kuntala waterfalls
-
Telangana Tourism: ఆహ్లాదం వైపు అడుగులు.. పర్యాటకులకు ఇక పండగే (ఫొటోలు)
-
Photo Feature: నకిలీ టీకా.. నిరసన బాట
వర్షాల కారణంగా వచ్చి చేరుతున్న నీటితో తెలుగు రాష్ట్రాల్లోని చెరువులు, చెలమలు జలకళ సంతరించుకున్నాయి. నీటి ప్రవాహంతో వాగులు కళకళలాడుతున్నాయి. కోవిడ్ టీకాలకూ నకిలీల బెడద తప్పడం లేదు. ఫేక్ వ్యాక్సిన్ల బారి నుంచి ప్రజలను కాపాడాలని పాలకులను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కారణంగా అమర్నాథ్ వార్షిక యాత్ర రద్దు కావడంతో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు పడుతుండటంతో తెలంగాణలో ‘హరితహారం’ సందడి మొదలయింది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
కుంటాల సందర్శకులకు గుడ్ న్యూస్
సాక్షి, ఆదిలాబాద్: కుంటాల.. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. కుంటాల అందాలను వీక్షించేందుకు వచ్చేవారి అవస్థలను తొలగించడానికి మార్గం సుగమమైంది. పర్యాటకుల వసతి కోసం రిసార్ట్స్, కుటీరాలు నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ.3.81 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేస్తున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. గిరిజన సర్క్యూట్ అమలులో భాగంగా కేంద్ర స్వదేశీ దర్శన్ పథకం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే పనులు నడుస్తున్నాయి. కేంద్ర టూరిజం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్వదేశీ దర్శన్ పథకం కింద పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. ఈ పనులను ఐటీడీఏ అమలు చేస్తుండగా రాష్ట్ర పర్యాటక శాఖ అనుసంధానంగా పనిచేయనుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది పర్యాటకులు ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు వస్తుంటారు. అయితే, ఇక్కడ పర్యాటకులకు సరైన వసతి, ఇతర సౌకర్యాలు లేవు. తాజాగా కుంటాలకు దగ్గరలో గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఎకో ఎథెనిక్ రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఈ జలపాతం వద్ద అటవీ ప్రాంతం ఉంటుంది. దానికి తగ్గట్టు పర్యాటకులు ఉండేలా పర్యావరణానికి అనువుగా కుటీరాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పర్యాటకులు భోజనం చేసేందుకు డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులు ఇక్కడ విడిది చేయాలన్న ఉద్దేశంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైల్ ఫోటో -
కుంటాల సందర్శన.. అల్లు అర్జున్‌పై ఫిర్యాదు
సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల కుటుంబ సమేతంగా ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటించగా అతనితో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కుంటాల సందర్శన వివాదంగా మారింది. కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటరి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కరోనా నిబంధనలు ఉల్లఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని అల్లు అర్జున్‌పై నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. (అల్లు అర్జున్‌తో సెల్ఫీ కోసం పోటీలు..) బన్నీ పర్యటనకు కారణం కోరుతూ సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కోవిడ్ నేపథ్యంలో కుంటాల జలపాత సందర్శనను ప్రభుత్వం నిలిపి వేసిందని, అలాంటి సమయంలో అల్లు అర్జున్ ఎలా పర్యటించారో కారణం తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకున్నా పుష్ప సినిమా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన నేరడిగొండ పోలీసులు, దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. (అల్లు అర్జున్‌కు ఎలా అనుమతి ఇచ్చారు?) -
అల్లు అర్జున్‌కు ఎలా అనుమతి ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో అల్లు అర్జున్ శనివారం కుటుంబ సమేతంగా కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం జాలువారే అందాలను తిలకించారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి ప్రకృతి అందాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారులో గల హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలను వీక్షించారు. అంతకు ముందు హరితవనం పార్కులో మొక్కలు నాటారు. అయితే, కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఇటీవల నిర్మాత దిల్ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం వద్ద పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు సెలబ్రిటిలు, ప్రముఖులకు మాత్రం దగ్గరుండి జలపాతం అందాలను చూపించడం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. (చదవండి : మళ్లీ డ్రగ్స్ కలకలం.. తెరపైకి రకుల్) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జలపాతం వద్ద షూటింగ్ సందడి
నేరడిగొండ(బోథ్): రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద “నీలి నీలి’ అనే పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణకు హీరో నవికేత్, హీరోయిన్ నికితలు హాజరయ్యారు. డైరెక్టర్ బాబీ మాస్టర్, ఎంఎంపీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ చిత్రీకరణ జరిగింది. త్వరలోనే ఇక్కడ సినిమా షూటింగ్ నిర్వహించనున్నట్లు సినిమా బృందం సభ్యులు తెలిపారు. కుంటాల జలపాతంలో ఈ పాట చిత్రీకరణ బాగుంటుందన్నారు. -
విహారంలో విషాదం
సాక్షి, భైంసా, నేరడిగొండ: రైతు కుటుంబం పెట్టుకున్న ఆశలసౌధాన్ని కూల్చేసింది. జలపాతంలో సరదాగా విహరించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మోదులే శ్రీకాంత్ (20) అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బాసర మండలం దోడాపూర్ గ్రామానికి చెందిన మోదులే లాలప్ప, నాగరబాయి దంపతులు తమకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ పెద్ద కొడుకు సంతోష్, చిన్న కొడుకు శ్రీకాంత్‌తో పాటు కూతుర్ని చదివించారు. నిరుపేద కుటుంబం కావడంతో సంతోష్ చదువు మధ్యలోనే ఆపేశాడు. తాను చదువుకోకపోయినా అన్న ఉన్నత చదువులు చదవాలని అన్న సంతోష్‌ను చదివించేందుకు ముందుకొచ్చాడు. మహారాష్ట్రలో హోటల్ నడుపుతూ సంతోష్‌కు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నాడు. విహారయాత్రకు వెళ్లి.. నిర్మల్ జిల్లా బాసర మండలం దోడపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ మహరాష్ట్రలోని నాందేడ్‌లో టీ కొట్టు నడుపుకుంటున్నాడు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా శ్రీకాంత్ సోమవారం సరదాగా గ్రామంలోని తన మిత్రులతో కలిసి ఉదయం 9.30గంటలకు బయల్దేరారు. నిర్మల్ జిల్లాలోని కదిలి పాపేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కుంటాల జలపాతానికి సాయంత్రం 4.30గంటలకు చేరుకున్నారు. జలపాతానికి వెళ్లిన తర్వాత జలధారాల వద్ద శ్రీకాంత్ 4.45గంటల సమయంలో గల్లంతయ్యాడని స్నేహితులు తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్సై భరత్‌సుమన్ జాలర్లతో గాలించారు. 7.50గంటల సమయంలో జలపాతంలో శ్రీకాంత్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. అయితే మిత్రులు సరదాగా కోసం వచ్చి ఇలా మిత్రుడిని కోల్పోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతానికి ఆహ్లాదం కోసం వచ్చిన ప్రకృతి ప్రియులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అధికారులు రక్షణ చర్యలు తీసుకుంటున్నా వినకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది విహార యాత్రకు వచ్చి వారి కుటుంబాలకు విషాదాన్ని మిగిలిస్తున్నారు. -
అందాల నెలవు.. ఆదిలాబాద్
అడవులు, జలపాతాలకు పేరు గిరిజనులకు ఆలవాలం.. ఇది.. అనాదిగా అక్షరక్రమంలో ముందు తగ్గిన జిల్లా విస్తీర్ణం.. అడవుల జిల్లాగా.. ఆదివాసులు ఖిల్లాగా.. జలపాతాల నెలవుగా ఉన్న పేరు అలాగే ఉంది. కానీ వాటి పరిధి మాత్రం తగ్గనుంది. తూర్పున కొమురంభీం(ఆసిఫాబాద్) జిల్లా, ఉత్తర, పడమరల్లో మహారాష్ట్ర, దక్షిణాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మూడు జిల్లాల విభజనకు ముందు 16,105 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మొత్తం విస్తీర్ణం 4,153 కిలో మీటర్లు. నూతన జిల్లా ఏర్పాటుతో ఆదిలాబాద్ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రిమ్స్ వైద్య కళాశాల కాస్త పెద్ద రోగమొస్తే హైదరాబాద్‌కో, మహారాష్ట్రకో పోవాల్సిందే. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో నుంచి జిల్లాకు మెరుగైన వైద్యాన్ని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆయన హయాంలోనే ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని గిరిజన, పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చినట్లైంది. 500పడకలతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించిన ఆధునాతన పరికరాలు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారు. అందమైన కుంటాల దేశంలోని ఎత్తై జలపాతాలలో ఒకటిగా.. తెలుగు రాష్ట్రాలలోనే ఎత్తై జలపాతంగా పేరొందింది కుంటాల జలపాతం. నేరడిగొండ మండలం కుంటాల గ్రామం వద్ద కడెం వాగుపై ఎత్తై కొండలు, దట్టమైన అడవుల మధ్య ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. తెలంగాణ జిల్లాల పర్యాటకులతో పాటు మహారాష్ట్ర నుంచీ సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రకృతి ఒడిలో గలగల పారే ఈ జలపాతం మధ్యలో రాతిగుహలో సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు. పొచ్చెర జలజలా.. నిర్మల్-ఆదిలాబాద్ మార్గంలో 44వ జాతీయరహదారి(బోథ్ ఎక్స్‌రోడ్డు) నుంచి 5-6కిలోమీటర్ల దూరంలో బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది. ఎత్తై గుట్ట ప్రాంతం నుంచి గుండ్రని లోయకి జాలువారే ఈ జలపాతం చూడగానే ఆకట్టుకుంటోంది. చుట్టూ చెట్లతో ప్రకృతి ఒడిలో ఉందీ జలపాతం. ఇక్కడ ప్రభుత్వం పర్యాటకుల కోసం కార్తీకవనాన్ని ఏర్పాటు చేసింది. నాగోబా ఆలయం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉంది కోవెల. తరతరాలుగా తమదైన ప్రత్యేక సంప్రదాయాలతో మెస్రం వంశీయులు చేసే పూజలు, వారు నాగోబాను కొలిచే తీరు ఇక్కడి విశేషం. ఏడురోజుల పాటు నాగోబా జాతర ఘనంగా కొనసాగుతుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసే దర్బారులో గిరిప్రజల సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. ఐటీడీఏ కేంద్రం అడవినే నమ్ముకున్న ఆదివాసీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ. ఐఏఎస్ క్యాడర్ అధికారి ప్రత్యేకాధికారిగా ఈ సంస్థ గిరిజన ప్రజల సంక్షేమం, పురోభివృద్ధి కోసం పనిచేస్తోంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. గిరిజనులు చేసే ఉత్పత్తులు అమ్మేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్య, వైద్య, యువత, మహిళలకు ఉపాధి, గిరిజనుల హక్కుల కోసం కృషిచేస్తోంది. లక్ష్మీనారాయణస్వామి ఆలయం మహారాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతం నుంచి తీసుకువచ్చి, పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం తెలంగాణకే తలమానికం. 11 శతాబ్ధంలో జైనులు నిర్మించినట్లు చెబుతుంటారు. కార్తీక మాసంలో నేరుగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడటం విశేషం. డిసెంబర్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సాత్నాల ప్రాజెక్టు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు సామర్థ్యం 1.5024 టీఎంసీ. ఆయకట్టు 25వేల ఎకరాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు కింద లక్ష్మీపూర్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టడం పూర్తయ్యింది. దీనికి 7,600 ఎకరాల ఆయకట్టు ఉంది. కొరటా-చనాఖా బ్యారేజీ తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందం ఈ ప్రాజెక్టు. జిల్లా సరిహద్దులో ఉన్న పెన్‌గంగ నదిపై మండలంలోని కోర్ట, మహారాష్ట్రలోని చనాఖా గ్రామాల మధ్య బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పనులు నిలిచాయి. మొత్తం 51 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. -
జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి
ఆదిలాబాద్(కుంటాల): హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కుంటాల జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడు గుండ్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని తార్నకకు చెందిన ఊటుకూరి చైతన్య(24), స్నేహితులతో కలసి జలపాతాన్ని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.