'తాగిన వారిని శిక్షించడమెందుకు?'
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లను ఇష్టారాజ్యంగా నడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం తాగిన వారిని ఎందుకు శిక్షిస్తోందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. బార్లపై నియంత్రణ అమలు చేయాలని.. అప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హరితహారంపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాటిన మొక్కలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. వాటికి కనీసం ట్రీగార్డ్సు ఏర్పాటు చే య లేదన్నారు.