యాగం.. పరిసమాప్తం
యాగం.. పరిసమాప్తం
Published Wed, Aug 24 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
అలంపూర్/అలంపూర్ రూరల్: వారం రోజులుగా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న చంyీ యాగం బుధవారం పూర్ణాహుతి ఘట్టంతో ముగించారు. కలెక్టర్ టీకే శ్రీదేవి చేతులమీదుగా ఈ కార్యక్రమం సాగింది. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హాజరయ్యారు. యాగానికి పెద్దఎత్తున వచ్చిన రుత్వికులు ‘పూర్ణాహుతిఉత్తమాం జుహోతి’ అంటూ మంత్రోచ్ఛరణ చేస్తూ పూర్ణాహుతిని యజ్ఞేశ్వరుడికి సమర్పించారు. ఆహుతులను కూడా ఉత్తమత్వాన్ని చేకూర్చే ఆహుతి పూర్ణాహుతి అంటారని వేదపండితుడు వెంకటకృష్ణ తెలిపారు. నాగార్జున తంత్రంలో చెప్పిన విశేషమైన వనమూలికలతో ఆహుతి అందజేశారు. అదేవిధంగా చండీదేవికి ప్రీతికరమైన ఎర్రటివస్త్రాన్ని ఆహుతిలో వేశారు. పాడిపంటలు అభివృద్ధి చెందాలని, వర్షాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, జలం సమృద్ధిగా ఉండాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ నమక చమకాలు పఠించారు.
పూర్ణాహుతి ఫలం ఇది..
రాజభయ, అగ్నిభయ, చోరభయ.. అనే మూడు రకాల భయాలతో పాటు ప్రకతి ప్రకోపాల నుంచి రక్షించేందుకు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా ఈ చండీహోమాలు ఫలాన్నిస్తాయి. ఇందులో సత్వగుణం సరస్వతీ దేవి, రజోగుణం లక్ష్మీదేవి, తమోగుణం కాళీకాదేవి అనుగ్రహిస్తుంది. సత్వగుణం తెలుపునకు ప్రతీకగా, రజోగుణం, పసుపుకు ప్రతీకగా, తమో గుణం నలుపునకు ప్రతీకగా నిలుస్తాయని శతాధికయాగ ప్రతిష్టాచార్య వెంకటకష్ణ విశేషప్రాధాన్యాలను వివరించారు. సప్తమాత్రిక (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, చాముండి, మహాలక్ష్మి) దేవతలను ఆరాధిస్తూ రాష్ట్రంలోని ప్రజలందరికీ నవగ్రహ ఈతిబాధలు తొలగాలని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిని ప్రాణ ప్రతిష్ట చేసి శతచండీ యాగం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ లింగ్యానాయక్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బి.కృష్ణ, ఈఓ గురురాజ, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల పాల్గొన్నారు.
Advertisement