిబంధనలు మీరితే అందరికీ ఇబ్బందులు కలుగుతాయన్నారు. శ్రీరంగం ఆలయంలో సమయాన్ని పాటించకుండా కుంభాభిషేకం నిర్వహించడంతో ప్రస్తుతం పాలకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఆగమ శాస్త్ర నిబంధనలు మీరితే ఏమి జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అరుున ప్పటికీ అర్థరాత్రి ఆలయ ప్రవేశం చట్ట విరుద్ధమని, అటువంటి స్థితిలో ఆలయాన్ని తెరచి పూజలు నిర్వహించడం సరికాదన్నారు. -
ధర్మజుని గర్వభంగం
పురానీతి ధర్మరాజు అశ్వమేథ యాగం చేశాడు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు, వస్తుదానాలు చేశాడు. యాగం చేసిన రుత్విక్కులకు, బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చాడు. ధర్మరాజు దానగుణానికి అందరూ అనేక విధాలుగా ప్రశంసిస్తున్నారు. అది చూసి ధర్మజునిలో కొద్దిగా అహంకారం పొడసూపింది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక ముంగిస వచ్చింది. దాని శరీరం మూడువంతుల వరకు బంగారు రంగులో మెరుస్తోంది. అది సభాసదులను, ధర్మరాజును చూసి పకనకా నవ్వింది. అందరూ ఆశ్చర్యంగా, కోపంగా ‘‘ఎవరు నువ్వు? ఎలా వచ్చావిక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు?’’ అని అడిగారు. ‘‘నేనెవరినో, ఎందుకు వచ్చానో తర్వాత చెబుతాను. మీరంతా ధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే, రారాజైన ధర్మరాజు చేసిన యాగం కానీ, దానధర్మాలు కానీ నిరుపేద బ్రాహ్మణుడైన సక్రుప్రస్థుడు చేసిన దానికన్నా గొప్పవి కావు కాబట్టి నవ్వొచ్చింది’’ అంది. ‘‘ఇంతకీ ఎవరా సక్రుప్రస్థుడు?’’ అనడిగాడు ధర్మరాజు అసూయగా. అప్పుడా ముంగిస ఇలా చెప్పింది. ‘‘కురుక్షేత్రంలో సక్రుప్రస్థుడనే పేద బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. వారు ఒక చిన్న పూరిపాక నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే నా బిలం ఉంది. ఆయన వెదురుబియ్యాన్ని ఏరుకొస్తే, దానినే పిండి చేసుకుని అందరూ జీవించేవారు. ఉన్నదానిలోనే ఆయన అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, సంతృప్తిగా జీవిస్తున్నాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు అందరూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. దాంతో ఆయనకు వెదురుబియ్యమే కాదు, ఎక్కడా భిక్ష కూడా దొరకడం లేదు. ఆకలి బాధకు అందరూ ప్రాణాలు కళ్లల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ధర్మదేవతకు ఆయనను పరీక్షించాలని బుద్ధిపుట్టి వారి ఇంటికి బాటసారి వేషంలో అతిథిగా వచ్చాడు. అప్పటికే మూడురోజుల నుంచి పస్తులున్న ఆ కుటుంబం తలా పిడికెడు పేలపిండిని తినడానికి కూర్చున్నారు. ఇంతలో అతిథి రావడంతో ఇంటి యజమాని అతణ్ణి సాదరంగా ఆహ్వానించి, కాళ్లకు నీళ్లిచ్చి, విస్తరి వేసి తన వాటా పేలపిండిని సమర్పించాడు. అతిథికి ఆకలి తీరినట్టు కనిపించలేదు. దాంతో సక్రుప్రస్థుని భార్య తన వాటా ఇచ్చింది. అది తిన్నాక కూడా, అతిథి కళ్లల్లో ఆకలి తీరిన జాడలు కనిపించలేదు. కుమారుడు తన వంతు పేలపిండిని ఇచ్చాడు. ఊహు.. ఆకలి తీరనే లేదు. కోడలు తన పేలపిండిని తెచ్చి వడ్డించింది. అప్పుడా అతిథి తృప్తిగా తేన్చాడు. ఒకపక్క ఆకలితో ప్రాణాలు కడగట్టిపోతున్నా సరే, అతిథినే దేవుడిగా ఎంచిన ఇంటి యజమాని, అతని ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించాడు. అతని బాటలోనే అతని భార్య, కొడుకు, కోడలు కూడా నడిచారు. వారి త్యాగానికి మెచ్చిన ధర్మదేవత తన నిజరూపంతో వారికి సాక్షాత్కారమిచ్చాడు. వారికోసం బ్రహ్మలోకం నుంచి విమానం వచ్చింది. ఆ నలుగురినీ వెంటబెట్టుకుని ధర్మదేవత సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లాడు. ఇదంతా చూసిన నేను సక్రుప్రస్థుడు అతిథికి అర్ఘ్యమిచ్చిన నీటిలో పొర్లాడాను. ఆ నీటితో తడిసినంత మేరా నా శరీర భాగాలు బంగారు రంగులోకి మారిపోయాయి. మిగతావి కూడా సువర్ణమయం అవుతాయేమోనన్న ఆశతో నేను ఎన్నో యజ్ఞశాలలకు వెళ్లి, వారు యజ్ఞం చేసిన ప్రదేశంలో పొర్లాడుతున్నాను కానీ, నా శరీరం బురదమయం, బూడిద మయం అవుతున్నదేగానీ, సువర్ణరూపు సంతరించుకోనేలేదు. ఇంతలో ధర్మరాజు గురించి విని, ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకూ అతడు దానం చేసిన గోవులు తరలి వెళ్లగా ఏర్పడిన మడుగులో పొర్లాడి వచ్చాను కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది అతన్నే అడుగుదామని ఇక్కడికి వచ్చేసరికి మీరంతా అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం చూసి నాకు నవ్వు వచ్చింది. ధర్మరాజు చేసిన దాన ధర్మాలేవీ భక్తితో చేసినవి కాదు. అహంకారంతో కూడుకున్నవి. అసలు అదంతా అతని కష్టార్జితం అయితేనే కదా... దాని ఫలితం అతనికి దక్కేది’’ అంటూ మరోమారు ఫక్కున నవ్వింది. ధర్మరాజుకు తల తీసేసినట్లయింది. అసంకల్పితంగా కృష్ణునివైపు చూశాడు. శ్రీకృష్ణుడు చిద్విలాసంగా చూస్తూ, జగన్మోహనంగా నవ్వాడు. ధర్మరాజుకు తన తప్పు తెలిసి వచ్చింది. - డి.వి.ఆర్ -
ఘనంగా వరుణ యాగం
వాన కురవాలి.. సిరులు పొంగాలి పాదగయ జలంలో కుక్కుటేశ్వరునికి అభిషేకం వెయ్యి కలశాల నీటితో గర్భగుడి దిగ్బంధం పిఠాపురం : రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరునికి సహస్రఘటాభిషేకం నిర్వహించారు. వేయి కలశాల నీటితో స్వామివారి గర్భాలయాన్ని నింపివేసి స్వామిని జలదిగ్బంధం చేశారు. కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, విశ్వేశ్వరస్వామి ఆలయాలలో సహస్రఘటాభిషేకాలు నిర్వహించారు. తొలుత వేదపండితులు మట్టికలశాలకు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. పాదగయ పుష్కరిణి చుట్టూ వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కుక్కుటేశ్వరస్వామికి పాలాభిషేకం, అనంతరం జలాభిషేకం నిర్వహించారు. గర్భగుడిని పాదగయ జలంతో నింపివేసి శివలింగం పూర్తిగా మునిగేలా జలదిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈఓ చందక దారబాబు పర్యవేక్షించారు. కాగా సామర్లకోట, ద్రాక్షారామ, అయినవిల్లి, తలుపులమ్మలోవ వంటి పుణ్యక్షేత్రాల్లోను వరుణయాగాలు జరిగాయి. పంపాలో ఋష్యశృంగుని విగ్రహం నిమజ్జనం అన్నవరం: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తూ రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని ప్రతిషి్ఠంచి గత మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపాలు ఆదివారం ముగిశాయి. ఉదయం 8 గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, ఋష్యశృంగమహర్షికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు వరుణ యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య దేవస్థానం పండితులు, ఈఓ నాగేశ్వరరావు హోమద్రవ్యాలను సమర్పించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్లు, ఋష్యశృంగమహర్షికి పండితులు వేదాశీస్సులందచేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మూడు రోజులు పూజలందుకున్న ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని వేదమంత్రాలు, మేళతాళాల మధ్య కొండదిగువన పంపా నదిలో నిమజ్జనం చేశారు. తొలుత రత్నగిరిపై పండితులు ఆ విగ్రహాన్ని శిరసున ధరించి ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు. ప్రధాన వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి అన్నవరంలో వాతావరణం మేఘావృతమై వర్షం కురిసింది. ఇదంతా వరుణ యాగ మహిమేనని పండితులు చెప్పారు. -
యాగం.. పరిసమాప్తం
అలంపూర్/అలంపూర్ రూరల్: వారం రోజులుగా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న చంyీ యాగం బుధవారం పూర్ణాహుతి ఘట్టంతో ముగించారు. కలెక్టర్ టీకే శ్రీదేవి చేతులమీదుగా ఈ కార్యక్రమం సాగింది. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హాజరయ్యారు. యాగానికి పెద్దఎత్తున వచ్చిన రుత్వికులు ‘పూర్ణాహుతిఉత్తమాం జుహోతి’ అంటూ మంత్రోచ్ఛరణ చేస్తూ పూర్ణాహుతిని యజ్ఞేశ్వరుడికి సమర్పించారు. ఆహుతులను కూడా ఉత్తమత్వాన్ని చేకూర్చే ఆహుతి పూర్ణాహుతి అంటారని వేదపండితుడు వెంకటకృష్ణ తెలిపారు. నాగార్జున తంత్రంలో చెప్పిన విశేషమైన వనమూలికలతో ఆహుతి అందజేశారు. అదేవిధంగా చండీదేవికి ప్రీతికరమైన ఎర్రటివస్త్రాన్ని ఆహుతిలో వేశారు. పాడిపంటలు అభివృద్ధి చెందాలని, వర్షాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, జలం సమృద్ధిగా ఉండాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ నమక చమకాలు పఠించారు. పూర్ణాహుతి ఫలం ఇది.. రాజభయ, అగ్నిభయ, చోరభయ.. అనే మూడు రకాల భయాలతో పాటు ప్రకతి ప్రకోపాల నుంచి రక్షించేందుకు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా ఈ చండీహోమాలు ఫలాన్నిస్తాయి. ఇందులో సత్వగుణం సరస్వతీ దేవి, రజోగుణం లక్ష్మీదేవి, తమోగుణం కాళీకాదేవి అనుగ్రహిస్తుంది. సత్వగుణం తెలుపునకు ప్రతీకగా, రజోగుణం, పసుపుకు ప్రతీకగా, తమో గుణం నలుపునకు ప్రతీకగా నిలుస్తాయని శతాధికయాగ ప్రతిష్టాచార్య వెంకటకష్ణ విశేషప్రాధాన్యాలను వివరించారు. సప్తమాత్రిక (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, చాముండి, మహాలక్ష్మి) దేవతలను ఆరాధిస్తూ రాష్ట్రంలోని ప్రజలందరికీ నవగ్రహ ఈతిబాధలు తొలగాలని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిని ప్రాణ ప్రతిష్ట చేసి శతచండీ యాగం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ లింగ్యానాయక్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బి.కృష్ణ, ఈఓ గురురాజ, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల పాల్గొన్నారు. -
పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం
యాదగిరిగుట్ట : స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హనుమ యాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా మండపారాధన, స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త, సారం రుద్రహవనము, మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్రం, యాదాద్రిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా, ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ యాగం నిర్వహించిన సూర్యానారాయణ ఘనాపాఠి తెలిపారు. -
పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం
యాదగిరిగుట్ట : స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హనుమ యాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా మండపారాధన, స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త, సారం రుద్రహవనము, మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్రం, యాదాద్రిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా, ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ యాగం నిర్వహించిన సూర్యానారాయణ ఘనాపాఠి తెలిపారు. -
కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్
-
అయుతం అద్భుతం
-
ఆద్యంతం తన్మయత్వం
-
కేసిఆర్‌కు ఆభినందనలు: అంబిక క్రిష్ణ
-
యాగవల్లి
వేద మంత్రాలతో ఘోషించిన ఎర్రవల్లి వైభవంగా ప్రారంభమైన అయుత చండీ యాగం అమ్మవారి సేవలో తరించిన భక్తజనం అయుత చండీ మహాయాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉదయం ఈ మహా క్రతువు మొదలైంది. సకల వసతులతో కూడిన ఏర్పాట్లు అందరిని కట్టిపడేశాయి. లోక కల్యాణం కోసం సీఎం కేసీఆర్ దంపతులు చేపట్టిన ఈ యాగంలో వందలాదిమంది వేద పండితులు ఒక్కచోట చేరి వేదాలు ఘోషించారు. గవర్నర్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం పెద్ద సంఖ్యలో అమ్మవారి పూజలో పాల్గొన్నారు. మహిళలు భారీ ఎత్తున కుంకుమార్చన నిర్వహించారు. చండీ మాత పూజతోపాటు యాగ నిర్వహణను అతిథులు, భక్తులు చూసి తరించారు. దాదాపు 50 వేల మందికి రుచికరమైన భోజనాలను వడ్డించారు. ఐదురోజుల మహోత్సవంలో మొదటిరోజు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. - జగదేవ్‌పూర్ ఐదువేల మందితో కుంకుమార్చన.. గజ్వేల్: చండీయాగం విజయవంతం చేసేందుకు యాగ శాల ప్రధాన ద్వారం సమీపంలో పెద్ద ఎత్తున కుంకుమార్చన నిర్వహించారు. ఐదు విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో ఒక్కోవిడతలో వెయ్యిమంది చొప్పున మహిళలు పాల్గొన్నారు. ఒక్కో విడత 45నిమిషాలపాటు సాగింది. 40 మంది వేద పండితులు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అమ్మవారికి వెయ్యి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. అయుత సంకల్పానికి దగ్గరి మార్గం.. సంగారెడ్డిలోని దుర్గాభవానీ క్షేత్రం నిర్వాహకులు కాసుల నర్సింహశర్మ, పవనశర్మ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. అయుత సంకల్పానికి ఇది చాలా దగ్గరి మార్గంగా అభివర్ణించారు. వెయ్యి సహస్ర నామాలుగా సాగే ఈ కార్యక్రమంలో ఒక్కో నామానికి ఒక్కో విశేషం ఉంటుందని చెప్పారు. కుంకుమార్చనలో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొని మహిళలతో కాసేపు ముచ్చటించారు. ఏర్పాట్లను అదనపు జేసీ వెంకట్వేర్లు, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు పర్యవేక్షించారు. 50వేల మందికి భోజనాలు జగదేవ్‌పూర్: అయుత చండీయాగానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణతోపాటు భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజన కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం భక్తులకు ఉప్మా, చెట్నీతో అల్పాహారమందించారు. మధ్యాహ్న భోజనంలో కందిపప్పు, ఆలుగడ్డ, కాలీఫ్లవర్‌తో కలిపి కూరలు చేశారు. బెండకాయతో పిండిచారు, పెరుగు, దొండకాయ పచ్చడితో భోజనం పెట్టారు. మధ్యాహ్నం 1:40 నుంచి భోజనాలు మొదలు పెట్టగా సాయంత్రం వరకు కొనసాగింది. 50 వేల మంది భోజనాలు చేసినట్టు అంచనా. లోక కల్యాణం కోసమే... శాంతి కోసం, లోక కల్యాణం కోసం చేస్తున్న యాగమిది. ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించడం. కరువు కాటకాలను తరిమికొట్టడం, పశుపక్షాదుల సంరక్షణ తదితర లక్ష్యాలు సైతం ఇందులో ఇమిడి ఉన్నాయి. నేను శృంగేరిలో, ప్రస్తుతం ఇక్కడ రెండసార్లు అయుత చండీయాగంలో పాల్గొన్నా. ఎంతో ఆనందంగా ఉంది. - ఆదిత్య శర్మ (వేద పండితులు, శివమొగ్గ, కర్ణాటక) యాగంతో మంచి ఫలితాలు నియమ నిష్టలతో చేృస్తున్న ఈ యాగంతో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కళ్లల్లో ఆనందం చూసేలా.. కరువును తరిమికొట్టాలని దేవతలను వేడుకునే క్రమంలో యాగం జరపడం సంతోషకరం. గతంలో శృంగేరి పీఠంలో... ప్రస్తుతం అయుత చండీ యాగాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. - శ్రీపాద శర్మ(హోస్పేట్, కర్ణాటక) ఏర్పాట్లు ఘనం... గతంలో మా క్షేత్రంలోనూ ఈ యాగం జరిగింది. వైదిక నిర్వహణలో మార్పుల్లేవు. కానీ ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. యాగశాలలు, వసతుల ఏర్పాట్లు పూర్తిగా ఆధ్మాత్మిక వాతావరణంలో సాగాయి. ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం మరెవరికీ సాధ్యం కాదు. - కాసుల నర్సింహ్మశర్మ (సంగారెడ్డిలోని దుర్గాభవానీ క్షేత్రం నిర్వాహకుల్లో ఒకరు) అంతా ఆధ్యాత్మికత... యాగశాల ప్రాంగణంలో అణువణువునా.... ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దృఢ సంకల్పంతో సీఎం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు యాగశాలను సందర్శించి చండీమాత అనుగ్రహానికి పాత్రులు కావాలి. నిజంగా ఇది మంచి అవకాశం. - పవన కుమార శర్మ (సంగారెడ్డి భవానీ క్షేత్రం నిర్వాహకుల్లో ఒకరు) -
ఆయుత చండీయాగం
-
ఎర్రవల్లిలో ‘అయుత’ శోభ
-
ఎర్రవల్లిలో ‘అయుత’ శోభ
రేపట్నుంచే మహా క్రతువు ప్రారంభం యాగ నిర్వహణకు పూర్తయిన ఏర్పాట్లు 40 ఎకరాల్లో అందంగా ముస్తాబైన ఆధ్యాత్మిక క్షేత్రం గజ్వేల్/జగదేవ్‌పూర్: భారీ యాగశాలలు.. హోమ గుండాలు.. రుత్విక్కుల కుటీరాలు.. వీవీఐపీల వసతి గదులు, రకరకాల పూల మొక్కలు, స్వాగత తోరణాలతో ‘నభూతో.. న భవిష్యతి’ అన్న తరహాలో అయుత యాగ క్షేత్రం సిద్ధమైంది. లోక కల్యాణార్థం సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ మహాక్రతువుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లేలా ఈ క్షేత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తయిన ఏర్పాట్లు.. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం ఫామ్‌హౌస్‌లో ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించే అయుత చండీయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 రోజుల నుంచి ఈ పనులు చేపడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్.. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రుత్వికుల కోసం ఏర్పా ట్లు పూర్తి చేశారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ ప్రజల కోసం 14 గ్యాలరీలు, లైటింగ్, బయో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి ఆశీస్సులతో అయిదు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ యాగం నిర్వహించనున్నారు. యాగానికి రాష్ట్రపతి, గవర్నర్, పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు రానున్నారు. హోమ గుండాలు సిద్ధం చండీయాగంలో భాగంగా మొత్తం 101 హోమ గుండాలను సిద్ధం చేశారు. హోమ చండీ, జప చండీ, తర్పణ చండీ, రుద్ర చండీ యాగాలను నిర్వహించనున్నారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 1,500 మంది రుత్విక్కులు ఈ యాగాల్లో పాల్గొంటారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. అయిదు రోజుల పాటు సాయంత్రం వేళ భక్తుల కోసం ఆధ్యాత్మిక, హరికథ కార్యక్రమాల నిర్వహించనున్నారు. 4 హెలిప్యాడ్లు.. 8 పార్కింగ్ స్థలాలు యాగానికి వచ్చే ప్రముఖుల కోసం వ్యవసాయ క్షేత్రం సమీపంలోని శివారు వెంకటాపూర్‌లో 4 హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సీఎంల కోసం వేర్వేరుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీలకు, వీఐపీలకు, భక్తులకు వేర్వేరుగా 8 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వీఐపీల పార్కింగ్‌కు పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఏర్పాట్లు చేశారు. నర్సన్నపేట సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. యాగానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యాలను కల్పించనున్నారు. ఐదెకరాల స్థలంలో విశాలమైన భోజనశాలను సిద్ధం చేశారు. ప్రముఖులకు ఏసీ గదులు చండీయాగానికి వచ్చే ప్రముఖుల కోసం ఆరు ఏసీ గదులను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యేకంగా గదులు కేటాయించనున్నారు. వేద పండితుల కోసం మరో 2 గదులను కేటాయించారు. మరొకటి ఇతర రాష్ట్రాల సీఎంలు, వీవీఐపీలకు కేటాయిస్తారు. వీటిని పర్ణశాలల ఆకారంలో అందంగా తీర్చిదిద్దారు. గదుల చుట్టూ వివిధ రకాల డిజైన్ చెట్లను పెట్టారు. యాగానికి వచ్చే అన్ని దారులు కాంతులు విరజిమ్మేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. వీటి కోసం ఫాంహౌస్ చుట్టూ కొత్తగా 6 ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. వైదిక పూజలు ప్రారంభం పాల్గొన్న సీఎం దంపతులు జగదేవ్‌పూర్: అయుత యాగశాలలో సోమవారం వైదిక కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నా రు. సీఎం కేసీఆర్ ఎర్ర అంచు పంచె ధరించగా.. సీఎం సతీమణి శోభ పట్టుచీర ధరించి గణపతి పూజలో పాల్గొన్నారు. 5 గంటల పాటు 18 రకాల పూజలు నిర్వహించారు. శృంగేరీ పురోహితులు పురాణం మహేశ్వశర్మ, ఫణిశాశంక్శర్మ, గోపాలకృష్ణశర్మ, 15 మంది రుత్విక్కులు పూజలు చేశారు. గురుప్రార్థన, గణపతి పూజ, దేవనాంది, అంకుర్పాణం, ప్రాశనం, గోపూజ, యాగశాల ప్రవేశం, యాగశాల సంస్కారం, అఖండ దీపారాధన, మహాసంకల్పం, సహస్రమోదక మహాగణపతి హోమం, మహామంగళ హారతి, ప్రార్థన, ప్రసాద వితరణం, సాయంకాలవాస్తు రాక్షోఘ్న హోమం, అఘెరాస్ట్ర హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎర్రవల్లిలో సీఎం దంపతులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. పురోహితులు పోచమ్మ, మైసమ్మ ఆలయాల వద్ద అమ్మవార్లకు వారితో పూజలు చేయించారు. వ్యవసాయక్షేత్రం చుట్టూ ఉన్న ఎర్రవల్లి, నర్సన్నపేట, శివారువెంకటాపూర్, దారమకుంట, ఇటిక్యాల, వర్ధరాజ్‌పూర్, పాండురంగ ఆశ్రమంలోని గ్రామ దేవతలకు కూడా సీఎం పూజా సామగ్రిని అందించారు. గ్రామస్తులు ఉదయమే దేవతలకు పూజలు చేశారు. సకల సౌకర్యాలు.. వీవీఐపీలకు, వీఐపీలకు, భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు.రాకపోకలకు అనుగుణంగా 50 బస్సులు ఏర్పాటు చేశారు. వంద మంది వలంటీర్లు సేవలందించనున్నారు. చండీయాగం వివరాలు మీడియాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేం దుకు ప్రత్యేక వైబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. వైఫై సౌకర్యాన్ని కల్పించారు. 24న చంద్రబాబు, 27న రాష్ట్రపతి ప్రణబ్ యాగానికి హాజరు కానున్నారు. భక్తుల కోసం ఇప్పటికే లక్షకు పైగా లడ్డూలు తయారు చేశారు. రోజూ 20 వేల నుంచి 50 వేల మంది భోజనాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సుమారు 5 వేల మంది పోలీసులు బందోబస్తుకు తరలివచ్చారు. యాగానికి వెళ్లే స్వాగత తోరణం ముం దు పోలీస్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. -
ఓం.. హలో హలో!
ఆత్మకూరు రూరల్ : జేబులో రూపాయి లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు రాత్రి సెల్లో మాట్లాడుతూ పడుకునే వారు కొందరైతే.. ఉదయాన్నే సెల్ అలారంతో మేల్కొనే వారు మరి కొందరు. రాత్రి కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడ.. అనే రోజులు పోయాయి. టైం ఎంత అంటే సెల్ కోసం జేబులోకి చేయి వెళ్తోంది. ఇలా సెల్ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడవుతోంది. సెల్ ఫోన్ అందరికీ అవసరమైన వస్తువుగా మారిపోయింది. కరివేన గ్రామంలో సుంకులమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జరిపిన యాగంలో మధ్య మధ్యలో పూజారి సెల్ మోగడం, ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవడం భక్తులవంతైంది. -
అమ్మ కోసం యూగం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అమ్మకు జైలు శిక్షపడి సోమవారానికి పదిరోజులు పూర్తయింది. అమ్మ దర్శనానికి నోచుకోక అన్నాడీఎంకే నేతలంతా తల్లడిల్లిపోతున్నారు. పార్టీలోని వారు విభాగాల వారీగా, విడతల వారీగా ప్రతిరోజు ఆందోళనలు చేపడుతున్నారు. ముగ్గురు మంత్రులు సోమవారం వేర్వేరుగా పూజలు, యాగా లు నిర్వహించారు. మంత్రి వలర్మతి మాంగాడు అమ్మన్ ఆలయంలో 108 కలశాలతో యాగాన్ని, ప్రత్యేక పూజను నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి సైదాపేటలోని ఇళంగాళీ అమ్మన్ ఆలయానికి చేరకున్నారు. చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరస్వామి తదితరులతో కలిసి ప్రార్థనలు జరిపారు. పూజ అనంతరం ఆలయం నుంచి నిప్పుల కుండను చేతబట్టి నగర రోడ్లపై నడిచారు. అలాగే మంత్రి గోకుల ఇందిర తలపై పాలబిందెను పెట్టుకుని ఊరేగింపుగా ఉదయం 10 గంటలకు వడపళని మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆమెతోపాటూ వెంట నడిచిన వేలాది మంది మహిళలు సైతం 1008 పాలబిందెలతో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఇక్కడి పూజలు పూర్తి చేసుకున్న అనంతరం పరశువాక్కంలోని పాతాళ పొన్నయమ్మన్ ఆలయంలో గోకుల ఇందిర అగ్నిగుండం వేసి రెండు గంటల పాటూ యాగం నిర్వహించారు. శోళింగనల్లూరులోని పళనిమమ్మాన్ ఆలయంలో మంత్రి కేఎం చిన్నయ్య 1008 మంత్రాలతో అర్చన, యాగం చేశారు. 140 కిలోమీటర్ల మానవహారం: నాగపట్నం జిల్లాలో 140 కిలోమీటర్ల పొడవునా మానవహారం నిర్మించి రికార్డు సృష్టించారు. ఇందులో 10 వేల మంది పాల్గొన్నారు. రామాపురంలో సైతం మానవహారం నిర్వహించారు. అన్నాడీఎంకే అనుబంధ శాఖలకు చెందిన నేతలు బీచ్‌రోడ్డులోని ఎంజీఆర్ సమాధి వద్ద నల్లచొక్కాలు ధరించి, అమ్మ ఫొటోలు చేతబూని నిరాహారదీక్ష నిర్వహించారు. తిరువాన్మియూర్ మరుందీశ్వర్, ఉత్తాండి నాగత్తమ్మన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాడి శివన్ ఆలయంలో యాగం చేశారు. పల్లికరనై ఓడియంపాక్కంలో నిరాహారదీక్షలు చేపట్టారు. చెన్నై కార్పొరేషన్ 168 వార్డు కౌన్సిలర్ నాయకత్వంలో నల్లచొక్కాలుధరించి,కళ్లకు నల్లగంతలుకట్టుకుని ర్యాలీ నిర్వహించారు. నీలగిరి జిల్లాలో సోమవారం దుకాణాలు మూసివేశారు. మినీ బస్సులను నిలిపివేశారు. నేడు కోయంబేడు మార్కెట్ బంద్: నగరంలో ని కోయంబేడు మార్కెట్వారు మంగళవారం బంద్ పాటిస్తున్నారు. మార్కెట్లోని దుకాణలన్నింటినీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు వ్యాపారస్తులు ప్రకటించారు. అలాగే ఆమ్నీ బస్సు యూజమాన్యాల సంఘం సైతం మంగళవారం బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బస్సులు నడపబోమని చెప్పింది. ఇద్దరు మృతి: అమ్మకోసం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అమ్మ జైలుపాలైన నాటి నుంచి ఆవేదనతో గడుపుతున్న కోయంబత్తూరుకు చెందిన మీసం చిన్ను (50) సోమవారం నిర్వహించే మానవహారంలో పాల్గొనేందుకు బయలుదేరిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చేపల వ్యాపారం నిర్వహించే మదురైకు చెందిన వీరపుష్పం (35) అనే మహిళ జయకు జైలు శిక్ష పడిన నాటి నుండి వ్యాపారానికి వెళ్లకుండా ఇంటి వద్దనే రోదిస్తూ గడిపేది. సోమవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. -
మిరపకాయలతో పూజలు
వాలాజ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో నేటి నుంచి ఐదువేల ఎండు మిరపకాయలతో ప్రత్యంగిరాదేవి యాగ పూజలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ మురళీధరస్వామి తెలిపారు. ధన్వంతరి పదవ వార్షికోత్సవం, పీఠాధిపతి 54వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని నెల రోజులుగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ధన్వంతరి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అందులో భాగంగా గురువారం ఉదయం నుంచి ఈనెల 25వ తేదీ వరకు ప్రత్యంగిరా దేవికి అభిషేకం చేసిన ఎండుమిరపకాయలతో పాటు భక్తులు సమర్పించిన సుమారు ఐదు వేల కిలోల ఎండు మిర్చితో ప్రత్యేక యాగ పూజలు నిర్వహిస్తారన్నారు. ఈ యాగ పూజల్లో బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ, బాలమురగన్ అడిమై స్వాములు, కలవై సచ్చిదానం స్వాములతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. భక్తులకు ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రత్యేక ధన్వంతరి ప్రసాదాలను అందజేయనున్నట్లు తెలిపారు.