పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. చిత్రంలో స్వరూపానందేంద్రస్వామి
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలో సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగింది. యాగంలో భాగంగా గురువారం రాజశ్యామల యంత్రపూజ కార్యక్రమాన్ని రుత్వికులు ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్రావు, ఎమ్మెల్సీ కవిత యాగ క్రతువును పర్యవేక్షించారు.
యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ యాగంలో మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేశారు. అలాగే 11సార్లు శాలిని దుర్గ కవచ పారాయణం నిర్వహించారు. సర్వలోక సంరక్షణార్థం ఇంద్రసుక్త హోమం, నవగ్రహ సుక్త హోమం నిర్వహించారు. షాడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment