మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ | Man Offers Prayer To Buffaloes In Tamil Nadu For Modi | Sakshi
Sakshi News home page

మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ

Published Sun, May 19 2019 8:18 AM | Last Updated on Sun, May 19 2019 8:18 AM

Man Offers Prayer To Buffaloes In Tamil Nadu For Modi - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు. తూత్తుకూడి జిల్లా వల్లనాడులో నారాయణన్‌ అనే వ్యక్తి గోశాలను నిర్వహిస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ ఈ గోశాలలో ఇటీవల రహస్యంగా ప్రత్యేక యాగం నిర్వహించారు. గోశాలలోని 21 గేదెలకు 15 మంది వేదపండితులు నాలుగుగంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఒక గేదె కాలికి బంగారు గొలుసు అలంకరించి ప్రత్యేక యాగం నిర్వహించారు. గోప్యంగా జరిగిన ఈ యాగానికి మోదీ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి మాత్రమే ఫొటోలు తీయగా, మిగిలిన ఎవ్వరూ సెల్‌ఫోన్‌ తీసుకురాకుండా కట్టుదిట్టం చేశారని సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement