
వర్షాల కారణంగా వచ్చి చేరుతున్న నీటితో తెలుగు రాష్ట్రాల్లోని చెరువులు, చెలమలు జలకళ సంతరించుకున్నాయి. నీటి ప్రవాహంతో వాగులు కళకళలాడుతున్నాయి. కోవిడ్ టీకాలకూ నకిలీల బెడద తప్పడం లేదు. ఫేక్ వ్యాక్సిన్ల బారి నుంచి ప్రజలను కాపాడాలని పాలకులను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కారణంగా అమర్‌నాథ్ వార్షిక యాత్ర రద్దు కావడంతో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు పడుతుండటంతో తెలంగాణలో ‘హరితహారం’ సందడి మొదలయింది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి.

వర్షాలు విరివిగా కురుస్తుండటంతో ఏపీలో వరి నాట్లు ఊపందుకున్నాయి. విజయవాడలోని రామవరప్పాడుకు సమీపంలో ఉన్న చేలలో రైతులు నాట్లు వేస్తూ ఇలా కనిపించారు.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్, భూతాయి(బి), భూతాయి(కే) చెరువుల్లోకి భారీగా వరద పోటెత్తింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి మూడు చెరువులు మత్తడి దూకుతున్నాయి. సోమవారం ఉదయం చెరువులను చూసేందుకు వెళ్లిన గ్రామస్తులు, రైతులు మత్తడి వద్ద ఇలా చేపలు పట్టారు. –బజార్‌హత్నూర్(బోథ్)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమంలో ఊరూవాడా.. చిన్నాపెద్దా.. అందరూ పాల్గొంటున్నారు. తమ గ్రామంలో ఉచితంగా అందజేసిన మొక్కలను నాటేందుకు ఉత్సాహంగా తీసుకుని వెళ్తున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్‌పల్లికి చెందిన చిన్నారులు వీరు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని కుంటాల జలపాతం జలకళ సంతరించుకుంది. నిన్నమొన్నటి వరకు బోసిపోయిన జలపాతం 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తి కొత్త అందాలు సంతరించుకుంది. దీంతో ప్రకృతి ప్రేమికులు జలపాతం అందాలను వీక్షించేందుకు వస్తున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి ప్రకృతి సహజ సిద్ధమైన పచ్చని అడవితల్లి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న జలధారాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. – నేరడిగొండ (బోథ్)

కోవిడ్ నకిలీ వ్యాక్సిన్ల అంశంపై సోమవారం కోల్‌కతాలో నిరసన తెలుపుతున్న వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు

అమర్‌నాథ్ వార్షిక యాత్రను కోవిడ్ కారణంగా రద్దు చేయడంతో సోమవారం అమర్‌నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

ముంబై: బాంద్రాలో సోమవారం నూతనంగా ప్రారంభమైన రెండు లేన్ల సీలింక్–బీకేసీ వంతెన. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ఉద్ధవ్, మంత్రులు ఏక్‌నాథ్, ఆదిత్య ఠాక్రే తదితరులు

పాలస్తీనాలోని గాజా నగరంలో ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ చేపట్టిన వేసవి శిక్షణ శిబిరంలో డమ్మీ కట్టె తుపాకీలతో నేలపై పాకుతున్న యువకులు
Comments
Please login to add a commentAdd a comment