
ఓం.. హలో హలో!
ఆత్మకూరు రూరల్ : జేబులో రూపాయి లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు రాత్రి సెల్‌లో మాట్లాడుతూ పడుకునే వారు కొందరైతే.. ఉదయాన్నే సెల్ అలారంతో మేల్కొనే వారు మరి కొందరు. రాత్రి కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడ.. అనే రోజులు పోయాయి. టైం ఎంత అంటే సెల్ కోసం జేబులోకి చేయి వెళ్తోంది. ఇలా సెల్ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడవుతోంది. సెల్ ఫోన్ అందరికీ అవసరమైన వస్తువుగా మారిపోయింది. కరివేన గ్రామంలో సుంకులమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జరిపిన యాగంలో మధ్య మధ్యలో పూజారి సెల్ మోగడం, ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవడం భక్తులవంతైంది.