మన బతుకు ఇంతేనా అని బాధపడేవాళ్లం: సీఎం కేసీఆర్‌ | Telangana Elections 2023: CM KCR Key Comments At Gajwel BRS Activists Meet - Sakshi
Sakshi News home page

ఏం చేయాలో తెల్వని పరిస్థితి.. మన బతుకు ఇంతేనా అని బాధపడేవాళ్లం: సీఎం కేసీఆర్‌

Published Fri, Oct 20 2023 7:01 PM | Last Updated on Fri, Oct 20 2023 7:28 PM

CM KCR Key Comments At Gajwel BRS Activists Meet - Sakshi

సాక్షి, సిద్ధిపేట:  అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, ఇందులో తనకు ఎలాంటి సందేహాం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ఒక్కరోజు మొత్తం గజ్వెల్‌లోనే ఉంటూ. నియోజకవర్గ ప్రజలతో గడుపుతానని తెలిపారు. గజ్వేల్‌కు కావాల్సింది ఇంకా చాలా ఉందని, అవన్నీ చేపిస్తానని భరోసా ఇచ్చారు. అయతే కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందన్న కేసీఆర్‌.. ఆ కారణం ఏంటో మాత్రం వెల్లడించలేదు.

గజ్వెల్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించగా.. ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. గజ్వేల్‌ ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మోటర్‌ లేకున్నా సంపు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన కరువు ఉండేనని.. అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుంచి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చాయని గుర్తు చేశారు. అదే నేడు తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని చెప్పారు.

మన బతుకు ఇంతేనా అని బాధేపడ్డాం
ఈ మేరకు రాజకీయ జీవిత మొదలు పెట్టినప్పటి నుంచి తన ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను, తెలంగాణ ఉద్యమంలో అనుభవించిన కష్టాలను కార్యకర్తల సమావేశంలో పంచుకున్నారు. ‘24 ఏళ్ల క్రితం ఒక్కడినే బయల్దేరి వెళ్ళాను. ఆనాడు కొంత మంది మిత్రులము కూర్చొని మన బతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్ళం. నిస్పృహ, నిస్సహాయత ఉండేది కానీ ఏం చేయాలో తెల్వని పరిస్థితి. ఎక్కడ చూసిన చిమ్మని చీకటి, ఎవరిని కదిలించిన మన బతుకులుబేం ఉన్నాయి అనే ఆవేదన ఉండేది. నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో మన జిల్లా కేంద్రం సంగారెడ్డి. అక్కడకు పోవాలి అంటే 5, 6 గంటల సమయం పట్టేది.

మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాకపోయేవి. అప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే ఒక్కో బావికి 2, 3 వేలు ఖర్చు చేసిమంచిగా చేయించే పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్ దగ్గరకు 27 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేయించుకొని వెళ్ళాను. కానీ అప్పటి విద్యుత్ సంస్థల చైర్మన్ అన్ని ఒప్పుకుంటా కానీ స్లాబ్ మాత్రం చేంజ్ చేయం అని చెప్పారు. కానీ గట్టిగా పట్టిపడితే స్లాబ్ చేంజ్ చేశారు. 
చదవండి: కేసీఆర్‌ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్‌ గాంధీ

చంద్రబాబు మోసం చేశారు
ఆనాడు కరెంటు బిల్లు పెంచమని చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఇక లాభం లేదని చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందితో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చేస్తూ ముందుకు వచ్చా. నాతో ఎవరు కలిసి రాలేదు. నేను వస్తే కూడా జాకున్నారు. చివరికి తెలంగాణ సాధించుకున్నాం.

వలసలు ఆగాలని అనుకున్నాం
తెలంగాణ వచ్చిన రోజు చెట్టుకు ఒక్కరూ గుట్టకు ఒక్కరు అయ్యారు. మహబూబ్ నగర్‌తోపాటు మన మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి జరిగితే వలసలు అగుతాయని ఆలోచించాం. ఇప్పుడు వలసలు వాపసు వచ్చి అద్భుతమైన వ్యవసాయ రంగం పురోగమించింది. వీటన్నింటి నుంచి బయటకు రావాలి అంటే ఎలా అని ఆలోచించాం.ఎంతో మంది ఆర్ధిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడం.అప్పుడే వ్యవసాయ స్థిరీకరణ జరిగింది.

ఒక్కసారే ఓడిపోయాను
నేను ఒక్కసారే ఓడిపోయాను. అప్పుడు కూడా నేను ఓడిపోలేదు ఓడించబడ్డాను. ఆ సమయంలో ఈవీఎంలు లేవు. బ్యాలెట్‌ పేపర్‌లు ఉండే. కేవలం ఆరు ఓట్లతో ఓడించారు.  గజ్వెల్ బిడ్డలు నన్ను కడుపులో పెట్టుకొని గెలిపించారు. అయితే గజ్వేల్‌కు కొంత చేశాం ఇంకా చేయాలి. కరోనాతో కొంత ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయి. నాకు కూడా కరోనా వచ్చింది.

పదవులు వస్తాయి పోతాయి ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ముఖ్యం. రైతాంగం పంటలు పండించాలి. భూములు పోయిన భాధ చాలా పెద్దది. నాకు కూడా భాధ ఉంది. నా కూడా భూమి పోయింది. మా అత్తగారి ఊర్లో నా అత్తగారి భూమి, నా ఊర్లో భూమి కూడా పోయింది. మీరు ఇవాళ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయారు. మీకు ఇవాళ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుంది. 

తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి
ఇండియాలో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే సాధ్యం అయింది.మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నాం.అయిన కాంగ్రెస్ వాళ్లు ,కోదండరాం లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాలి. రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందాం. గజ్వెల్ లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు లు నిర్మాణం చేసుకున్నాము. మనం గెలుచుడు కాదు పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలని కోరుతున్నా. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి.గెలుస్తుంది.’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement