ఎక్కడైతే చండీ పూజలందుకుంటుందో అక్కడ అకాల మరణాలుండవు. దుర్భిక్షం, దుఃఖాలు ఉండవు అని చెబుతున్న పద్మ పురాణంలోని శ్లోకం ఇదీ. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లిలో చేపట్టిన అయుత చండీయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శుక్రవారంతో యాగం మూడోరోజుకు చేరుకుంది. ధవళ వస్త్ర ధారణ చేసిన సీఎం కేసీఆర్ దంపతులు, రుత్విక్కులు గురు ప్రార్థనతో ఉదయం చండీ యాగాన్ని ప్రారంభించారు.